రివ్యూ: ఖిలాడి

తెలుగు360 రేటింగ్: 1.5/5

కొంత‌మంది హీరోలు ప్ర‌యోగాలు చేయ‌డానికి ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌రు. రొటీన్ రొడ్డ‌కొట్టుడు సినిమాల‌కే వాళ్ల ఓటు. అందులోనే హిట్లు, అందులోనే ఫ్లాపులు ప‌డుతుంటాయి. తాము న‌మ్ముకున్న క‌మ‌ర్షియ‌ల్ సూత్రాన్ని దాటి.. ఒక్క అడుగు కూడా ముందుకేయ‌రు. ర‌వితేజ‌కు హిట్లూ అలానే వ‌చ్చాయి. ఫ్లాపులూ అలానే త‌గిలాయి. క‌మ‌ర్షియ‌ల్ డోసు ప‌ర్‌ఫెక్టుగా కుదిరితే… అది క్రాక్ అవుతుంది. అటూ ఇటూ అయితే.. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీలా మారుతుంది. అంతే తేడా. క్రాక్ త‌ర‌వాత‌… ఫుల్ స్వింగ్‌లోకి వ‌చ్చిన ర‌వితేజ ఇప్పుడు ఎడా పెడా సినిమాలు చేసేస్తున్నాడు. అందులో ఖిలాడి ఒక‌టి. ఎప్పుడో విడుద‌ల కావాల్సిన ఈ సినిమా కాస్త ఆల‌స్యంగా తెర‌పైకొచ్చింది. మ‌రి ఈ ఖిలాడి ఆడిన ఆటేమిటి?  ఇది క్రాక్ అయ్యిందా?  అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీగా మారిందా?

ప‌ది వేల కోట్ల డ‌బ్బున్న ఓ ట్ర‌క్‌… మిస్స‌వుతుంది. ఆ ట్ర‌క్ కోసం రెండు ముఠాలు అన్వేషిస్తుంటాయి. కుటుంబాన్నంత‌టినీ హ‌త్య చేసిన కేసులో… మోహ‌న్ గాంధీ (ర‌వితేజ‌) అరెస్ట్ అవుతాడు. అత‌ని కేసు ఇంట్ర‌స్టింగ్ గా అనిపించి, సైకాల‌జీ స్టూడెంట్ పూజా (మీనాక్షి చౌద‌రి) మోహ‌న్ గాంధీని క‌లుసుకోవాల‌ని జైలుకి వెళ్తుంది. త‌న క‌థ విని క‌రిగిపోతుంది. త‌న తండ్రి ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి… మోహ‌న్ గాంధీని బ‌య‌ట‌కు తీసుకురావాల‌నుకుంటుంది. ఆ ప్ర‌య‌త్నంలో ఏం జ‌రిగింది?  ప‌దివేల కోట్ల డ‌బ్బు ఏమైంది? ఆ  డ‌బ్బు, మోహ‌న్ గాంధీకీ ఉన్న లింకేమిటి?  అస‌లు ఈ హ‌త్య‌ల‌న్నీ మోహ‌న్ గాంధీ ఎందుకు చేశాడు?  అనేదే ఖిలాడి క‌థ‌.

