కేసీఆర్‌కు “బెంగాల్” భయం..!

కోరి తెచ్చుకున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో ఫలితం తేడా వస్తే తెలంగాణ మరో బెంగాల్ అవుతుందన్న ఆందోళన టీఆర్ఎస్‌లో కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్.. అనవసరంగా బీజేపీకి చాన్సిచ్చామన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. ముందు నుంచి ఈటల రాజేందర్ సొంత పార్టీ ఆలోచనలో ఉన్నారని ఇంటలిజెన్స్ నివేదికలను కేసీఆర్ నమ్మారు. రేవంత్, కోదండరాం వంటి వారితో కలిసి ఆయన కొత్త పార్టీ ఆలోచన చేస్తున్నారని…భావించారు. కానీ చివరికి ఈటల తనకు అలాంటి ఆలోచనలే లేవని నేరుగా బీజేపీలో చేరిపోయారు. బీజేపీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆట మొదలైంది అనే సంకేతాన్ని కేసీఆర్‌కు పంపుతోంది.

హుజురాబాద్ లో విజయంతో 2023 ఎన్నికల కు వెళ్లాలని బీజేపీ పట్టుదలగా ఉంది. బెంగాల్ తరహా పోరాటం చేస్తామని బీజేపీ చెబుతోంది. తమ తర్వాతి టార్గెట్ తెలంగాణే నని ఇప్పటికే ఆ పార్టీ జాతీయ నాయకులు ప్రకటించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం.. గ్రేటర్ ఎన్నికల్లో మమంచి ఫలితాలు బీజేపీ కి బూస్ట్ నిచ్చాయి. అయితే ఆ తర్వాత జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ సత్తా చాటింది. ఆ ఫలితాలు బీజేపీని తీవ్రంగా నిరాశ పరిచాయి. మళ్ళీ దూకుడు పెంచడానికి సమయం కోసం ఆ పార్టీ ఎదురు చూస్తోంది. అయితే తిరిగి పుంజుకోవడానికి హుజురాబాద్ ఉప ఎన్నిక అందివచ్చిన అవకాశంగా కమలదళం భావిస్తోంది.

దుబ్బాకలో గెలిచిన తర్వాత బీజేపీ నేతల దూకుడుకు టీఆర్ఎస్ నేతలు ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఇప్పుడు హుజురాబాద్ లో గెలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో కూడా టీఆర్ఎస్ అధినేతకు అంచనా ఉంది. అందుకే అక్కడ బీజేపీకి ఎట్టిపరిస్థితుల్లో గెలిచే అవకాశం ఇవ్వకూడదని పట్టుదలతో ఉన్నారు. స్వయంగా వ్యూహాలు రచిస్తున్నారు. స్వయంగా హుజూరాబాద్‌లో రెండు, మూడు బహిరంగసభలు పెట్టాలని అనుకుంటున్నారు. పరిస్థితిని బట్టి… కేసీఆర్.. నిర్ణయాలు తీసుకుంటారు. ఎంత చేసినా బీజేపీకే ఊపు ఉందనిపిస్తే.. ఆయన రివర్స్ గేర్ వేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణ యాస నేర్చుకుంటున్న నాని

తెలుగు సినిమాల్లో తెలంగాణ యాస‌, సంస్కృతి గ‌ట్టిగా ప్ర‌తిబింబిస్తోంది. ముఖ్యంగా యువ హీరోలెక్కువ‌మంది ఈ నేప‌థ్యాన్ని ఎంచుకుంటున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ తెలంగాణ హీరోనే కాబ‌ట్టి.. ఆ స్లాంగ్ భ‌లేగా పండిస్తుంటాడు. `ల‌వ్ స్టోరీ`...

టైమ్ మిష‌న్ ఎక్కుతున్న టాలీవుడ్‌

ఫార్ములా చుట్టూ టాలీవుడ్.. టాలీవుడ్ చుట్టూ ఫార్ములా తిరుగుతుంటుంది. ఓ ఫ్యాక్షన్ సినిమా హిట్ట‌యితే.. ఇంకోటి బ‌య‌ల్దేరిపోతోంది. హార‌ర్ సినిమాల‌న్నీ క‌ట్ట‌క‌ట్టుకుని వ‌స్తాయి. ల‌వ్ స్టోరీల‌న్నీ ఒకేసారి వ‌రుస క‌డ‌తాయి. ఇప్పుడు టైమ్...

విద్యార్థులకు పథకం ఏదైనా “ల్యాప్ ట్యాప్” ఖాయం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకో కానీ ల్యాప్‌ట్యాప్‌ల మీద విపరీతమైన అభిమానం చూపిస్తోంది. అలాంటిలాంటి అభిమానం కాదు.. ఎంత వీలైతే అంత మంది భుజాలకు ల్యాప్‌ట్యాప్‌లు తగిలించాలని ప్లాన్ చేస్తోంది. అందు కోసం విద్యార్థుల...

సీఐడీ సునీల్‌ను ఫిర్యాదులతో రఘురామ భయపెడుతున్నారా..!?

సీఐడీ సునీల్ కుమార్ విషయంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు.. వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఆయన తన ఫోన్‌ను అనధికారివాడారాని ఓ సారి ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తనపై ధర్డ్...

HOT NEWS

[X] Close
[X] Close