కీర్తి నో చెప్పింది: బాల‌య్య క‌ష్టాలు షురూ!

పెద్ద హీరోల‌తో సినిమా అంటే అంతా హ్యాపీనే అనుకోవాల్సిన ప‌నిలేదు. వాళ్ల‌కుండే క‌ష్టాలు వాళ్ల‌కుంటాయి. మ‌రీ ముఖ్యంగా హీరోయిన్ల‌ని వెదికిప‌ట్టుకోవ‌డం చాలా క‌ష్టం అయిపోతోంది. స్టార్ హీరోల ఇమేజ్‌కి త‌గిన హీరోయిన్లు దొర‌క‌డం లేదు. కొద్ది మంది ఉన్నా – వాళ్లు ముందుకు రావ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా బాలయ్య సినిమా అంటే ఈ స‌మ‌స్య ఎదుర‌వుతూనే ఉంటుంది. అందుకే.. మ‌ధ్యేమార్గంగా దాదాపు కొత్త‌వాళ్ల‌నో, క్రేజ్ లేనివాళ్ల‌నో ఎంచుకుని స‌రిపెట్టుకుంటుంటాడు బాల‌య్య‌. రూల‌ర్‌లో న‌టిస్తున్న వేదిక‌, సోనాల్ చౌహాన్ అందుకు ఉదాహ‌ర‌ణ‌.

ఇప్పుడు బాల‌య్య సినిమా మ‌ళ్లీ హీరోయిన్ క‌ష్టాలు మొద‌టికి వ‌చ్చాయి. బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఇటీవ‌లే క్లాప్ కొట్టుకుంది. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఇందులో క‌థానాయిక‌గా కీర్తి సురేష్‌ని అనుకున్నారు. క‌థ కూడా వినిపించారు. కానీ కీర్తి సినిమాలో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని తెలుస్తోంది. కాల్షీట్ల స‌మ‌స్య‌వల్లో, మ‌రోటో తెలీదు గానీ కీర్తి ఈ సినిమా చేయ‌డానికి రెడీగా లేద‌ట‌. దాంతో మ‌రో ఆప్ష‌న్ కోసం వెదుకులాట మొద‌లైంది. దాదాపుగా అగ్ర క‌థానాయిక‌లంద‌రినీ సంప్ర‌దించేశారు. న‌య‌న‌తార ని మ‌రోసారి తీసుకొద్దాం అనే ఆలోచ‌న కూడా ఉంది. అయితే న‌య‌న అంటే దాదాపు 2.5 కోట్లు కావాలి. ఇప్ప‌టికే ఈ సినిమా బ‌డ్జెట్ 70 కోట్లు దాటేసింది. అదీ పేప‌ర్ పైన‌. చివ‌రికి ఎంత తేలుతుందో తెలీదు. ఇప్పుడు హీరోయిన్ కోసం మ‌ళ్లీ కొన్ని కోట్లు తీసుకురావాలంటే క‌ష్టం. సో.. న‌య‌న‌తార కంటే.. కాస్త బెట‌ర్ ఆప్ష‌న్ కోసం బోయ‌పాటి శ్రీ‌ను ప్ర‌య‌త్నిస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన కేటీఆర్..!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నవంబర్‌లో నిర్వహించాలన్న ఆలోచన టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఈ విషయంలో మంత్రి కేటీఆర్ స్పష్టమైన సంకేతాలను పార్టీ నేతలు ఇచ్చేశారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఆ పరిధిలోని ఎమ్మెల్యేలతో...

బ్లడ్ క్యాంప్‌ కోసం పిలుపిస్తే నారా రోహితే లీడరనేస్తున్నారు..!

తెలంగాణ తెలుగుదేశం నేతలు ఎవరైనా నాయకుడు కనిపిస్తాడా అని చకోరా పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఎలా ఉన్నాయంటే.. చివరికి పార్టీ ఆఫీసులో తలసేమియా బాధితుల కోసం ఓ...

బీజేపీకీ ఈవీఎం ఎన్నికలే కావాలట..!

భారతీయ జనతాపార్టీ ఈవీఎంలతో మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతోంది. కరోనా కాలంలో ఒకే ఈవిఎం బటన్‌ను అందరూ అదే పనిగా నొక్కితే కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని ఆందోళనలు వినిపిస్తున్న సమయంలో......

టీడీపీ నుంచి పురందేశ్వరికి సపోర్ట్..!

భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవి పొందిన ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి ప్రశంసలు కన్నా ఏపీలో ఎక్కువగా విమర్శలే వస్తున్నాయి. సొంత పార్టీకి చెందిన నేతలు పెద్దగా అభినందించినట్లుగా కనిపించలేదు కానీ...

HOT NEWS

[X] Close
[X] Close