నాని ‘మ‌గ‌ధీర’ – ‘శ్యాం సింగ‌రాయ్‌’

`మ‌గ‌ధీర‌` ఓ పున‌ర్జ‌న్మ‌ల క‌థ‌. గ‌త జ‌న్మ‌లో విఫ‌ల‌మైన త‌న ప్రేమ‌ని ద‌క్కించుకోవ‌డానికి హీరో పున‌ర్జ‌న్మ ఎత్తుతాడు. ఇప్పుడు నాని ఎంచుకున్న‌ స్టోరీ లైన్ కూడా దాదాపుగా ఇలాంటిదే. నాని క‌థానాయ‌కుడిగా `శ్యామ్ సింగ‌రాయ్‌` సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. `టాక్సీవాలా`తో ఆక‌ట్టుకున్న రాహుల్ సంకృత్య‌న్ ద‌ర్శ‌కుడు. ఇది పున‌ర్జ‌న‌ల క‌థ‌. ఓ జ‌న్మ‌లో అనుకోకుండా చ‌నిపోయిన నాని, మ‌రో జ‌న్మ ఎత్తుతాడు. ఓ జ‌న్మ‌లో తాను ర‌చ‌యిత‌, మ‌రు జ‌న్మ‌లో ద‌ర్శ‌కుడు. అదే క‌థ‌. శ్యామ్ ఒక‌రు, సింగ‌రాయ్ ఒక‌రు. సింగ‌రాయ్ పాత్ర‌కు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా కొల‌కొత్తా నేప‌థ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్ల‌ని ఎంచుకున్న సంగ‌తి తెలిసిందే. సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టిల‌ను క‌థానాయిక‌లుగా ఎంచుకున్నారు. ఈ క‌థ‌లో మూడో హీరోయిన్‌కీ చోటుంది. ఆ పాత్ర కోసం నివేదా పేతురాజ్‌పేరు ప‌రిశీలిస్తున్న‌ట్టు టాక్‌. నాని ద్విపాత్రాభిన‌యాలు చేశాడు గానీ, పున‌ర్జ‌న్మ క‌థ‌ని ముట్టుకోలేదు. ఇది త‌న తొలి పున‌ర్జ‌న్మ క‌థ‌. ఇలాంటి క‌థ‌ల్ని డీల్ చేయ‌డం అంత ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. మ‌రి రాహుల్ దీన్ని ఎలా డీల్ చేస్తాడో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ద‌ర్శ‌కేంద్రుడితో… స‌మంత‌, శ్రియ‌, ర‌మ్య‌కృష్ణ‌

కె.రాఘ‌వేంద్ర‌రావు ఇప్పుడు కెమెరా ముందుకొస్తున్నారు. ఓ నటుడిగా ఆయ‌న త‌న‌లోని కొత్త కోణాన్నిచూపించ‌బోతున్నారు. త‌నికెళ్ల భ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో కె.రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌ధాన పాత్ర‌ధారి. ఈ చిత్రంలో ముగ్గురు క‌థానాయిక‌లు...

ప్ర‌కాష్ రాజ్‌కి సెగ మొద‌లైంది

ప‌వ‌న్ క‌ల్యాణ్ ని రాజ‌కీయ ఊస‌ర‌వెల్లి అంటూ విమ‌ర్శించాడు ప్ర‌కాష్ రాజ్. బీజేపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకోవ‌డం ఆయ‌న‌కు ఏమాత్రం న‌చ్చ‌లేదు. అందుకే.. ఇలా ఆవేశ ప‌డ్డాడు. అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో...

బాలీవుడ్ లో ‘రేసుగుర్రం’ దౌడు!

ఎందుకో బాలీవుడ్ దృష్టి.. మ‌న పాత తెలుగు సినిమాల‌పై ప‌డింది. మిథునం, ఛ‌త్ర‌ప‌తి, ఊస‌ర‌వెల్లి లాంటి సినిమాల్ని వాళ్లు రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు కాస్త ఆల‌స్య‌మైనా... మరో హిట్ సినిమా కూడా బాలీవుడ్...

ఎన్నాళ్ల‌కు గుర్తొచ్చావు.. స‌లోనీ!?

స‌లోని... ఈ పేరు విని చాలా కాలం అయ్యింది క‌దా..? రాజ‌మౌళి సినిమాలో హీరోయిన్ గా న‌టించినా.. ఏమాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. మ‌ర్యాద రామన్న లాంటి హిట్ చేతిలో ప‌డినా, దాన్ని...

HOT NEWS

[X] Close
[X] Close