బీజేపీ పట్ల అయిష్టత ప్రదర్శిస్తున్న మహబూబా ముఫ్తీ

త్వరలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారనుకొన్న పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ, తన తండ్రి స్వర్గీయ ముఫ్తీ మొహమ్మద్ కి కేటాయించబడిన అధికార నివాసాన్ని ఖాళీ చేసి నాలుగు రోజుల క్రితం శ్రీనగర్ లోని తమ ఫెయిర్ వ్యూ బంగ్లాలోకి మారిపోయారు. ఆమె ముఖ్యమంత్రి అయ్యేందుకు బీజేపీ అంగీకరించినప్పటికీ, ఇంతవరకు ఆమె ప్రభుత్వ ఏర్పాటుకి చొరవ చూపలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆమె అధికార నివాసాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవడంతో ఆమెకు బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంలేదని చాటి చెప్పినట్లయింది.

దీనిపై బీజేపీ నేతలు ఎవరూ ఇంతవరకు ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటిస్తున్నారు. రెండు వారాల క్రితమే ఆమె ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి ఉన్నప్పటికీ ఆమె అందుకు చొరవ చూపకపోవడంతో రాష్ట్రంలో తాత్కాలికంగా గవర్నర్ పాలన విధించారు. ఇప్పటికీ ఆమె సానుకూలంగా స్పందించకపోగా అధికార నివాసం ఖాళీ చేసి బీజేపీకి వ్యతిరేక సంకేతాలు పంపించారు.

“బీజేపీ-పిడిపిలు ఆరేళ్ళపాటు పొత్తులు కొనసాగించాలని ఇదివరకు నిర్ణయం జరిగింది. దానికి మేము నేటికీ కట్టుబడే ఉన్నాము. ముఫ్తీ మహామ్మద్ సాబ్ మృతి కారణంగా మేము ఎటువంటి పునరాలోచనలు చేయడం లేదు,” అని సీనియర్ బీజేపీ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ఉపముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ తెలిపారు.

ఫిబ్రవరి మొదటి వారంలో ఆమె ప్రధాని నరేంద్ర మోడితో సమావేశామవ్వాలనుకొంటున్నట్లు పిడిపి నేతలు చెపుతున్నారు. ఒకవేళ ఆమె ఇంకా జాప్యం చేసినట్లయితే, బీజేపీ కూడా మళ్ళీ పావులు కదపడం ప్రారంభించవచ్చును. ప్రస్తుతానికి పిడిపి నుండి వస్తున్న ఇటువంటి సంకేతాలు బీజేపీకి ఏమాత్రం సానుకూలంగా కనబడటం లేదనే చెప్పవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“అప్పుల కార్పొరేషన్‌”పై కేంద్రం గురి..! లేఖాస్త్రం వచ్చేసింది..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .. "ఏపీ స్టేట్‌డెలవప్‌మెంట్ కార్పొరేషన్" పేరుతో చేసిన అప్పుల వ్యవహారం రాజ్యాంగ ఉల్లంఘన అని వస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా తాజాగా కేంద్రం ...ఏపీ సర్కార్‌కు లేఖ రాసింది. "ఏపీఎస్‌డీసీ"...

ఏబీవీని డిస్మిస్ చేయండి..! కేంద్రానికి జగన్ సిఫార్సు..!

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావును సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు సిఫార్సు చేసింది. ఈ మేరకు శనివారం అర్థరాత్రే రహస్య జీవోను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఏబీవీపై...

క్రైమ్‌ : బెంగళూరులో స్పాలు,క్లబ్‌ల వ్యాపారం “అదే”నా..!?

వారాంతం వస్తే మెట్రో నగరాల్లో సందడి సగమైతాదని అందరూ చెప్పుకుంటారు.. కానీ సందట్లో సడేమియాలో కూడా రెట్టింపు అవుతాయి. ఈ విషయం పోలీసులు రైడింగ్ చేసినప్పుడల్లా తెలిసిపోతుంది. బెంగళూరు పోలీసులు ఖాళీగా ఉన్నామని...

కేసీఆర్ ఫటాఫట్ : రూ. 50వేల రైతుల రుణాలు ఈ నెలలోనే మాఫీ..!

ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయలేదని వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ ఏడాది రూ. యాభై వేల వరకూ ఉన్న రైతుల రుణాలను చెల్లించాలని...

HOT NEWS

[X] Close
[X] Close