ముంచుకొస్తున్న మంచి ముహుర్తం..! కొత్త మంత్రుల లెక్కల్లో కేసీఆర్..!

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం.. తెలంగాణ సర్కార్‌పై కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పూర్తి స్థాయి క్యాబినెట్ ను ఏర్పాటు చేయడం టీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాము ఆధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయి క్యాబినెట్ విస్తరించలేదు. ఇది ప్రజల్లో… ఎమ్మెల్యేల్లో కూడా చర్చకు కారణం అవుతోంది.

నెలాఖరు వరకే మంచి ముహుర్తాలు..!

రెండో సారి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి గులాబీ బాస్ కేసీఆర్ పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు ఇప్పటి వరకు వరుస ఎన్నికలుఆలస్యానికి కారణమని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నా.. ఆశావహులు ఎక్కువగా ఉండటం.. వలసల్ని ప్రొత్సహించడంతోనే అసలు సమస్య వస్తోందని అంటున్నారు. అయితే ఇప్పుడు అన్ని ఎన్నికలు పూర్తయిపోయాయి. కోడ్ కూడా తొలగిపోయింది. ఈ నెలాఖరు వరకే మంచి ముహూర్తాలుండడంతో ఈనెల 21 న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ లోగా నుూతన సెక్రటేరియేట్ కు భూమిపూజ సహా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు.

కేబినెట్‌లోకి కేటీఆర్, కవిత..! మరి హరీష్..?

సామాజికవర్గాలు, ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యం ఆధారంగా కేసిఆర్ గత కేబినెట్ లో టీంను ఎంపిక చేసుకున్నారు. అయితే కొంత మంది విషయంలో ఆయన ఒకింత అసంతృప్తి తో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో ఇంఛార్జిలుగా ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రుల విషయంలో కొంత కోపంగా ఉన్నట్లు సమాచారం. పరిషత్ ఎన్నికల ఫలితాలు కేసిఆర్ కోపాన్ని కొంత తగ్గించినట్లైంది. హరీశ్ విషయంలో కేసిఆర్ వ్యూహాత్మకంగానే పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ దఫా విస్తరణలో హరీశ్ కు తిరిగి చోటు కల్పిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఒక్క మున్సిపల్ ఎన్నికలు మినహా ఇతర ఎన్నికలూ పూర్తవ్వడంతో కేటిఆర్ ను పక్కాగా కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఆయనకు తిరిగి పాత శాఖలనే అప్పగించనున్నట్లు తెలుస్తోంది. హరీశ్ కు చోటు దక్కక పోతే ఎంపిగా ఓడిపోయిన కేసిఆర్ కుమార్తె పేరు కూడా తీవ్రంగా ప్రచారంలో ఉంది. కవితకు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉండాలని ఉన్నా కేసిఆర్ ఆమెను పార్లమెంట్ కు పంపించారు. అయితే ఈసారి మహిళలకు అవకాశమివ్వాని కేసిఆర్ నిర్ణయించుకోవడంతో ఆమెను కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలున్నాయని పార్టీ నేతలంటున్నారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు రెండు మంత్రి పదవులు..!

మాజీ మంత్రి సభితా ఇంద్రారెడ్డి కి కెబినెట్ బెర్త్ ఖాయమైంది. ఆ హామీ మేరకే ఆమె కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ గుటికి చెరుకున్నరు. ఈ కేబినెట్ లో మాదిగ, మున్నూరు కాపు, ఎస్టీ సామాజిక వర్గాలనుండి ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈ సారి భర్తి చేసే అవకాశాలున్నాయి. సత్తుపల్లి టీడిపి ఎమ్మెల్యేగా గెలుపొంది టీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అయిన సండ్ర వెంకట వీరయ్య పేరు ప్రచారంలో ఉంది. ఇక ఎస్టీ లనుండి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పేరు కూడా కేసిఆర్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బలమైన బిసి సామాజిక వర్గంగా ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి గత కేబినెట్ లో జోగు రామన్న మంత్రి గా ఉన్నారు. అయితే తొలి విడత కేబినెట్ లో కేసిఆర్ అవకాశం ఇవ్వలేక పోయారు. జోగు రామన్న, దానం నాగేందర్, బాజిరెడ్డి గోవర్ధన్, దాస్యం వినయ్ భాస్కర్ ఇదే సామాజికవర్గానికి చెందిన నేతలుగా ఉన్నా.. మళ్లీ జోగు రామన్నకే అవకాశం దక్కనున్నట్లు సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close