రివ్యూ : మళ్ళీ మొదలైంది

కొన్ని ఐడియాలు అలోచించినపుడు బావుంటాయి. కొత్తగా వుందనిపిస్తాయి. అదే ఐడియా పేపర్ మీద రాసినప్పుడు అంత కిక్కు ఇవ్వకపోవచ్చు. కొన్ని ఐడియాలు పేపర్ మీద బావుంటాయి. అదే ఐడియా తెరమీదకి వచ్చేసరికి తేలిపోవచ్చు. జీ5లో వచ్చిన సుమంత్ ‘మళ్ళీ మొదలైయింది’ సినిమాకి కూడా ఇదే సమస్య వచ్చిపడింది. ప్రతి కథకి ఓ యుఎస్పీ వుంటుంది. ‘మళ్ళీ మొదలైయింది’ కథకు కూడా యుఎస్పీ వుంది. ఈ సినిమా కాన్సెప్ట్ ‘రీసెట్’. అంటే విడాకుల తర్వాత కూడా మరో లైఫ్ పార్టనర్ ని చూసుకొని జీవితాన్ని మళ్ళీ కొత్తగా డిజైన్ చేసుకోవడం. ఈ ఐడియానే సినిమాగా చేయడానికి నిర్మాతలని ఎక్సయిట్ చేసుటుంది. తెలుగులో ఇలాంటి లైనుతో సినిమా రాలేదని ఉత్సాహాన్ని కలిగించివుంటుంది. అయితే ఈ రీసెట్ ఐడియా చుట్టూ అల్లుకున్న కథ మాత్రం పాకం తప్పిన మిఠాయిలా తయారయింది. కథలోకి వివరంగా వెళితే..

విక్రమ్(సుమంత్)కి చిన్నప్పటి నుంచి వంట చేయడం ఇష్టం. విక్రమ్ తల్లి సుజాత(సుహాసిని మణిరత్నం) సింగెల్ పేరెంట్. హీరా అనే సక్సెస్ ఫుల్ మసాలా పౌడర్ కంపెనీకి ఓనర్. విక్రమ్ పెరిగి పెద్దయ్యాక చెఫ్ గా సెటిల్ అవుతాడు. కాలేజీ డేస్ లో వైశాలి (పావని రెడ్డి) విక్రమ్ ని ప్రేమిస్తుంది. కానీ విక్రమ్ కి వైశాలి పై ఫీలింగ్స్ వుండవు. నిషా( వర్షిణి సుందర్ రాజన్ )ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ పెళ్లి మున్నాళ్ళ ముచ్చటే. విక్రమ్ పద్దతి నిషాకి నచ్చదు. నిషాకి ఏం కావాలో విక్రమ్ కి అర్ధం కాదు. దీంతో ఇద్దరూ చాలా కూల్ గా విడాకులకి అప్లయ్ చేస్తారు. నిషా తరపున కోర్టులో వాదించడానికి వచ్చిన లాయర్ పవిత్ర( నైనా గంగూలీ)ని చూసి మొదట చూపులోనే విక్రమ్ లో ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. విడాకుల తర్వాత ఖాళీగా ఆరు నెలలు వంటరి జీవితం గడిపిన విక్రమ్ .. మరోసారి పవిత్రని చూసి ఆమెకు దగ్గర కావాలని ఆరాటపడతాడు. వెంటపడి ప్రేమిస్తాడు. మరి పవిత్ర, విక్రమ్ ప్రేమని అంగీకరించిందా ? విడాకుల తర్వాత మళ్ళీ ప్రేమలో పడ్డ విక్రమ్ కు ఎలాంటి అనుభవాలు ఎదురైయాయ్యాయి ? అనేది ‘మళ్ళీ మొదలైయింది’ మిగిలిన కథ.