చాలా రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ లైన్‌కే.. బోలెడ‌న్ని ట్విస్టులు జోడించి.. కొత్త క‌ల‌రింగ్ ఇద్దామ‌ని చిత్ర‌బృందం రెండున్న‌ర గంట‌ల పాటు ప్ర‌య‌త్నించింది. ఇంట్ర‌వెల్ ముందు అస‌లు సిస‌లైన ట్విస్టు వస్తుంది. ఆ త‌ర‌వాత ట్విస్టుల మీద ట్విస్టులు. ఇన్ని ట్విస్టులుంటే స్క్రీన్ ప్లే ఆస‌క్తిక‌రంగా ఉండాలి క‌దా?  సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ గా మారాలి క‌దా?  కానీ ఖిలాడీ అలా ఉండ‌దు. ట్విస్టుల కోస‌మే స‌న్నివేశాలు రాసుకుని, ఆ ట్విస్టులో ఉన్న ఇంట్రెస్ట్ ఆ సీన్‌లో లేక‌.. ప్ర‌తీ స‌న్నివేశం డీలా ప‌డుతూ, లేస్తూ.. ముక్కుతూ మూలుగుతూ ముందుకు సాగుతుంటుంది. ట్విస్టులు ఎక్కువై క‌థంతా గంద‌ర‌గోళంలా త‌యార‌వుతుంది.చివ‌రికి ఆడియ‌న్స్ క‌న్వెన్స్ ని చేసే ప్ర‌య‌త్నంలో.. చాలా క‌న్‌ఫ్యూజ‌న్‌కి గురి చేసి వ‌దిలేశాడు ద‌ర్శ‌కుడు.

మోహ‌న్ గాంధీ ఫ్లాష్ బ్యాక్‌లో (మ‌ర్డ‌ర్ ఎపిసోడ్‌ని మిన‌హాయిస్తే) అంతా న‌సే. ర‌వితేజ త‌న ఎన‌ర్జీని ప్ర‌తీ ఫ్రేములోనూ చూపించ‌డానికి తెగ తాప‌త్ర‌య‌ప‌డుతున్నా.. స‌న్నివేశం పేల‌లేదు. దానికి కార‌ణం.. పేల‌వ‌మైన  స్క్రీన్ రైటింగ్‌. ఇంట్ర‌వెల్ ట్విస్టు వ‌ర‌కూ.. చాలా ఓపిగ్గా ఈ సినిమాని భ‌రించాల్సిందే. హీరో – హీరోయిన్ల ల‌వ్ ట్రాక్ మ‌రింత బోరింగ్ గా మారింది. వెన్నెల కిషోర్ ఉన్నా ఉప‌యోగించుకోలేక‌పోవ‌డంతో.. ఫ‌స్టాఫ్ స్లో గా.. సో.. సో.. గా అలా సాగిపోయింది. మ‌ధ్య‌లో దేవిశ్రీ ప్ర‌సాద్ రెండు బీటున్న పాట‌లు ఇవ్వ‌డంతో కాస్తో కూస్తో రిలాక్సేష‌న్ ద‌క్కింది. ఇంట్ర‌వెల్ త‌ర‌వాత‌.. సినిమా ఊపందుకోవాలి. కానీ మ‌రింత నీర‌సిస్తుంది. లేని పోని ట్విస్టులు జోడించుకుంటూ క‌థ‌ని కంగాళీ చేసుకుంటూ వెళ్లిపోయాడు. ప్ర‌తీ పాత్ర‌లోనూ రెండు షేడ్స్ ఉండాల‌ని ద‌ర్శ‌కుడు ఫిక్స‌యి ఉంటాడు. అందుకే ఈ సినిమాలో ప్ర‌తి క్యారెక్ట‌రు ఇద్ద‌రిలా బిహేవ్ చేస్తూ వెళ్తుంది. `ఇక్క‌డ సినిమా అయిపోయిందే.` అనుకున్న‌ప్పుడు ఓ ట్విస్టు… ఆ త‌ర‌వాత ఇంకాసేప‌టికి మ‌రో ట్విస్టు… ఇలా ఈ క‌థ‌ని ఎంత కంగాళీ చేయాలో.. అంతా చేసేశారు. `డ్రామా` సీన్లు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. ఆ డ్రామా చూసీ.. చూసీ ఏది డ్రామానో, ఏది రియ‌లో.. అర్థం కాకుండా పోయింది. `అస‌లు గాంధీ ఈ దొంగ‌త‌నాలు ఎందుకు చేస్తున్నాడో తెలుసా` అంటూ.. గాంధీ ఛారిటీల గురించి అన‌సూయ చెప్ప‌బోతోంటే… థియేట‌ర్ అంతా.. గోల గోల‌. దాన్ని బ‌ట్టి.. ఈ సినిమా నుంచి ప్రేక్ష‌కులు ఎప్పుడో బ‌య‌ట‌కు వ‌చ్చేశార‌ని, ద‌ర్శ‌కుడే.. శుభం కార్డు ఎక్క‌డ వేయాలో, ఎప్పుడు వేయాలో తెలీక తిక‌మ‌క ప‌డుతున్నాడ‌ని అర్థం అయిపోతుంది. యాక్ష‌న్లు, ఛేజులు, ట్విస్టులు ఇవ‌న్నీ కావ‌ల్సినంత ఉన్నా.. అవేం జ‌న‌రంజ‌కంగా లేవంటే.. ఆయా స‌న్నివేశాల్ని ద‌ర్శ‌కుడు ఎంత బాగా తీసుంటాడో అర్థం చేసుకోవ‌చ్చు.

