కీర్తిని ఓకే చేసిన చిరు

త‌మిళ `వేదాళం`ని తెలుగులో చిరంజీవితో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌కుడు. మెహ‌ర్ ఎప్పుడో స్క్రిప్టు ప‌నుల్ని పూర్తి చేసేశాడు. న‌టీన‌టుల ఎంపికే త‌రువాయి. ప్ర‌తీ పాత్ర‌కూ మెహ‌ర్ రెండు ఆప్ష‌న్ల‌ని రాసి పెట్టాడు. చిరు టిక్ పెట్ట‌డ‌మే త‌రువాయి. `వేదాళం`లో క‌థానాయ‌కుడి చెల్లాయి పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉంది. ఆ పాత్ర కోసం ముందు సాయి ప‌ల్ల‌విని అనుకున్నారు. రెండో ఆప్ష‌న్‌గా కీర్తి సురేష్ వ‌చ్చి చేరింది. అయితే.. ఇప్పుడు రెండో ఆప్ష‌నే ఖ‌రారైంద‌ని టాక్‌. చెల్లాయి పాత్ర‌కు చిరు కీర్తి సురేష్‌ని ఓకే చేశాడ‌ని స‌మాచారం. మిగిలిన పాత్ర‌ధారుల ఎంపిక పై ఓ నిర్ణ‌యానికి వ‌చ్చాక‌.. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌బృందం సిద్ధంగా ఉంది. చిరంజీవి ప్ర‌స్తుతం `ఆచార్య‌`లో న‌టిస్తున్నాడు. `ఆచార్య‌` పూర్త‌యిన వెంట‌నే ప‌ట్టాలెక్కేది `వేదాళం` రీమేకే. అందుకే.. మెహ‌ర్ అన్నీ ప‌క్కాగా రెడీ చేసుకుని ముందే సిద్ధంగా ఉండాల‌ని భావిస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ద‌ర్శ‌కేంద్రుడితో… స‌మంత‌, శ్రియ‌, ర‌మ్య‌కృష్ణ‌

కె.రాఘ‌వేంద్ర‌రావు ఇప్పుడు కెమెరా ముందుకొస్తున్నారు. ఓ నటుడిగా ఆయ‌న త‌న‌లోని కొత్త కోణాన్నిచూపించ‌బోతున్నారు. త‌నికెళ్ల భ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో కె.రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌ధాన పాత్ర‌ధారి. ఈ చిత్రంలో ముగ్గురు క‌థానాయిక‌లు...

ప్ర‌కాష్ రాజ్‌కి సెగ మొద‌లైంది

ప‌వ‌న్ క‌ల్యాణ్ ని రాజ‌కీయ ఊస‌ర‌వెల్లి అంటూ విమ‌ర్శించాడు ప్ర‌కాష్ రాజ్. బీజేపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకోవ‌డం ఆయ‌న‌కు ఏమాత్రం న‌చ్చ‌లేదు. అందుకే.. ఇలా ఆవేశ ప‌డ్డాడు. అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో...

బాలీవుడ్ లో ‘రేసుగుర్రం’ దౌడు!

ఎందుకో బాలీవుడ్ దృష్టి.. మ‌న పాత తెలుగు సినిమాల‌పై ప‌డింది. మిథునం, ఛ‌త్ర‌ప‌తి, ఊస‌ర‌వెల్లి లాంటి సినిమాల్ని వాళ్లు రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు కాస్త ఆల‌స్య‌మైనా... మరో హిట్ సినిమా కూడా బాలీవుడ్...

ఎన్నాళ్ల‌కు గుర్తొచ్చావు.. స‌లోనీ!?

స‌లోని... ఈ పేరు విని చాలా కాలం అయ్యింది క‌దా..? రాజ‌మౌళి సినిమాలో హీరోయిన్ గా న‌టించినా.. ఏమాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. మ‌ర్యాద రామన్న లాంటి హిట్ చేతిలో ప‌డినా, దాన్ని...

HOT NEWS

[X] Close
[X] Close