కథ అర్ధం కావడం కోసం క్లారిటీగా చెప్పాం కానీ ఈ కథలో బోలెడంత కన్ఫ్యూజన్ వుంది. అసలు హీరో పాత్రే ఒక పెద్ద కన్ఫ్యూజన్. నిజానికి ఇలాంటి కన్ఫ్యూజన్ పాత్రలు ప్రేక్షకులకు కొత్తకాదు. అయితే ఇందులో వచ్చిన ఇబ్బంది ఏమిటంటే.. ఒకదశలో దర్శకుడే తికమకపడిపోయాడు. ఏదో చెప్పాలని ప్రారంభించి ఇంకేదో చూపించి, చివరికి ”పెళ్లి చేసుకోవాలి భయ్యా’ అనే మెసేజ్ తో ముగించేశాడు. విక్రమ్ క్యారెక్టర్ ని డిజైన్ చేయడంలోనే దర్శకుడి లెక్క తప్పింది. అన్ని విషయంలో క్లారిటీగా వున్న విక్రమ్ పెళ్లి విషయంలో మాత్రం కన్ ఫ్యూజ్ అయిపోతాడు. ఆ కన్ఫ్యుజన్ లోనే విడాకులు ఇస్తాడు. నిషా పాత్ర కూడా అంతే తేలికగా వుంటుంది. ఆమె విడాకులు తీసుకోవడం వెనుక బలమైన కారణాలు వుండవు. పైగా విడాకులు ఇచ్చేస్తే ఎంచక్కా ఇంకో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందనే ఫీలింగు కలుగుతుంది. హీరో పాత్ర కూడా రెండో హీరోయిన్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నట్లుగానే వుంటుంది. ఎదురుచుసినట్లే పవిత్రని చూసిన వెంటనే ప్రేమలో పడిపోతాడు విక్రమ్. పాపం.. ఇతడి కన్ ఫ్యుజన్ తెలియక ఆమె ప్రేమని అంగీకరిస్తుంది. పెళ్లి చేసుకోమని కోరుతుంది. పెళ్లి అనేసరికి హీరోకి పానిక్ ఎటాక్ వచ్చినంతపనౌతుంది. ఇదే పెద్ద బ్యాంగ్ అన్నట్టు ఇంటర్వెల్ పడుతుంది. ”ఓహ్.. ఆరెంజ్ సినిమా టైపు ఓన్లీ లవ్.. నో మ్యారేజ్” అనే పాయింట్ పై సెకండ్ హాఫ్ నడుస్తుందేమో అనుకుంటే అసలు ఈ కథ ఎటూ నడవదు.

ఈ కథకి మొదటి నుంచే సన్నివేశ బలం జోడించలేకపోయాడు దర్శకుడు. అన్నీ మాటలతోనే సరిపెట్టాడు. మొదట విడాకులు ఇవ్వడానికి, తర్వాత మళ్ళీ ప్రేమించడానికి మధ్య బలమైన సన్నివేశాలు లేవు. ఈ సినిమా కోసం రీసెట్ అనే కాన్సెప్ట్ అనుకున్నారు. కానీ అది ప్లేయ్ చేసిన విధానం మాత్రం ఆకట్టుకోదు. ‘విడాకుల తర్వాత కూడా మళ్ళీ జీవితం మొదలౌతుంది. మీకు సరిపడా పార్టనర్ ని ఎంచుకోండి’ అనేది రెండో హీరోయిన్ పవిత్ర పాత్ర ఆలోచన. ఈ ఆలోచనతోనే ఆమె రీసెట్ సంస్థ స్టార్ట్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్ చూపించడానికి కూడా దర్శకుడు తికమక పడ్డాడు. పవిత్ర పాత్రని ఒక లాయర్ గా పరిచయం చేశాడు. మామూలు లాయర్ కాదు.. సినియర్లు కూడా భయపడిపోయే లాయర్ అన్నట్టుగా డైలాగులు కొట్టించారు. కట్ చేస్తే ఆమె లాయర్ పని పక్కన పెట్టి రీసెట్ సంస్థ మొదలుపెడుతుంది. ఈ మాత్రానికి ఆమెను లాయర్ గా ఎందుకు చూపించినట్లు. ‘ కోర్టులో హీరో ఆమెని చూడాలి కదా” అనే సీన్ ఆర్డర్ లో ఆమెని లాయర్ చూపించివుంటే మాత్రం రైటింగ్ టేబుల్ అట్టర్ ఫ్లాపైయినట్లే.

