మోదీ ఇన్‌కమింగ్… కేసీఆర్ ఔట్ గోయింగ్ !

ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ వస్తున్నారు. అయితే ఆయన హైదరాబాద్‌లో అడుగు పెట్టక ముందే సీఎం కేసీఆర్ సిటీ నుంచి వెళ్లిపోతున్నారు. పొరుగు రాష్ట్రంలో ఆయన రాజకీయ భేటీల కోసం వెళ్తున్నారు. జేడీఎస్ నేతలయిన దేవేగౌడ, కుమారస్వామిలతో కేసీఆర్ సమావేశం అవుతారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయంపై వారితో చర్చలు జరుపుతారు. గతంలోనూ ఓ సారి ఆయన సమావేశమయ్యారు. ఇప్పుడు మరోసారి వెళ్తున్నారు. అయితే కేసీఆర్ వెళ్తున్న టైమింగ్ పైనే చాలా చర్చలు జరుగుతున్నాయి.

ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్నందున ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు సీఎం స్వాగతం చెప్పాలి. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. కానీ కేసీఆర్ మాత్రం ఇటీవలి కాలంలో మోదీతో పాటు ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. ఎదురుపడటం లేదు. అందుకే ఇప్పుడు మోదీ వస్తున్నా.. సిటీలో లేకుండా వెళ్తున్నారని చెబుతున్నారు. దేవేగౌడ, కుమారస్వామిలతో భేటీ కోసం నేరుగా ప్రధాని పర్యటనను స్కిప్ చేయడంపై సహజంగానే కేసీఆర్ విమర్శలు ఎదుర్కొంటారు. అయినా సరే కేసీఆర్ ఆయనకు ఎదురుపడకూడదని నిర్ణయించుకున్నారు.

కేసీఆర్, మోదీ మధ్య రాజకీయ విభేదాలు తీవ్రమయ్యాయని.. తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోదీతో భేటీ కోసం అంటూ కేసీఆర్ పలుమార్లు ఢిల్లీ వెళ్లారు కానీ భేటీ కాలేదు. ఇప్పుడు నేరుగా వస్తున్నా కలవడం లేదు. మోదీ తీరుపై అసంతృప్తిగా ఉన్న కేసీఆరే ఆయనను కలవడానికి ఇష్టపడటం లేదని చెబుతున్నారు. మొత్తంగా మోదీ తెలంగాణకు వస్తూంటే.. కేసీఆర్ మాత్రం కర్ణాటకకు వెళ్లిపోతున్నారు. దీనిపై బీజేపీ నేతలు ఇప్పటికే సెటైర్లు ప్రారంభించారు .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమరావతిలో “కట్టిన గ్రాఫిక్స్” అద్దెక్కిస్తున్న జగన్ సర్కార్ !

అమరావతి భూముల్ని వేలం వేయడమే కాదు ఇప్పుడు అక్కడ కట్టిన భవనాలను కూడా అద్దెకు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు సీఆర్డీఏ ప్రతిపాదించింది. సీఎం జగన్ ఆమోదించేశారు. అమరావతిలో...

ఏపీలో ధియేటర్లు మూతబడతాయా !?

ఆన్‌లైన్ టిక్కెట్లు, సినిమాల కలెక్షన్లను గుప్పిట పెట్టుకోవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వర్కవుట్ కావట్లేదు. తమ ఆదాయాన్నంతా ప్రభుత్వం చేతుల్లో పెట్టి.. ప్రభుత్వం ఇచ్చే దాని కోసం వెయిట్ చేయడం కన్నా ...

ఏపీలో మోడీ బహిరంగసభ లేనట్లే !

హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేసిన బీజేపీ నేతలు.. ఓ బహిరంగసభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పది లక్షల మందిని సమీకరిస్తామని బీజేపీ నేతలు...

లక్ష మెజార్టీ రాలే.. లక్ష ఓట్లొచ్చాయ్ !

ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీ తెచ్చుకోవాలని తాపత్రయపడిన వైసీపీకి లక్ష ఓట్లే రావడంతో ఆ ఆశ నెరవేరలేదు. పోలింగ్ శాతం బాగా పడిపోవడంతో... పోలైన ఓట్లలో లక్ష వైసీపీకి.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close