నేను మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమైతదో తెలుసుకో..! చంద్రబాబుకు కేసీఆర్ వార్నింగ్..!!

నేను మూడో కన్ను తెరిస్తే.. నీ గతి ఏమవుతుందో తెలుసుకో అంటూ.. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.. టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలుగు ప్రజలంతా ఒక్కటేనని.. కేసీఆర్ ను కలిసి నడుద్దామని పిలిచినా రాలేదన్నందుకే మహా కూటమి వచ్చిందని చంద్రబాబు చెబుతున్నారన్నారు. తెలుగు సెంటిమెంట్ తోనే తెలంగాణను చంద్రబాబు ముంచారని మండిపడ్డారు. ” మహాకూటమి .. నీ బొంద కూటమా..?” అంటూ విరుచుకుపడ్డారు. మోదీ, కేసీఆర్‌ ఒక్కటయ్యారనడానికి చంద్రబాబుకు సిగ్గుండాలన్నారు. నాలుగేళ్లు మోదీ పక్కన ఉన్నది ఎవరు? అని ప్రశ్నించారు. మోదీని అడ్డం పెట్టుకుని 7 మండలాలు గుంజుకున్నారని ఆరోపించారు. హైకోర్టు విభజనను అడ్డుకున్నాని ఆరోపించారు. డబ్బాకొట్టే మీడియాను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. ” మాతోని గెలుక్కున్నావ్ జాగ్రత్త.. తెలంగాణ దెబ్బంటో చూపిస్తనే విజయవాడలో పోయి పడ్డావ్.. నేను మూడో కన్ను తెరిస్తేత.. నీ గతి ఏమవుతుందో ” అని హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాలను ఒకటి చేస్తానంటున్న నయవంచకుడు, ద్రోహి చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబు నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు..చంద్రబాబు కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు

సిగ్గూశరం పౌరుషం లేకుండా చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. చంద్రబాబు అనే కుట్రదారుని తీసుకొచ్చి కాంగ్రెస్‌ నేతలు ఊరేగుతారా? తెలంగాణ సమాజం ఆమోదిస్తుందా?: అని ప్రశ్నించారు. మహాకూటమా..కాలకూట విషమా…నీ బొంద కూటమా అని మండిపడ్డారు. చావుకు దగ్గరై తెచ్చిన తెలంగాణను అమరావతికి తాకట్టు పెడతారా? అని సెంటిమెంట్ కూడా పండించారు. మహాకూటమి అధికారంలోకి మన ప్రాజెక్టులను చంద్రబాబు కట్టనిస్తడా? అని సభికులనుప్రశ్నించారు.

నీళ్లు, పథకాలు అన్నీ రెండు నెలల్లోపూర్తవుతాయని .. కేసీఆర్ ప్రకటించారు. బతుకమ్మ చీరలు పంచొద్దని కాంగ్రెస్‌ నేతలు కోర్టుకెళ్లారు ఎన్నికల కోడ్ ముగియగానే చీరలు పంచుతామన్నారు రైతుబంధు చెక్కులు ఇవ్వొద్దని . కాంగ్రెస్‌ నేతలు కోర్టుకెళ్తే రెండు చెంపలు వాయించిందని రైతులు ఆందోళన చెందొద్దు..రైతుబంధు చెక్కులకు ఇబ్బంది ఉండదని ప్రకటించారు. తెలంగాణను దయ్యాలు పాలు చేయవద్దు..మోసపోతే గోసపడుతారని హెచ్చరించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

ఎక్స్ క్లూజీవ్: మారుతి నుంచి ‘బేబీ’లాంటి ‘బ్యూటీ’

గ‌తేడాది వ‌చ్చిన సూప‌ర్ హిట్ల‌లో 'బేబీ' ఒక‌టి. చిన్న సినిమాగా వ‌చ్చి, సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకొంది. నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కూ విప‌రీత‌మైన లాభాల్ని పంచిపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close