భార్యా భర్తల రోల్ రివర్సల్ కథాంశంతో ‘కి & క’

హైదరాబాద్: పెళ్ళి, రిలేషన్‌షిప్‌ కథాంశాలతో బాలీవుడ్‌లో ఎన్నో కథలు వచ్చాయి. కానీ నిన్న ట్రైలర్ విడుదలైన ‘కి & క’ చిత్రం మాత్రం వాటన్నంటిలోకి విభిన్నమని చెప్పుకోవాలి. భార్యాభర్తలు తమ పాత్రలను మార్చుకోవటం ఈ చిత్రం కథాంశం. కియా అనే అమ్మాయి, కబీర్ అనే అబ్బాయి ప్రేమించి పెళ్ళి చేసుకోవటం, కియా ఉద్యోగం చేయటం, కబీర్ హోమ్ మేకర్‌ పాత్రలో ఇంట్లో ఉండి ఇంటిపనులన్నీ చేయటం ఈ చిత్రంలోని ఇతివృత్తం. కియాగా కరీనా కపూర్, కబీర్‌గా బోనీ కపూర్ కొడుకు అర్జున్ కపూర్ నటించారు. నిన్న మధ్యాహ్నం విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుందని చెప్పాలి. ముఖ్యంగా కరీనా, అర్జున్ మధ్య సన్నివేశాలు హాట్ హాట్‌గా సాగాయి. అర్జున్ కపూర్ మెడలో కరీనా మంగళసూత్రం కట్టటం, అర్జున్ ఉదయాన్నే లేచి అత్తగారి కాళ్ళకు దండం పెట్టటం, కరీనా రాత్రి దగ్గరకు రాగానే ఇవాళ తలనొప్పిగా ఉందని అనటం వంటి సీన్‌లు బాగా నవ్వుపుట్టిస్తాయి. అమితాబ్, జయాబచ్చన్ ఈ చిత్రంలో ప్రత్యేకపాత్రలలో నటించటం ఒక విశేషం. గతంలో చీనీ కమ్, పా చిత్రాలను రూపొందించిన ఆర్.బాల్కీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించారు. పీసీ శ్రీరామ్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రపీగా వ్యవహరించారు. ఏప్రిల్ 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది. https://www.youtube.com/watch?v=B2fxtycjf_I

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com