ఆర్టీసీకి ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు లేద‌ని నిరూపించ‌డ‌మే కిం క‌ర్త‌వ్యం..!

ఆర్టీసీతో చ‌ర్చ‌లు జ‌ర‌పాలంటూ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోర్టు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. దీంతో శుక్ర‌వారం రాత్రి ర‌వాణా శాఖ‌మంత్రి పువ్వాడ అజయ్ తోపాటు ప‌లువురు అధికారుల‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా చ‌ర్చించారు. బంద్ జ‌రుగుతోందని బ‌స్సులు ఆపొద్ద‌నీ, డిపోల్లో ఉన్న వంద శాతం బ‌స్సుల్ని న‌డిపేలా చూడాలంటూ అధికారుల‌కు సీఎం ఆదేశించారు. ప్ర‌తీ బ‌స్సుకీ ఇద్ద‌రు కానిస్టేబుల్స్ చొప్పున భ‌ద్ర‌త‌కు పంపించాల‌న్నారు. బ‌స్సుల‌ను అడ్డుకున్నా, దుకాణదారుల‌కు ఇబ్బంది క‌లిగించినా వెంట‌నే అరెస్టులు చేయాల‌ని చెప్పిన‌ట్టూ తెలుస్తోంది. ఓప‌క్క స‌మ్మె చేస్తూ బంద్ కి పిలుపునిచ్చిన‌ కార్మిక సంఘాలతో చ‌ర్చ‌లా అంటూ సీఎం వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం. వారు స‌మ్మె విర‌మిస్తేనే చ‌ర్చ‌లుంటాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డ‌ట్టుగా తెలుస్తోంది. బంద్ ప్ర‌భావం ప్ర‌జ‌ల మీద ప‌డ‌కూడ‌ద‌నీ, దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లూ చెయ్యాల‌న్నారు.

ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయాల‌నే అంశంపై కోర్టు త‌మ‌ని త‌ప్పుబ‌డ‌ట్ట‌డం లేద‌ని అధికారుల‌తో సీఎం చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే చాలామంది కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌నీ, స‌మ్మె ప్ర‌భావం రాష్ట్ర‌వ్యాప్తంగా పెద్ద‌గా లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించిన‌ట్టు తెలుస్తోంది. గ‌డ‌చిన రెండు మూడు రోజులుగా దాదాపు 95 శాతం బ‌స్సుల్ని న‌డుపుతున్నామ‌న్నారు. వెంట‌నే స‌మ్మె విర‌మిస్తేనే 48 వేల మంది కార్మికుల గురించి ఆలోచిద్దామ‌నీ, అంత‌వ‌ర‌కూ ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్ల‌పైనే దృష్టి పెట్టాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పిన‌ట్టుగా స‌మాచారం.

ఇవాళ్ల జ‌రుగుతున్న రాష్ట్రబంద్ ను స‌మ‌ర్థంగా అడ్డుకోవాల‌నేదే ప్ర‌భుత్వ వ్యూహంగా క‌నిపిస్తోంది. ఆర్టీసీకి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు లేదు అనేది నిరూపించ‌డ‌మే సీఎం వ్యూహంగా క‌నిపిస్తోంది. అయితే, వాస్త‌వ ప‌రిస్థితులు గ‌మ‌నిస్తే… ఆర్టీసీ స‌మ్మె నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి మొండి వైఖ‌రిపై చాలా విమ‌ర్శ‌లే వ‌చ్చాయి. ఆ కోణంలో సీఎం ఆలోచిస్తున్న‌ట్టు లేరు. ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేశాం, బ‌స్సుల‌న్నీ తిరుగుతున్నాయి క‌దా అనే ధోర‌ణిలోనే కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల స‌మ‌స్య‌లు వేరు, ప్ర‌జ‌ల ర‌వాణా అవ‌స‌రాలు వేరు అన్న‌ట్టుగా చూస్తున్నారు. కానీ, కార్మికుల‌కు ఈ సమ్మె సంద‌ర్భంగా అన్ని రాజ‌కీయ పార్టీలూ, ఇత‌ర‌ సంఘాల మ‌ద్ద‌తుగా నిలుస్తున్నాయంటే… ఆ మేర‌కే అదే ప్ర‌జాభిప్రాయంగానూ చూడాలి క‌దా! ఏదేమైనా, ఆయ‌న వైఖ‌రి చూస్తుంటే… ఇవాళ్ల ఆర్టీసీ సంఘాల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతారా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్కే పలుకు : మళ్లీ టీడీపీ – బీజేపీ పొత్తు మాట..!

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రతీవారంతంలో తను రాసే ఆర్టికల్ " కొత్తపలుకు"లో ఇటీవల గాఢత తగ్గింది. ఏపీ సర్కార్‌పై... తెలంగాణ సర్కార్‌పై గతంలో ఆయన విరుచుకుపడే తీరు వేరుగా ఉండేది. ఇప్పుడు...

జగన్ పై ప్రత్యక్ష, చిరంజీవి పై పరోక్ష విమర్శలు చేసిన బాలకృష్ణ

బాలకృష్ణ మరో మూడు రోజుల్లో షష్టి పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా కొన్ని టీవీ చానల్స్ కు బాలకృష్ణ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఒక ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ సీఎం జగన్...

రివ్యూ : రాంగోపాల్ వ‌ర్మ ‘ క్లైమాక్స్‌ ‘

పాడుబ‌డ్డ బావిలో మురికే ఉంటుంది. ఒక‌ప్పుడు తీయ్య‌టి నీళ్లు ఇచ్చింది క‌దా అని, ఓ గుక్కెడు నీళ్లు గొంతులోకి దించుకోం క‌దా..? రాంగోపాల్ వ‌ర్మ అదే టైపు. శివ నుంచి స‌ర్కార్ వ‌ర‌కూ... 'సినిమా...

జగన్ తో భేటీతో సినీ పరిశ్రమ సాధించేది ఏమీ లేదు: బాలకృష్ణ

జగన్ తో తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు త్వరలో భేటీ కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం తో సినీ పరిశ్రమ భేటీ అయిన సందర్భంలో తనను పిలవలేదని బాలకృష్ణ అలగడం, భేటీకి హాజరైన పరిశ్రమ...

HOT NEWS

[X] Close
[X] Close