రీసెట్ కాన్సప్ట్ ని చక్కగా వాడుకునే అవాకాశం వుంది. అది కొంచెం కొత్త పాయింటే. అయితే దానికి బలమైన ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయారు. రీసెట్ సెంటర్లో పవిత్ర, విక్రమ్ మొదటిసారి కలుసుకున్నట్లు చూపించి విక్రమ్ కి ఎలాగో ఒక స్టోరీ వుంది కాబట్టి, పవిత్రకి కూడా ఒక బలమైన బ్యాక్ స్టొరీ రాసుకొని వాళ్ళ మధ్య రీసెట్ ని ప్లేయ్ చేసివుంటే మళ్ళీ మొదలైయింది మరోలా వుండేది. అంతేకాదు… సుహాసిని పాత్రని కూడా సరిగ్గా వాడుకోలేకపోయాడు దర్శకుడు. సుహాసిని పాత్ర సింగెల్ పేరెంట్. వంటరితనంలో వున్న పెయిన్ ఆమెకు ఖచ్చితంగా తెలుసుటుంది. ఆమె పాత్ర హీరోకి తల్లి. వంటరితనం, తోడు గురించి హీరోకి ఆమె రియలైజ్ చేసివుంటే బలంగా వుండేది కానీ విడాకులు ఇప్పించే లాయర్ పాత్రతో ‘తోడు’ గొప్పదనం చెప్పించారు. బహుషా అదే వెరైటీ అనుకున్నారేమో. టోటల్ గా ఒక కన్ ఫ్యుజన్ లోనే మళ్ళీ పెళ్లి చేసి కథకి శుభం కార్డు వేసేశారు.

సుమంత్ కి విజయాలు లేవు కానీ అతని నటనకి మాత్రం వంక పెట్టలేం. చాలా సెటిల్ గా చేస్తాడు. ఇందులో విక్రమ్ పాత్రని కూడా సులువుగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. బహుశా క్యారెక్టర్ లో కన్ఫ్యూజ్ వల్ల కాబోలు కొన్ని చోట్ల మాత్రం క్లూ లెస్ గా కనిపించాడు. వర్షిణి పాత్ర ఓకే. చూడ్డానికి కొంచెం బొద్దుగా కనిపించింది. అమెది కూడా కొంచెం కన్ఫ్యూజ్ క్యారెక్టరే. నైనా గంగూలీ మంచి నటి. పవిత్ర పాత్రలో సహజంగా కనిపించింది. సినిమాలో పవిత్ర పాత్రే కొంచెం క్లారిటీగా వుంటుంది. అయితే అంత క్లారిటీగా వున్న పవిత్ర, విక్రమ్ ని ఎందుకు ఇష్టపడుతుందో సన్నివేషంలో చూపించలేకపోయారు. చివర్లో ఆ పాత్రతో ఓ సినిమాటిక్ డ్రామా ప్లే చేయడం కూడా పెద్దగా ఆకట్టుకోదు. క్లైమాక్స్ కూడా సినిమాకి ఒక మైనస్. ఇంకాస్త కొత్తగా అలోచించాల్సింది. సుహాసిని హుందాగా కనిపించింది. వైశాలిగా పావని రెడ్డిది కీలకమైన పాత్రే. అన్నపూర్ణ చెప్పిన కొన్ని డైలాగులు నవ్వులు తెప్పిస్తాయి. లాయర్ కుటుంబరావు గా కనిపించిన పోసాని జస్ట్ ఓకే. ఆయన చెప్పిన కొన్ని డైలాగులు ప్రెస్ మీట్ లో మాట్లాడినట్లు అనిపించాయి. మంజుల ఘట్టమనేని చేసిన పాత్ర కూడా పెద్ద ప్రభావం చూపదు. ఇక ఈ సినిమాలో ఏకైక రిలీఫ్ వెన్నల కిషోర్ పాత్ర. మోటివేషనల్ స్పీకర్ పాత్రలో కిషోర్ చెప్పిన డైలాగులు కొన్ని నవ్విస్తాయి. క్రిస్టఫర్ నోలన్ సినిమాలకి లింక్ చేసి చెప్పిన డైలాగులు కూడా బావున్నాయి. కానీ అవి పూర్తి మల్టిఫ్లెక్స్ ఆడియన్స్ మాత్రమే పరిమితం. సిద్ శ్రీరాం పాడిన ఓ పాట బావుంది. యాక్షన్ కి అవకాశమే లేదు. వున్న చిన్న ఫైట్ కూడా జస్ట్ తోపులాట. కెమారా వర్క్ డీసెంట్ గా వుంది. అనూప్ అందించిన నేపధ్య సంగీతం ఓకే.

సినిమాలో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. కొత్త కథ కూడా అనిపించదు. ఓటీటీలో వుంది. ప్లే చేసి చూడొచ్చు. ఎలాగూ రీమోట్ మీ చేతిలోనే వుంటుంది.

ఫినిషింగ్ టచ్: మళ్లీ అదే కథ

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలాంటి పెళ్లి చేసుకోను: ఫరియా అబ్దుల్లాతో చిట్ చాట్

‘జాతిరత్నాలు’ సినిమాతో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అంటూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అల్లరి నరేష్ కి జోడిగా...

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close