అమిత్ షాతో భేటీకి కేసీఆర్ డుమ్మా..! ఇంకా మెత్తబడలేదా..?

తెలంగాణ సీఎం కేసీఆర్… పాత మిత్రులు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు నరేంద్రమోడీ, అమిత్ షాలకు ఎదురు పడేందుకు ఇప్పటికీ ఆసక్తి చూపించడం లేదు. ఈ విషయం మరోసారి స్పష్టమయింది. ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో… హోంమంత్రి అమిత్ షా.. ఓ సమావేశం ఏర్పాటు చేశారు. దానికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సహా… యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, జార్ఖండ్‌ సీఎం రఘుబర్‌ దాస్‌, మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, చత్తీస్‌గఢ్‌ సీఎం భాఘెల్‌, బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ హాజరయ్యారు. తెలంగాణ నుంచి మాత్రం..కేసీఆర్ హాజరు కాలేదు. ఆయనకు బదులుగా.. డిప్యూటీ సీఎం మహమూద్ అలీని పంపించారు.

కేసీఆర్ హైదరాబాద్‌లో తీరిక లేనంత కార్యక్రమాల్లో ఏమీ లేరని.. అయినప్పటికీ.. ఉద్దేశపూర్వకంగానే.. ఆయన ఢిల్లీకి వెళ్లలేదని అంటున్నారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వరకూ.. బీజేపీకి దాదాపుగా మిత్రపక్షంగా వ్యవహరించిన టీఆర్ఎస్.. ఆ తర్వాత మాత్రం.. ప్రత్యర్థిగా మారిపోయింది. పార్లమెంట్ ఎన్నికల నాటికి… పూర్తి రాజకీయ ప్రత్యర్థిగా మారడంతో…రాజకీయం కూడా మారిపోయింది. అప్పటి వరకూ బీజేపీ అగ్రనేతలతో రాసుకుపూసుకు తిరిగిన టీఆర్ఎస్ అధినేత.. ఆ తర్వాత మాత్రం దూరంగా ఉంటున్నారు. ప్రధానమంత్రి ప్రమాణస్వీకారోత్సవానికి కూడా వెళ్లలేదు.

ఆ తర్వాత కొన్ని అత్యున్నత సమావేశాల్లో.. పాల్గొనేందుకు కేసీఆర్ కు ఆహ్వానం అందినప్పటికీ.. ఆయన కేటీఆర్ నో.. మరొకర్నో పంపారు కానీ.. తాను మాత్రం వెళ్లలేదు. కేంద్రంలో మోడీ రెండో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ.. మర్యాదపూర్వకంగా ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. అయితే రాజ్యసభ లో.. కొన్ని కీలకమైన బిల్లుల విషయంలో… టీఆర్ఎస్ .. బీజేపీకి మద్దతు ఇచ్చింది. అప్పట్నుంచి రెండు పార్టీల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందనుకున్నారు కానీ.. అలాంటిదేమీ లేదని.. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లకపోవడంతోనే తేలిపోయిందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close