ర‌వితేజ ఎన‌ర్జీ గురించి ఎన్నిసార్లు చెప్పుకుంటాం?  ఏమీ లేని చోట కూడా ఏదోటి చేసేయాల‌న్న త‌ప‌న‌.. ఇక్క‌డా క‌నిపించింది. తానొక్క‌డే చాలా సినిమాల్ని నెట్టుకొచ్చాడు. కానీ ఈసారి త‌న వ‌ల్ల కూడా కాలేదు. ర‌వితేజ క్లోజ‌ప్ పెడితే.. ముస‌లిత‌నం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. అది ఆయ‌న త‌ప్పు కాదు. వ‌య‌సు ప్ర‌భావం. డింపుల్ హ‌య‌తి.. ప‌క్కా ఐటెమ్ గాళ్ లా, వ్యాంపులా ఉంది త‌ప్ప‌, హీరోయిన్ లా లేదు. మేక‌ప్పు మ‌రీ ఓవ‌ర్ అయ్యింది. మీనాక్షి చౌద‌రి ఓకే. డాన్సులు మాత్రం ఇద్ద‌రూ ఇర‌గ‌దీశారు. అర్జున్ పాత్ర బాగానే ఉంది కానీ, మ‌రింత ప‌వ‌ర్ ఫుల్ గా ఉండాల్సింది. ర‌వితేజ‌తో పోలిస్తే.. అర్జునే యంగ్ గా క‌నిపించాడు. వెన్నెల  కిషోర్ ని స‌రిగా వాడుకోలేదు. ముర‌ళీ శ‌ర్మ, రావు ర‌మేష్ అల‌వాటైన పాత్ర‌ల్లో అల్లుకుపోయారు.

దేవిశ్రీ ప్ర‌సాద్ పాట‌లే కాస్త ఊపు తెచ్చాయి. డాన్స్ కంపోజీష‌న్‌, డ్ర‌స్సింగ్ స్టైల్స్ బాగున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌కి కావ‌ల్సినంత స‌మయం దొర‌క‌లేదో, లేదంటే ప‌ట్టించుకోకుండా వ‌దిలేశారో తెలీదు గానీ, కొన్ని లో క్వాలిటీ షాట్లు కూడా అలా చూసీ చూడ‌న‌ట్టు వ‌దిలేశారు. శ్రీ‌కాంత్ విస్సా డైలాగుల్లో మెరుపులేం లేవు. ఓ సాదా క‌థ‌కు, ట్విస్టులు జోడిస్తే.. ఇంట్ర‌స్టింగ్ గా మారుతుంది. కానీ ట్విస్టులు ఎక్కువైతే.. గంద‌ర‌గోళం మొద‌ల‌వుతుంది. ఖిలాడీ విష‌యంలో అదే జ‌రిగింది.

ఫినిషింగ్ ట‌చ్‌:  `కిల్‌…`లాడీ

తెలుగు360 రేటింగ్: 1.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close