అహంకారం కాదు, అణకువ పెరగాలి : కేసీఆర్‌

హైదరాబాదు నగర ప్రజలు అందించిన ఈ చారిత్రాత్మక విజయంతో తమ పార్టీ వారికి, ప్రభుత్వంలోని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అహంకారం రావడానికి వీల్లేదని, ఇంకా అణకువ రావాలని, బాధ్యత పెరిగిందని గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గ్రేటర్‌ విజయంపై తన స్పందనను ముఖ్యమంత్రి శుకవ్రారం రాత్రి 7.30 తరవాత ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. గ్రేటర్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తాం అన్నారు. సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కటి తప్ప.. అన్నీ పూర్తయ్యాయని.. కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్‌ అనేది కూడా మేధావుల సలహాలతో కార్యరూపంలోకి తేబోతున్నామని చెప్పారు.

ఇది నాయకులు కష్టపడి పనిచేస్తే సాధించిన విజయం కాదు.. ప్రజలంతా ఇష్టపడి ఓట్లేస్తే దక్కిన విజయం అంటూ కేసీఆర్‌ అభివర్ణించారు. నగరంలోని పేదలకు దశలవారీగా ఈ ప్రభుత్వ హయాంలోనే లక్ష టూబెడ్‌రూం ఇళ్లు కట్టి ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం అని వెల్లడించారు. నగరం దాహార్తిని తీర్చడానికి రెండు రిజర్వాయర్‌లు కూడా ఏర్పాటుచేయబోతున్న సంగతిని వెల్లడించారు. హైదరాబాదులో నివసిస్తున్న వారంతా తమ బిడ్డలే అనే మాటను కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.
నగర శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోయేది లేదని కేసీఆర్‌ అన్నారు. ప్రతి ఒక్కరికీ జీవనోపాధి, రక్షణ కల్పిస్తాం అన్నారు. దంభాచారం మాట్లాడేవాళ్లకు సింగిల్‌ డిజిట్‌ సీట్లే వచ్చాయని కేసీఆర్‌ అన్నారు.

సీపీఐ నారాయణ నాకు మంచి మిత్రుడు అని.. ఆయన కనిపిస్తే ఎవరూ ఆయన చెవి కోయవద్దు అని కేసీఆర్‌ చలోక్తులు విసిరారు. ఆయనేదో సవాలు విసిరారు గానీ దాన్ని స్పోర్టివ్‌గా తీసుకోవాలి పట్టించుకోవద్దు అని అన్నారు. కొత్తగా ఆరు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా నిర్మించబోతున్నాం అని చెప్పారు. ఆంధ్రప్రాంత వాసుల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటాం అని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. తాగునీటి సమస్య తీరుస్తాం అన్నారు. కనురెప్పపాటు కూడా కరెంటు కోత లేకుండా చూస్తాం అని కూడా చెప్పారు. జీహెచ్‌ఎంసీలో లంచం ఇవ్వకుండా ప్రజలు అనుమతులు తీసుకునే రోజులు రావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి వచ్చినట్లయితే మాత్రమే ఇవాళ ప్రజలు మనకు అందించిన విజయానికి సార్థకత దక్కుతుందని కేసీఆర్ చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close