నేడు విజయవాడ రానున్న కేసీఆర్

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వాళ్ళ విజయవాడ రాబోతున్నారు. ఈ నెల 23 నుంచి 27 వరకు ఎర్రవెల్లిలో జరిగే అయుత చండీ మహాయాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, రాష్ట్ర మంత్రులను ఆహ్వానించేందుకు అయన విజయవాడ వస్తున్నారు. ఆయనతో బాటు మంత్రి ఈటల. ఎంపీ బాల సుమన్ వస్తున్నట్లు సమాచారం. తెలంగాణా ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్ మెంటు ఖరారు చేసారు. కేసీఆర్ ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో విజయవాడకు బయలుదేరుతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మంత్రులకు ఆహ్వాన పత్రికలు అందజేస్తారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కేసీఆర్ ని భోజనానికి ఆహ్వానించవచ్చని తెలుస్తోంది. కేసీఆర్ మధ్యాహ్నం 2.15 గంటలకు హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు. ఈ యాగానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లను, ముఖ్యమంత్రులను, పీఠాదిపతులను కేసీఆర్ ఆహ్వానించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జైల్లో కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నారు…ఈడీ కొత్త ఆరోపణ

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవల్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది ఈడీ. వైద్య పరమైన సాకులతో బెయిల్ పొందేందుకుగాను కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లు ఉద్దేశ్యపూర్వకంగా...

తొలి రోజు నామినేషన్లకు ఆసక్తి చూపని వైసీపీ నేతలు

ఏపీలో నామినేషన్ల సందడి తొలి రోజు అంతా పసుపు హడావుడి కనిపించింది. కూటమిలోని పలువురు కీలక నేతలు తొలి రోజు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు...

తలసాని డుమ్మా – బాపు కేసీఆర్‌కు షాక్ ఇవ్వడమే తరువాయి !

బాపు కేసీఆర్ కు.. గట్టి షాక్ ఇచ్చేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ రెడీ అయినట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వ్యూహం ఖరారు కోసం నిర్వహించిన సమావేశానికి తలసాని శ్రీనివాస్...

జగన్‌కు శత్రువుల్ని పెంచడంలో సాక్షి నెంబర్ వన్ !

ఎన్నికల సమయంలో జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడేవారి సంఖ్యను పెంచడంలో సాక్షి పత్రిక తనదైన కీలక భూమిక పోషిస్తుంది. ఎవరైనా తమను విమర్శిస్తున్నారో.. లేకపోతే టీడీపీకి మద్దతుదారుడని అనిపిస్తే చాలు వాళ్లపై పడిపోయి.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close