ఆ దుస్థితి మ‌నం తెచ్చుకోవ‌ద్దంటున్న కేసీఆర్

క‌రోనా వ్యాప్తి నిర్మూల‌న‌కు ప్ర‌భుత్వం చేప‌డుతున్న చ‌ర్య‌ల‌కు ప్ర‌జ‌లు వంద‌శాతం స‌హ‌క‌రించాల‌ని కోరారు ముఖ్య‌మంత్రి కేసీఆర్. స‌హ‌క‌రించ‌క‌పోయినా చ‌ర్య‌లు ఆగ‌వ‌ని సున్నితంగా హెచ్చ‌రించారు. ప్ర‌జ‌లు స‌హ‌రించ‌క‌పోతే 24 గంట‌లు క‌ర్ఫ్యూ పెట్టాల్సిన ప‌రిస్థితి వ‌స్తుందనీ, ఇంకా వినకపోతే షూట్ ఎట్ సైట్ ఆర్డ‌ర్స్ ఇయ్యాల్సి ఉంటుంద‌నీ, అప్పటికీ అదుపులోకి రాకపోతే సైన్యాన్ని కూడా రంగంలోకి దించాల్ని ఉంటుంద‌నీ… ఈ ప‌రిస్థితి తెచ్చుకుందామా, ఇలాంటి దుస్థితి మ‌న‌కు అవ‌స‌ర‌మా అనేది అంద‌రూ ఆలోచించుకోవాల‌న్నారు. ఎక్క‌డివాళ్లు అక్క‌డుంటే అయిపోతుంది క‌దా! విన‌క‌పోతే ప్ర‌భుత్వం ఆగ‌ద‌న్నారు.

జిల్లాలోగానీ, హైద‌రాబాద్లోగానీ ఈ నియంత్రణ విష‌యంలో పోలీసులు, క‌లెక్ట‌ర్లు, మున్సిప‌ల్ సిబ్బంది మాత్ర‌మే క‌నిపిస్తున్నార‌నీ, ప్ర‌జా ప్ర‌తినిధులు ఎక్క‌డికిపోయార‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు. జీహెచ్ ఎంసీలో 150 కార్పొరేట‌ర్లు ఏం చేస్తున్నార‌ని నిల‌దీశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నార‌న్నారు? ఆరోగ్య శాఖ‌, వ్య‌వ‌సాయ శాఖ‌, మున్సిప‌ల్ లాంటివి మిన‌హా… మిగ‌తా మంత్రులు, ఎమ్మెల్యేలు సొంత ప్రాంతాల‌కి వెళ్లాల‌ని కోరారు. అక్క‌డ ప్ర‌జ‌ల కోసం ప‌నిచెయ్యాల‌న్నారు. పోలీసులో కో ఆర్డినేట్ చేసుకుంటూ స్థానికంగా ఈ క‌రోనా నియంత్రణ కార్య‌క్ర‌మంలో బాధ్య‌త తీసుకోవాల‌న్నారు. ఇలాంటి ఆప‌త్కాల స‌మ‌యంలో క‌చ్చితంగా మ‌నం ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉండాల‌న్నారు. గ్రామ‌స్థాయిలో కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్ని స్థాయి నాయ‌కులు రంగంలోకి దిగాల‌న్నారు.

హోం క్వారంటైన్లో ఉన్న‌వారిపై గ‌ట్టి నిఘా ఉంద‌నీ, పాస్ పోర్టులు సీజ్ చేస్తామ‌ని చెప్పామ‌న్నారు. న‌క‌రాలు చేస్తే పాస్ పోర్టులు స‌స్పెండ్ చేస్తామ‌న్నారు. పౌర స‌మాజానికి స‌హ‌కరించ‌నివారు, పౌర స‌దుపాయాలు పొందేందుకు అర్హులుకారు అని స్ప‌ష్టం చేశారు. కూర‌గాయ‌లు పెంచడం కొంత బాధాక‌ర‌మైన విష‌య‌మ‌న్నారు. ఎక్కువ ధ‌ర‌లు పెంచుతామ‌ని ఎవ‌ర‌న్నా అంటే న‌డ‌వ‌ద‌నీ, ఎక్కువ ధ‌ర‌ల‌కు అమ్మిన‌వారిపై పీడీ యాక్టు పెట్టి నేరుగా జైలుకు పంపుతామ‌న్నారు. నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పెంచితే లైసెన్సులు ర‌ద్దు చేస్తామ‌న్నారు. దేవుని ద‌య‌వ‌ల్ల ప్ర‌స్తుతం ప‌రిస్థితి ఈరోజుకి నియంత్ర‌ణ‌లో ఉంద‌నీ, అందుకే అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్న‌వారి ఆరోగ్యం కూడా నిల‌క‌డ‌గా ఉంద‌న్నారు. మొత్తానికి, లాక్ డౌన్ రెండో రోజు కొంత నియంత్రణకు వచ్చిన పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైనా ప్రొడక్ట్స్ బ్యాన్ చేద్దాం అన్న నాగబాబు, కౌంటర్ ఇచ్చిన నెటిజన్లు

భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు 1960వ దశకం నుండి ఉన్నాయి. అప్పుడప్పుడు హిందీ చీనీ భాయి భాయి అంటూ సత్సంబంధాలు నెరపడం, మళ్ళీ అప్పుడప్పుడు చైనా కయ్యానికి కాలు దువ్వడం దశాబ్దాలుగా జరుగుతోంది....

పరిహారం, పర్యావరణానికి ఎల్జీ పాలిమర్స్ కట్టిన రూ.50 కోట్లు ..!

ఎల్జీ పాలిమర్స్ సంస్థ కలెక్టర్ వద్ద డిపాజిట్ చేసిన యాభై కోట్ల రూపాయలను..పర్యావరణ పునరుద్ధరణ.. బాధితులకు పరిహారం కోసం వినియోగించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ స్పష్టమైన తీర్పును వెల్లడించింది. కేంద్ర పర్యావరణ...

మరో మూడు నెలలు సీఎస్‌గా సహాని..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానికి మరో మూడు నెలల పొడిగింపు లభించింది. మామూలుగా ఆమెకు జూన్ 30వ తేదీతో రిటైర్ కావాల్సి ఉంది. అయితే.. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి...

ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తానంటున్న ఆనం..!

ప్రజల కోసం ప్రభుత్వాన్ని... అధికారులను నిలదీయడానికి సిద్దమని ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి. అధికారులను సరే కానీ..ప్రభుత్వాన్ని నిలదీస్తామనే మాటే నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అంతటితో వదిలి...

HOT NEWS

[X] Close
[X] Close