వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడంతో ఆయన వారసుడిగా బాధ్యతలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి స్వార్థపూరితంగా ఆలోచంచడం, వివక్షతో నిర్ణయాలు తీసుకోవడం, ఆస్తులపై అత్యాశకు పోవడంతో కుటుంబం చీలిపోయింది. ఆయన తన వికృతమైన ఆలోచనలు చేయడంతో తన భార్య తరపు బంధువులు కొంత మందితో మాత్రమే సఖ్యత ఉంది. మిగతా అందరూ దూరమయ్యారు. ఇదంతా జగన్ రెడ్డి చేతకానితనమని కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తోంది. మరి కేసీఆర్ తన కుటుంబాన్ని ఎందుకు చక్కదిద్దుకోలేకపోతున్నారు?. గొప్ప రాజకీయ శాస్త్రవేత్త…. అపర చాణక్యుడు అని పేరు తెచ్చుకుని కూడా కుమార్తెను ఎందుకు అలా పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేశారన్నది ఎవరికీ అంతుపట్టని విషయం.
నాలుగైదు నెలల నుంచి కవితతో మాట్లాడని కేసీఆర్
కేసీఆర్ నాలుగైదు నెలల నుంచి కవితతో మాట్లాడటం లేదు. ఈ విషయాన్ని కవితే చెప్పారు. అంతకు ముందు కేసీఆర్ జాతీయ రాజకీయ వ్యవహారాలు, జాతీయ మీడియా సమన్వయం అంతా చూసుకునేవారు. అధికారం పోయిన తర్వాత మాత్రం గ్యాప్ పెరిగిపోయింది. కవితపై వివక్ష పెరగడం, హరీష్ రావుకు ప్రాధాన్యం పెరగడం దానికి కారణం కావొచ్చు. అదే సమయంలో కవిత లిక్కర్ స్కాంలో అరెస్టు అయితే కేసీఆర్ జైలుకు వెళ్లి పరామర్శించలేదు. అక్కడ కూడా ఆయన రాజకీయమే చూసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. ఇది కవిత మానసిక స్థితిపై మరింత ఎఫెక్ట్ పడేలా చేసిందని మండలిలో .. ఆ సమయంలో తనను పట్టించుకోలేదని చేసిన వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. కవితను ఆ తర్వాత కూడా దూరం పెట్టే ప్రయత్నం చేయడంతోనే ఇప్పుడు పరిస్థితి దిగజారిందని అర్థమవుతోంది.
కేసీఆర్ ఒక్కరే చక్కదిద్దగలరు – కానీ సైలెంట్ !
కవిత పార్టీ పెడితే అది బీఆర్ఎస్ పార్టీకి పెను సమస్య అవుతుంది. ఆ విషయం అపరచాణక్య కేసీఆర్ కుతెలియనిది కాదు. ఇలాంటి సమస్య వస్తే తాను పెంచుకున్న బీఆర్ఎస్ అనే మహావృక్షానికి పెను సమస్య వస్తుంది. ఈ సమస్యను పరిష్కరించే బలం ఉన్నది కూడా కేసీఆర్ ఒక్కరే. కవిత తండ్రి మాటల్ని వింటారు. గతంలో ఆమెకు హామీలు ఇచ్చారో లేదో కానీ.. సీరియస్ గా కవితను బుజ్జగించాలని మాత్రం కేసీఆర్ అనుకోలేదని జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. కవిత చెప్పిన మాట వినకపోవడం వల్ల ఆయన కూడా మనస్తాపానికి గురి అయి ఉండాలి లేకపోతే కవిత సామర్థ్యంపై నమ్కకంతో సాధిస్తుందని.., పట్టుదలతో ప్రయత్నించేలా చేయాలని సైలెంటుగా గా ఉండాలని భావిస్తున్నారు.
రాజకీయం రాజకీయమే.. కుటుంబం నుంచి దూరం పెట్టడం ఎందుకు?
రాజకీయం ..రాజకీయమే. కుటుంబం.. కుటుంబమే. రాజకీయాల్లో ఉన్న కుటుంబాలు ఈ సూత్రాన్ని పక్కాగా పాటించాలి. రాజకీయాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది. కుటుంబం కూడా చీలిపోతుంది. గతంలో చాలా అలాంటి ఘటనలు ఉన్నాయి. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. కుటుంబానికి కూడా కవితను దూరం పెడుతున్నారు. అది ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతుంది. కవితను కనీసం ఆదరించకపోతే అది రాజకీయంగానూ మైనస్ అవుతుంది. అయినా కేసీఆర్ మాత్రం… కవిత విషయం నిమిత్త మాత్రంగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. జోక్యం చేసుకోవడానికి ముందుకు రావడం లేదు.
