ఇది చంద్ర‌బాబు పెట్టిన దుకాణమన్న కేసీఆర్..!

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా విద్యుత్ ఉద్యోగుల‌కు 35 శాతం వేత‌న స‌వ‌ర‌ణ‌ ప్ర‌క‌టించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌ర్తించే హెల్త్ స్కీమ్ ను విద్యుత్ కార్మికుల‌కు వ‌ర్తింప‌జేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్‌లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో విద్యుత్ ఉద్యోగుల‌ను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. 50 వేలమందిలో ఆరు వేల మందికి జీపీఎఫ్ స‌మ‌స్య ఉంద‌నీ, అది కేంద్రం ప‌రిధిలోని అంశ‌మనీ, వివాదంలో ఉన్న సీపీఎస్ ను కూడా ప‌రిష్క‌రించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. దీంతో విద్యుత్ ఉద్యోగులు హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేశారు.

రాష్ట్రం దేశంలోనే నంబ‌ర్ వన్ స్థానంలో ఉంద‌నీ, గ‌డ‌చిన నాలుగున్న‌రేళ్ల‌లో అభివృద్ధిలో దూసుకుపోతోంద‌నీ, ఇత‌ర రాష్ట్రాలేవీ తెలంగాణ ద‌రిదాపుల్లో లేవ‌న్నారు. తెలంగాణ ఏర్ప‌డ్డాక అభివృద్ధి సాధించిన మొట్టమొద‌టి శాఖ విద్యుత్ శాఖ అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, ప‌థ‌కాలు, ప‌రిశ్ర‌మ‌లు.. ఇలా ఏవి తీసుకున్నా ఈరోజున అభివృద్ధి బాట‌లో ఉన్నాయంటే దానికి కార‌ణం విద్యుత్ ఉద్యోగుల ప‌నితీరు అని మెచ్చుకున్నారు. రైతుల‌కు కూడా 24 గంట‌లు క‌రెంటు ఇచ్చే రాష్ట్రంలో దేశంలో ఒక్క తెలంగాణ మాత్ర‌మే అని కేసీఆర్ అన్నారు.

కేసీఆర్ ప్ర‌సంగం ఇలా ముగుస్తున్న స‌మ‌యంలో… ఓ కాంట్రాక్టు ఉద్యోగి త‌మ స‌మస్య‌ల‌ను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. ఈ స‌మ‌యంలో కేసీఆర్ స్పందిస్తూ… ‘చంద్ర‌బాబు నాయుడు పెట్టి దుకాణం ఇది. కరెంటు బిల్లు చేసేది ప్రైవేటోళ్ల‌కిచ్చి, అవుట్ సోర్సింగ్ అని పెట్టి… అదే దుకాణం క‌దా ఇది. ఇది వాళ్లు పెట్టిపోయిన పంచాయితీ. చంద్ర‌బాబు పెట్టిన దుకాణం మీద‌గ్గ‌రే కాదు.. చాలా చోట్ల ఉంది’ అన్నారు. ఇలాంటివారు శాఖ‌లో దాదాపు వెయ్యి మంది ఉంటార‌నీ, వారికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై కూడా సానుకూలంగా స్పందిస్తామ‌నీ హామీ ఇచ్చారు. ఈ కాంట్రాక్టు ఉద్యోగుల స‌మ‌స్య చాలాచోట్ల ఉంద‌నీ, అవుట్ సోర్సింగ్ అని గ‌తంలో పెట్టిన‌వాటిని కొన్ని చోట్ల తీయించామ‌నీ, ఇచ్చే మొత్తాన్ని నేరుగా వారికే చేరేలా చేశామ‌న్నారు. దీంతో ఆయ‌న ప్ర‌సంగం ముగించారు.

ఈ స‌భ‌లో విద్యుత్ ఉద్యోగులంద‌రికీ వ‌రాలు కురిపించ‌డంతో అంద‌రూ హ్యాపీగానే ఉన్నారు. కానీ, ఈ అవుట్ సోర్సింగ్ ఇష్యూ వ‌చ్చేస‌రికి… దీన్ని చాలా తెలివిగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మీద కేసీఆర్ నెట్టేశారు! ఇదంతా గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పు అన్న‌ట్టు చెప్పారు. చాలా డిపార్టుమెంట్ల‌లో ఇలాంటి స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించామ‌ని చెప్పిన కేసీఆర్‌… ఈ విద్యుత్ శాఖ‌కు వ‌చ్చేస‌రికి ఇది త‌న త‌ప్పు కాదు, వేరేవ‌రో చేసినది అన్న‌ట్టు మాట్లాడ‌టం గ‌మ‌నార్హం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close