‘ఇక్కడేం పని’ అనటం ఆంధ్రా ఓటర్లపై ప్రభావం చూపుతుందా?

హైదరాబాద్: కొన్నిరోజులుగా మిత్రధర్మం పాటించిన తెలుగు చంద్రులు నిన్న మళ్ళీ కత్తులు దూసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. ఇద్దరూ నిన్న గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారని ముందే సమాచారం బయటకొచ్చినప్పటికీ, ఇద్దరిలో కేసీఆర్ ప్రెస్ మీట్ మొదట ప్రారంభమయింది… మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో. చంద్రబాబు 4 గంటల ప్రాంతంలో పఠాన్ చెరువులో రోడ్ షోను ప్రారంభించారు. కేసీఆర్ తన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, చంద్రబాబుపై దాడికి దిగారు. అసలు చంద్రబాబుకు ఇక్కడేం పని అన్నారు. ఊడ్చుకోవాలంటే 13 జిల్లాలున్నాయని ఎద్దేవా చేశారు. ఆయన ఇక్కడ ప్రచారం చేయటం అసంబద్ధమని, వృథా ప్రయాస అని కూడా అన్నారు. మరోవైపు చంద్రబాబు గత కొన్ని రోజులుగా అనుసరించిన వైఖరినే కొనసాగిస్తూ కేసీఆర్‌పై విమర్శలేమీ చేయలేదు. అయితే ఇక్కడేం పని అంటూ కేసీఆర్ చేసిన విమర్శలపై స్పందించారు. కొంతమంది తనకు ఇక్కడేం పని అంటున్నారని, తాను ఎక్కడకీ వెళ్ళనని, ఇక్కడే ఉంటానని చెప్పారు(మరి ఏపీని ఏం చేస్తారో?).

అయితే చంద్రబాబుపై కేసీఆర్ వ్యాఖ్యలు ఆయన రాజనీతిజ్ఞతకు తగ్గట్టుగా లేదనే ఒక వాదన వినిపిస్తోంది. ఆ వ్యాఖ్యలు గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు నష్టం కలిగించేవిధంగా ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కాబట్టి హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రావాళ్ళందరూ తెలుగుదేశానికి అనుకూలురు అయినా కాకపోయినా కూడా చంద్రబాబును ఎద్దేవాచేస్తే వారి మనసు నొచ్చుకుంటుందని చెబుతున్నారు. ఈ వాదనలో వాస్తవం లేకపోలేదు. ఆంధ్రా ఓటర్లను నొప్పించకూడదనే కేటీఆర్, కవిత గ్రేటర్ ప్రచారంలో ఎక్కడా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేయటంలేదు. పైగా హైదరాబాద్‌ ఐటీ అభివృద్ధిలో చంద్రబాబు కృషిని ఎవరూ కాదనలేరని కూడా వారిద్దరూ ప్రచారంలో వేర్వేరు సందర్భాలలో వ్యాఖ్యానించారు. మరి ఇంత చిన్న విషయం కేసీఆర్‌కు ఎందుకు తెలియలేదో అర్థం కావటంలేదు. అదీ కాక ఎంత కాదన్నా తెలుగుదేశం రెండు రాష్ట్రాలలో ఉన్న పార్టీ. చంద్రబాబు పొరుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఇక్కడేం పని అనటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా లేదు. చంద్రబాబునే ఇక్కడేం పని అంటే రేపు ఆంధ్రావాళ్ళను మాత్రం అనరా అని తెలుగుదేశం పార్టీ ప్రశ్న లేవనెత్తే అవకాశం కూడా ఉంది. మరి కేసీఆర్ వ్యాఖ్యల ప్రభావం గ్రేటర్ ఎన్నికల్లో ఆంధ్రా ఓటర్లపై ఎంతమేర ఉంటుందో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close