ఈ పోరాటంలో కాంగ్రెస్ మ‌ద్ద‌తు కోసం కేసీఆర్ చూస్తున్నారా?

త‌న మీద విమ‌ర్శ‌లు రాకుండా జాగ్ర‌త్తప‌డ‌టంలో సీఎం కేసీఆర్ ని మించిన‌వారు లేరు! దానికి తాజా ఉదాహ‌ర‌ణ ఆర్టీసీ కార్మికుల స‌మ్మె. శాప‌నార్థాలు పెట్టిన వారితోనే పాలాభిషేకాలు చేయించుకున్నారు. వ్య‌క్తం కాబోతున్న వ్య‌తిరేక‌త‌ను వెంట‌నే సానుకూలత‌గా మార్చుకోవ‌డంలో ఆయ‌న చాణ‌క్యం వేరు. తాజాగా ఇలాంటి ప్ర‌య‌త్న‌మే మ‌రొక‌టి ప్రారంభించారు! రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అధ్వాన్నంగా ఉంద‌ని మొన్న‌నే కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాశారు క‌దా! దానికి కొన‌సాగింపుగా… శాఖ‌ల‌వారీగా కేంద్రం నుంచి రావాల్సిన పన్నులు, కేటాయింపుల లెక్క‌లు తీయిస్తున్నారు. ఎమ్మెల్యేలంతా ఈ లెక్క‌ల‌పై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని చెప్పార‌ట‌. ఎందుకంటే, త్వ‌ర‌లోనే అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించి, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అధ్వాన్నంగా త‌యారు కావ‌డానికి కేంద్ర‌మే కార‌ణ‌మ‌ని ముక్త ‌కంఠంతో ఎలుగెత్తాల‌న్న‌ది కేసీఆర్ వ్యూహం!

నిజానికి, భాజపాని అసెంబ్లీలో నిల‌దీయ‌డం పెద్ద ప్ర‌శ్నే కాదు. ఎందుకంటే, ఒక్క రాజాసింగ్ మాత్ర‌మే స‌భ‌లో భాజ‌పా ఎమ్మెల్యే! కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు క‌దా! కేంద్ర‌మే తెలంగాణ‌ను ముంచింది, కేంద్ర‌మే మ‌న‌ల్ని ప‌ట్టించుకోవ‌డం లేదంటూ కేసీఆర్ మాట్లాడితే… గ‌డ‌చిన ఆరేళ్లుగా త‌మ‌రేం చేశారు సార్, ఆర్థిక ప‌రిస్థితి దిగ‌జార‌డం వెన‌క త‌మ‌రి పాత్ర లేదా అంటూ కాంగ్రెస్ స‌భ్యులు ప్ర‌శ్నిస్తారు క‌దా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అలా విమ‌ర్శిస్తే ఇబ్బంది క‌దా? అందుకే, ఇక్క‌డే ఒక స‌మ‌ష్టి సిద్ధాంతాన్ని తెర‌మీదికి తెస్తోంది తెరాస‌. దేశ‌వ్యాప్తంగా భాజ‌పా విధానాల‌పై కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంద‌నీ, తెలంగాణ‌పై స‌వ‌తి త‌ల్లి ప్రేమ‌ను చూపిస్తున్న కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌డంలో కాంగ్రెస్ పార్టీ త‌మతో క‌లిసి వ‌స్తుందంటూ కొంత‌మంది తెరాస‌ ఎమ్మెల్యేలు ఇప్పుడు మాట్లాడుతున్నారు.

అంటే, అసెంబ్లీలో త‌మ‌కు వంత‌పాడాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కి ప‌రోక్షంగా చెబుతున్న‌ట్టు. కేసీఆర్ అనుమ‌తి లేకుండా… ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న‌ పోరాటాన్ని మెచ్చుకునేలా తెరాస నేత‌లు మాట్లాడ‌లే‌రు క‌దా! రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దిగ‌జార‌డం వెన‌క కేంద్ర‌మే కార‌ణం… ఇదొక్క‌టే బ‌లంగా వినిపించాల‌న్న‌ది కేసీఆర్ వ్యూహం. ఈ క్ర‌మంలో ఆరేళ్ల పాల‌న‌లో ఆర్థిక విజ‌యాలు లేవా అనే చ‌ర్చ‌కు తావివ్వ‌కూడ‌దు, అంతే. ఇప్పుడు కాంగ్రెస్ విచ‌క్ష‌ణ ఎలా ఉంటుందో చూడాలి. కేసీఆర్ పాల‌న‌ను బ‌లంగా ప్ర‌శ్నించ‌డానికి ఉన్న ఈ అవ‌‌కాశాన్ని స‌మ‌ర్థంగా వాడుకుంటుందో…. లేదంటే, తెరాస ట్రాప్ లో ప‌డిపోయి, అసెంబ్లీ స‌మావేశాల్లో భాజ‌పా మీద విమ‌ర్శ‌ల‌కు దిగుతుందో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close