ఎన్నికల ఫలితాల కారణంగా కేసీఆర్‌లో “గుణాత్మక మార్పు”..!

పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు… టీఆర్ఎస్‌ అధినేతలో గుణాత్మక మార్పు తీసుకొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు బీజేపీ పునాదులు.. బలంగా పడ్డాయనే ఆందోళన.. మరో వైపు .. కాంగ్రెస్ పుంజుకుందనే… అంచనాలు కూడా… కేసీఆర్‌ను ఇబ్బంది పెడుతున్నాయి. ఓ వైపు జాతీయ రాజకీయాల కలలు నెరవేరకపోగా.. చాప కిందకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉండటంతో… వెంటనే.. దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.

టీఆర్ఎస్‌లో ఇక గుణాత్మక మార్పులుండవ్..!

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు కోసం జాతీయ రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషిస్తామన్న కేసిఆర్.. ఈ నినానాధంతోనే లోక్ సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవసరమైతే ఢిల్లీకి మారిపోతానని ప్రకటించారు. టిఆర్ఎస్ సహా ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడుతాయని భావించి.. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు కూడా చేశారు. ఆ సందర్భంలో కేంద్రంలో వచ్చేది హంగేనని కేసిఆర్ ఉప ప్రధాని అవుతారని టీఆర్ఎస్ నేతలు భావించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటిఆర్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతారన్న ప్రచారం ఫలితాలు వెళ్లడవ్వక ముందు వరకు సాగింది. కానీ ఇప్పుడు… పరిస్థితి మారిపోయింది.

బీజేపీ చాపకిందకు నీళ్లు తెస్తోందనే ఆందోళన..!

ఢిల్లీ సంగతి అటుంచితే.. ఇటు తెలంగాణ లో పోటీ చేసిన లోక్ సభసీట్ల ఫలితాలు టిఆర్ఎస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత ఎన్నికల్లో టిడిపి పొత్తుతో పోటీ చేసి కేవలం ఒకే ఒక్క సీటు బిజేపి దక్కించుకుంటే.. మొన్నటి ఎన్నికల్లో వందకు పైగా సీట్లల్లో డిపాజిట్ కూడా దక్కించుకోక చేతులెత్తేసిన కమలం పార్టీ ఎలా నాలుగు సీట్లు దక్కించుకుందని తలలు బద్దలు కొట్టుకుంటోంది. ఎన్నికల ఫలితాలపై కేసిఆర్ స్పందించేందుకు ఇష్టపడలేదు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నో మార్పులు జరుగుతాయని టిఆర్ఎస్ నేతలు భావించారు. మలి విడత మంత్రి వర్గ విస్తరణపై సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల పై ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజా ఫలితాలు టిఆర్ఎస్ లో నిరాశను నింపాయి. ఎప్పుడు సందడిగా ఉండే తెలంగాణ భవన్ సైలెంట్ గా మారింది. కేసిఆర్ కుమార్తె సీటు కూడా కమలం పార్టీ సునామి లో కొట్టుకు పోవడాన్ని నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

మంత్రులకు ఊస్టింగ్ ఖాయమే..!

గ్రేటర్ హైదరాబాద్ పరధిలో, సిటిని ఆనుకుని ఉన్న సికింద్రాబాద్, మల్కాజిగిరి స్థానాల్లో ఒటమి చెందడంపై కేసిఆర్ స్థానిక నేతలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. చేవెళ్లలో అతి కష్టం మీద రంజిత్ రెడ్డి బయటపడ్డారు. జూలైలో జెడ్పీ, ఎంపీపీ ఛైర్మన్ ఎన్నికల తర్వాత మలి విడత మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ఎంపీ సీట్లను గెలిపించడంలో విఫలమైన మంత్రులకు ఉద్వాసన తప్పదని చెబుతున్నారు. ఈ జాబితాలో ముందుగా తలసాని ఉన్నారు. ఆయన తన కొడుక్కి… పట్టుబట్టి టిక్కెట్ దక్కించుకున్నారు కానీ.. విజయం కోసం ప్రయత్నించలేదు. సనత్ నగర్‌లో… గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 70వేల ఓట్లు వస్తే.. లోక్‌సభ ఎన్నికల్లో 35వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇది కూడా కేసీఆర్ ఆగ్రహానికి కారణం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి అమ్మకం ఆస్తుల లిస్ట్ చాలా పెద్దదే..!?

తమిళనాడులో నిరర్థకంగా ఉన్న ఆస్తులను అమ్ముతున్నామని వాటిని అమ్మేస్తే.. రూ. కోటిన్నర కూడా రాదంటూ... అధికార పార్టీ నేతలు వాదిస్తున్నారు. మరి కోటిన్నర కోసమే ఇన్ని విమర్శలను ఎందుకు ఎదుర్కొంటున్నారు.. దేవుడి ఆస్తుల్ని...

ప్రజల భాగస్వామ్యంతో.. “మన పాలన – మీ సూచన..!”

అధికారం చేపట్టి ఏడాది అవుతున్న సందర్భంగా.. ఏపీ సర్కార్ పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలనుకుంది. దాని ప్రకారం ఐదు రోజుల పాటు మేథోమథనం నిర్వహిస్తోంది. ప్రజల ఆలోచనలు, సూచనలను నిరంతరం పరిగణనలోకి తీసుకుంటూ...

నేనూ లైంగిక వేధింపులు ఎదుర్కున్నా

చిత్ర‌రంగంలో లైంగిక వేధింపులు స‌ర్వ‌సాధార‌ణ విష‌యంగా మ‌రిపోయింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ... ఈ విష‌యంలో నోరు మెద‌ప‌లేదు. `చెబితే అవ‌మానం` అని భ‌య‌ప‌డ్డారు. కానీ ఆ భ‌యాల్ని వ‌దిలి.. బ‌య‌ట‌కు వ‌స్తున్నారు...

ఇక పూరి.. ద‌బాంగ్‌!

బాలీవుడ్‌లో ఓ సినిమా చేయ‌డానికి పూరి జ‌గ‌న్నాథ్ గ‌ట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఓ బాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమా చేయబోతున్న‌ట్టు పూరి ఇటీవ‌లే ప్ర‌క‌టించాడు. అందులో ఓ అగ్ర క‌థానాయ‌కుడు...

HOT NEWS

[X] Close
[X] Close