‘ప‌టాస్’ .. రానా చేసుంటే..?

సురేష్ బాబు జ‌డ్జిమెంట్ చాలా బాగుంటుంద‌ని ప‌రిశ్ర‌మ‌లో వాళ్లంద‌రూ చెప్పేమాట‌. అది నిజం కూడా. ఆయ‌నో సినిమా ప‌ట్టుకున్నారంటే… క‌చ్చితంగా అందులో విష‌యం ఉండే ఉంటుంది. అందుకే ఆయ‌న ప్రాజెక్టుల్లో పెద్ద‌గా డిజాస్ట‌ర్లు క‌నిపించ‌వు. ఓ క‌థ వింటే.. అది ఏ రేంజు సినిమా అవుతుందో ఊహించి చెప్ప‌గ‌ల‌రు. అలాంటి సురేష్ బాబు తెలిసి తెలిసి ఓ సూప‌ర్ హిట్ జార‌విడ‌చుకున్నారు. అదే.. `ప‌టాస్‌`. క‌ల్యాణ్‌రామ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం… క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. అయితే ఈ క‌థ రానా చేయాల్సింద‌ట‌. సురేష్ బాబు ఈ క‌థ విని, లాక్ చేసి, అందులో మార్పులు చేర్పులు కూడా చేసి… చివ‌రి నిమిషంలో వ‌దులుకున్నార్ట‌. ఈ విష‌యాన్ని సురేష్ బాబునే చెప్పారు. ”ప‌టాస్ క‌థ మేం చేయాల్సిందే. రానా కోసం అనుకున్నాం. స్క్రిప్టు పూర్త చేసి వ‌దులుకున్నాం. క‌థ‌పై న‌మ్మ‌కం లేక కాదు. ఆ స‌మ‌యంలో బాహుబ‌లి షూటింగ్‌తో రానా బిజీగా ఉన్నాడు. ఆ సినిమా ఎప్పుడు అవుతుందా? అని మేమంతా ఎదురు చూశాం. బాహుబ‌లికి అన్నేళ్లు స‌మ‌యం ప‌డుతుంద‌ని మేం అస్స‌లు ఊహించ‌లేదు. ‘పెళ్లి చూపులు’ క‌థ ముందు నేనే విన్నాను. ఆ త‌ర‌వాతే రాజ్ కందుకూరి చేతిలో పెట్టా. త‌రుణ్ భాస్క‌ర్ చెప్పిన‌దానికంటే చాలా బాగా తీశాడు. అంత బాగా తీస్తాడ‌ని నేను కూడా ఊహించ‌లేదు. ఇలా ఒక‌ట్రెండు విష‌యాల్లో త‌ప్ప నా జ‌డ్జిమెంట్ ఎప్పుడూ త‌ప్పు కాలేదు” అని చెప్పుకొచ్చాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com