కేసీఆర్ వ్యూహాల‌కు అనుగుణంగా కేంద్ర‌ంపై పోరాటం..!

జ‌న‌వ‌రి 31 నుంచి పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో లోక్ స‌భ‌లో అనుస‌రించాల్సిన వ్యూహంపై ఎంపీల‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భ‌వ‌న్లో ఎంపీల‌తో జ‌రిగిన స‌మావేశంలో… ఈసారి పార్ల‌మెంటులో గ‌ట్టి వాద‌నే వినిపించాల‌నీ, గ‌తంలో మాదిరిగా ఉత్త చేతులు ఊపుకుంటూ తిరిగి రావొద్దంటూ ఎంపీల‌ను కేటీఆర్ హెచ్చ‌రించారు! రాష్ట్రానికి రావాల్సిన నిధులూ కేటాయింపులూ వివిధ పన్నుల్లో వాటాల‌పై పోరాటం చేయాల‌ని సూచిస్తూనే… ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యూహాల‌ను అర్థం చేసుకుని వ్య‌వ‌హ‌రించాల‌ని కేటీఆర్ ప్రత్యేకంగా కోర‌డం గ‌మ‌నించాల్సిన అంశం! నిజానికి, తెరాస ప్రాధాన్యత కూడా ఇప్పుడు ఇదే.

ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం అంటే ఏముందీ… మున్సిప‌ల్ ఎన్నిక‌ల విజయం త‌రువాత మ‌రోసారి జాతీయ రాజ‌కీయాల‌పై ఆయ‌న స్పందించారు క‌దా! రెండు జాతీయ పార్టీలూ దేశంలో ఫెయిల్ అయ్యాయ‌నీ, ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ దేశంలో అధికారంలోకి వ‌స్తుంద‌ని కూడా  జోస్యం చెప్పారు. ఆ విజన్ కి అనుగుణంగా తెరాస వాదన వినిపించాలన్నది వ్యూహం. సీఏఏ, ఎన్నార్సీ మీద పార్ల‌మెంటులో నిర‌స‌న వ్య‌క్తం చేయ‌మంటూ ఎంపీల‌కు కేటీఆర్ చెప్పారు. ఇవి ప్ర‌జ‌ల‌కు అవ‌స‌రం లేని రాజ‌కీయ అంశాల‌నీ, నిరుద్యోగం ఆర్థిక‌మాంధ్యం లాంటి స‌మ‌స్య‌ల‌పై కేంద్రం దృష్టిపెట్టేలా చేయాల‌న్నారు. తెలంగాణ స్ఫూర్తితోనే కేంద్రం కూడా కొన్ని ప‌థ‌కాల‌ను ప్రారంభించింద‌ని స‌భ‌లో గుర్తుచెయ్యాల‌న్నారు. కానీ, తెలంగాణలో అమలౌతున్న కేంద్ర ప‌థ‌కాల‌కు నిధులు ఇవ్వ‌డం లేని అంశాన్ని గుర్తుచేసి నిల‌దీయాల‌న్నారు.

కేటీఆర్ మ‌నోభావ‌మేంటో ఎంపీల‌కు అర్థ‌మ‌య్యే ఉంటుంది. ముఖ్యంగా సీఏఏని వేదికగా మార్చుకుని… దీనిపై నిర‌స‌న వ్య‌క్తం చేసే పార్టీల‌ను క‌లుపుకుని పోవాల‌న్న‌దీ తెరాస వ్యూహంగా క‌నిపిస్తోంది. భావసారూప్యతగల పార్టీల ఎంపీలతో దోస్తీకి ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇదే అంశ‌మై త్వ‌ర‌లోనే రాష్ట్రాల ముఖ్య‌మంత్రులూ, పార్టీల‌తో హైద‌రాబాద్లో ఒక స‌మావేశం కూడా నిర్వ‌హిస్తామని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజాగా ప్ర‌క‌టించిన సంగ‌తి గుర్తుచేసుకోవాలి. దీనికి అనుగుణంగానే ఇప్పుడు ఎంపీలు పార్ల‌మెంటులో వ్య‌వ‌హ‌రించాల‌న్న‌ది పార్టీ ఆదేశంగా చెప్పొచ్చు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మంచి విజ‌యం అందించారంటూ ఎంపీల‌ను కేటీఆర్ అభినంద‌నల‌తో ముంచెత్తారు. ఇదే జోష్ తో పార్ల‌మెంటులో ఏర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : ఓనర్లు కాదు.. వాళ్లే టీవీ5ని అమ్మేశారు..!

ప్రముఖ మీడియా సంస్థ టీవీ5 అమ్మేశారని కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోయిందని ఒక్క సారిగా ఓ పార్టీ వాళ్లు ప్రచారం ప్రారంభించేశారు. దీంతో తెలుగు మీడియాలో అందరూ ఉలిక్కిపడ్డారు. నిజమా అని చెక్...

సాగర్‌కు ఓకే కానీ సీమకు కృష్ణా నీళ్లు పంపొద్దంటున్న తెలంగాణ..!

శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుతున్నా .. రాయలసీమకు నీరు విడుదల చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది. ప్రాజెక్టులన్నీ కృష్ణాబోర్డు పరిధిలోకి వెళ్లడంతో ఇప్పుడు వారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది....

టీ బీజేపీ నుంచి పోయేవాళ్లను ఎవరూ ఆపడం లేదేంటి..!?

తెలంగాణ బీజేపీకి వలసల ఫీవర్ పట్టుకుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అంటూ అంచనాలు రావడంతో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు బీజేపీ బాట పట్టారు....

మండలి రద్దు తీర్మానాన్ని ఇంకా పరిశీలిస్తున్నారట..!

శాసనమండలిని రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం పరిశీలనలో ఉందని.. కేంద్ర మంత్రి రిజుజు రాజ్యసభలో తెలిపారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు.. లిఖితపూర్వక సమాధానం...

HOT NEWS

[X] Close
[X] Close