ప్ర‌తిప‌క్షాలు కేసీఆర్ ట్రాప్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేవా..?

కింద‌ప‌డ్డా కూడా పైచేయి నాదే అని చెప్పుకోవ‌డం ఒక్క కేసీఆర్ సాబ్ కి మాత్ర‌మే సాధ్యం! ఆర్టీసీ స‌మ్మె వ్య‌వ‌హారంలో ఆయ‌న త‌గ్గాల్సి వ‌చ్చింది. ఒత్తిళ్ల‌కు చివ‌రికి త‌లొగ్గాల్సి వ‌చ్చింది. సెల్ఫ్ డిస్మిస్ అనీ, ఆర్టీసీకి ముగింపు మూసేయ‌డ‌మే అనీ… ఇలా భారీ ప్ర‌క‌ట‌న‌లు చేసి, ఇప్పుడు పూర్తిగా యూట‌ర్న్ తీసుకున్నారు. కానీ, ఆ ట‌ర్న్ ని కూడా దాన్ని త‌న ద‌యాగుణంగా మార్చి ప్రొజెక్ట్ చేశారు, డౌన్ డౌన్ అని నిన‌దించిన‌ కార్మికుల‌తో పాలాభిషేకాలు అందుకుంటున్నారు! ద‌టీజ్ కేసీఆర్. ఏదైతేనేం దాదాపు రెండునెల‌ల‌పాటు సాగిన స‌మ్మెకు ఫుల్ స్టాప్ ప‌డింది. అయితే, ఇక్క‌డ ప్ర‌తిప‌క్షాలు నేర్చుకోవాల్సి చాలా ఉంది. తాను యూట‌ర్న్ తీసుకుంటూ కూడా ప్ర‌తిప‌క్షాల‌పై మ‌రో దెబ్బ వేసేశారు కేసీఆర్! నిన్న‌మొన్న‌టి దాకా కార్మికుల ప‌క్షాన మాట్లాడుతూ వ‌చ్చిన ప్ర‌తిప‌క్ష పార్టీలు.. ఇప్పుడు నోరు మూసుకుని చోద్యం చూడాల్సిన ప‌రిస్థితి. ఇంత‌కు ముందు కూడా ఇలానే ప్ర‌తిప‌క్షాల‌ను త‌న ట్రాప్ లో ప‌డేస్తూ న‌డిపించారు కేసీఆర్.

గ‌డ‌చిన రెండునెల‌లే తీసుకుంటే… ఒక్క ఆర్టీసీ ఇష్యూ చుట్టూ మాత్ర‌మే ప్ర‌తిప‌క్షాలు చ‌క్క‌ర్లు కొట్టాయి. హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో ఆ ఒక్క అంశ‌మే బాగా ప్లస్ అయిపోతుంద‌ని భావించి, మిగ‌తావి ప‌ట్ట‌న‌ట్టుగా కాంగ్రెస్ తో స‌హా అన్ని పార్టీలూ వ్య‌వ‌హ‌రించాయి. ఆర్టీసీ స‌మ్మె వ్య‌వ‌హారాన్ని ఘాటైన వ్యాఖ్యల‌తో కెలుకుతూ ప్ర‌తిప‌క్ష నాయ‌కుల్ని ఆ ఒక్క అంశం మీద మాత్ర‌మే ఫోక‌స్ చేసేలా కేసీఆర్ న‌డిపించ‌డంలో స‌క్సెస్ అయ్యారు! వేరే స‌మ‌స్య‌పై ప్ర‌తిప‌క్షాలు మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌కుండా న‌డిపించారు. ఫ‌లితం ఏమైందో తెలిసిందే. ఈ స‌మ్మె త‌మ‌కేదో రాజ‌కీయంగా మేలు చేస్తుందీ అనుకుంటే… చివ‌రికి నెపాన్నంతా ప్ర‌తిప‌క్షాలు, యూనియ‌న్ల‌పై నెట్టేసి…. కేసీఆర్ మ‌న‌సున్న నాయ‌కుడు అనే ప్రొజెక్ష‌న్ తో ఇప్పుడు కార్మికుల‌ను ఆక‌ర్షించేశారు!

ఇప్ప‌టికైనా ప్ర‌తిప‌క్షాలు ఇది గుర్తించాలి. రాష్ట్రంలో చాలా స‌మ‌స్య‌లున్నాయి. రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రంలో జ‌రిగిన అభివృద్ధి ఇదీ అని చెప్పుకోవ‌డానికి ఏదీ లేదు. మంత్రి వ‌ర్గ ఏర్పాటే ఆల‌స్యంగా త‌న‌కు న‌చ్చిన‌ట్టు చేసుకున్నారు. 57 ఏళ్ల‌కే పెన్ష‌న్లు, రైతుబంధు చెక్కులు ఇంకా చాలాచోట్ల ప్ర‌జ‌ల‌కు అంద‌లేదు. ఇంట‌ర్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు, హైద‌రాబాద్ లో రోడ్ల ప్ర‌మాదాలు, డెంగీ జ్వ‌రాలు, విత్త‌నాల కొర‌త‌, ఎరువుల కొర‌త‌, రెవెన్యూ శాఖ‌లో తీవ్ర‌మైన అవినీతి… ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స‌మ‌స్య‌లున్నాయి. ప్ర‌తిప‌క్షాలు ఫోక‌స్ చెయ్యాల్సిన‌వి ఇవి. భాజ‌పాగానీ, కాంగ్రెస్ గానీ… ఇంకా కేసీఆర్ ట్రాప్ లో ప‌డ‌కుండా ఉంటూ, ప్ర‌జ‌ల్లో ఉంటే కొంతైనా వారికీ రాజ‌కీయంగా ప్ల‌స్ అవుతుంది. లేదంటే… ఇదిగో ఇప్పుడు ఆర్టీసీ అంశంలో బిక్క మొహాలేసిన‌ట్టే, ప్రేక్ష‌క‌పాత్ర‌కు ప‌రిమితం కావాల్సి వ‌స్తుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close