తెలకపల్లి వ్యూస్ : హరీశ్‌ పాత్రలో కెసిఆరా?

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ శాసనసభలో ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెజంటేషన్‌ ప్రతిభావంతమైన వ్యవహారమే అయినా మరీ అతిగా పొగిడేందుకు కొందరు పోటీ పడటం హాస్యాస్పదం. ఈ ప్రక్రియ వచ్చి దశాబ్దాలు గడిచిపోయాయి.ఇప్పుడు ఇంకా సులభతరమైంది కూడా.సూళ్లలో కాలేజీల్లో కూడా వాడుకలో వుంది. వాస్తవానికి గతంలో చంద్రబాబు నాయుడు ఇలాటి వాటిపై చాలా మోజు చూపేవారు. శాసనసభలో ప్రెజంటేషన్‌ చేయడం ఇదే మొదటిసారి కావచ్చు గాని ఇదే తుది వాక్యం కావడానికి అవకాశముండదు. సాధారణ చర్చ ఎలాగూ తప్పదు. కాకపోతే ముఖ్యమంత్రి దృష్టికోణం కళ్లకుకట్టి చూపడానికి అదనంగా ఉపయోగం కావచ్చు.

ఈ ఉదంతంలో అంతగా చర్చించని కోణం మరొకటి వుంది. అది నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌ రావు పాత్ర. యువ నాయకుడుగా చురుగ్గా పనిచేసే హరిష్‌ వుండగా కెసిఆర్‌ తనే అన్నీ వివరించాల్సిన అవసరం వుందా? అందులో హరీశ్‌ చెప్పలేనివి ఏమైనా వున్నాయా? ఉద్యమ నేతగా కెసిఆర్‌ స్థానం ఆయనదైనా ఒకసారి సంబంధిత మంత్రి వివరించాక జోక్యం చేసుకోవడం వేరు.

ఇప్పటికే ప్రాజెక్టుల పూర్తికి కమిటీ అంటూ ఆయనతో పాటు మరో ఇద్దరు మంత్రులను నియమించారు. ఇప్పుడేమో తనే రంగంలోకి దిగారు. మాటల మధ్యలోనూ ఆయన పేరును పెద్దగా ప్రస్తావించలేదు. కారణాలేమైనా ఇది మంచి సంప్రదాయం కాదని నిపుణులు భావిస్తున్నారు. మరో సందర్భంలోనైనా సంబంధిత మంత్రితో మాట్లాడించడం గౌరవంగా వుంటుంది.

శాసనసభలో ఈ తతంగం ముగిసిన మర్నాడే కెటిఆర్‌ హైదరాబాదులో పర్యటనకు బయిలుదేరడం దానికి మీడియాలో చాలా ప్రచారం రావడం చూస్తే తేడా మరింత ప్రస్పుటమవుతుంది. ఇవన్నీ అనవసరమైన పరిశీలనలని ముఖ్యమంత్రి శిబిరం అనవచ్చు గాని బాహాటంగా కనిపించేవాటిపై మాట్లాడకుండా వుండటం ఎలా సాధ్యం?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close