పొలిటికల్‌ ట్రావెల్స్‌, ట్రబుల్స్‌, స్టోరీస్‌

విజయవాడ ఎంపి కేశినేని నాని రాజకీయ ప్రవేశం తర్వాత మొదటి నుంచి కొంత స్వతంత్రంగానూ మరికొంత దూకుడుగానూ వ్యవహరిస్తూ వస్తున్నారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరిక, బయిటకు వచ్చి టిడిపిలో చేరడం, ఎంపిగా గెలవడం మాత్రమే గాక వందలాది బస్సులున్న కేశినేని ట్రావెల్స్‌ అధినేతగానూ ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత లభించింది. విజయవాడలో చాలా మంది టిడిపి నాయకులు ఆయన చుట్టూ చేరి పోయారు. అయితే కాల్‌ సెంటర్‌ వ్యవహారం తీగ లాగడంతో చాలా మందికి నాని ఒక కొరకరాని కొయ్యగా మారారు. ఆ మధ్య ఆర్టీఎపై దాడిపై బయిటివారి విమర్శలు సహజమే అయినా పార్టీలో ఈ అంతర్గత వ్యతిరేకులకూ అది పెద్ద ఆయుధంగా మారింది.ఇంతలోనే మంత్రివర్గ విస్తరణ, నానికి ఇటీవల దగ్గరగా వుంటున్న బోండా ఉమామహేశ్వరరావు అసమ్మతి వ్యాఖ్యలు చేస్తే వెళ్లి సర్దిచెప్పడం నానిని మళ్లీ ముందుకు తెచ్చాయి. ఈ స్తితిలో తనకు తానుగా కేశినేని ట్రావెల్స్‌ మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఆర్టీఎ ప్రహసనం మొత్తం తన వ్యాపారాన్ని కాపాడుకోవడానికేనని విమర్శలు వచ్చాయి గనక అసలు ట్రావెల్స్‌నే ఎత్తివేస్తానని ప్రకటించారు. అనడంతో ఆగక అంతపనీ చేసి చాలామందిని ఆశ్చర్యపర్చారు.

ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్‌ అయిన బస్సులు ఇక్కడ తిరగడం సరికాదనే అంశంపై ఆయన విమర్శ చేస్తున్నా వాస్తవంలో గత కొంతకాలంగా నానికి ట్రావెల్స్‌ వ్యాపారంపై ఆసక్తి తగ్గుతున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. స్లీపర్‌బస్లుసు బయిట రిజిస్టర్‌ చేసుకుని ఇక్కడ తిరుగుతుంటే గతం నుంచి వున్న కేశినేని వంటివి నష్టపోతున్నాయట. ఇక దీనికి మంగళం పాడటమే మంచిదని నిర్ణయానికి వచ్చి ఆఖరి అస్త్రంగా ఆందోళనకు దిగితే అది అపశ్రుతిగా మారింది. ఈ దశలో బస్సులు నిలిపివేయడమే మంచిదని నిర్ణయానికి వచ్చారు. అయితే ఎపి బయిట కేశినేని బస్సులు ఇరుగుతూనే వుంటాయని సమాచారం.

నాని రాజకీయ అవినీతికి పాల్పడే వ్యక్తి కాదని ముక్కు సూటిగా వ్యవహరించడం ఆయన నైజమని సన్నిహితులు చెబుతున్నారు. మొన్నటి ఉదంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను పెద్ద మందలించేందేమీ లేదట. కాకుంటే సూటిగా వుంటారు గనక రాజకీయాల్లో అది అచ్చిరాదని చంద్రబాబు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారోచెప్పలేమని కొందరు హెచ్చరిస్తున్నారు కూడా. అందుకు తగినట్టే నానికి వచ్చేసారి టికెట్‌ ఇవ్వబోరని ఏకంగా నారా బ్రాహ్మణి లేదా మరో నారా నందమూరి కుటుంబ సభ్యులు పోటీ చేస్తారని కథలు వదులుతున్నారు. ఇదంతా చూసే నానిపై ఒక దుమారం సాగుతున్నట్టే చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైనా ప్రొడక్ట్స్ బ్యాన్ చేద్దాం అన్న నాగబాబు, కౌంటర్ ఇచ్చిన నెటిజన్లు

భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు 1960వ దశకం నుండి ఉన్నాయి. అప్పుడప్పుడు హిందీ చీనీ భాయి భాయి అంటూ సత్సంబంధాలు నెరపడం, మళ్ళీ అప్పుడప్పుడు చైనా కయ్యానికి కాలు దువ్వడం దశాబ్దాలుగా జరుగుతోంది....

పరిహారం, పర్యావరణానికి ఎల్జీ పాలిమర్స్ కట్టిన రూ.50 కోట్లు ..!

ఎల్జీ పాలిమర్స్ సంస్థ కలెక్టర్ వద్ద డిపాజిట్ చేసిన యాభై కోట్ల రూపాయలను..పర్యావరణ పునరుద్ధరణ.. బాధితులకు పరిహారం కోసం వినియోగించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ స్పష్టమైన తీర్పును వెల్లడించింది. కేంద్ర పర్యావరణ...

మరో మూడు నెలలు సీఎస్‌గా సహాని..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానికి మరో మూడు నెలల పొడిగింపు లభించింది. మామూలుగా ఆమెకు జూన్ 30వ తేదీతో రిటైర్ కావాల్సి ఉంది. అయితే.. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి...

ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తానంటున్న ఆనం..!

ప్రజల కోసం ప్రభుత్వాన్ని... అధికారులను నిలదీయడానికి సిద్దమని ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి. అధికారులను సరే కానీ..ప్రభుత్వాన్ని నిలదీస్తామనే మాటే నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అంతటితో వదిలి...

HOT NEWS

[X] Close
[X] Close