ముద్దు సీన్ల‌పై ‘ఘాటు’గా స్పందించిన కైరా!

ఈరోజుల్లో సినిమా అంటేనే నాలుగు ముద్దులు, ఆరు హ‌గ్గులు. ‘అర్జున్ రెడ్డి’లాంటి సినిమాలో అయితే రీలుకో ర‌స‌ర‌మ్య శృంగార కావ్యం నడుస్తుంటుంది. క‌థానాయిక‌లు ఎవ‌రైనా స‌రే – ఇలాంటి స‌న్నివేశాల్లో న‌టించ‌డానికి సిద్ధంగా ఉండాల్సిందే. కైరా అద్వానీకి ఇలాంటి స‌న్నివేశాలంటే ‘లైట్‌’. ఎందుకంటే ‘ల‌స్ట్ స్టోరీస్‌’లో ఈ ద‌శ‌ల్ని దాటేసి సెక్సీ సీన్ల‌లో జీవించేసింది. అందుకే త‌న‌కు ముద్దు సీన్లంటే చాలా సాధార‌ణంగా అనిపిస్తోంది.

ముద్దు, శృంగార‌ప‌ర‌మైన స‌న్నివేశాల్లో న‌టించ‌డానికి మీకెలాంటి అభ్యంత‌రాలూ లేన‌ట్టేనా? అని అడిగితే కాస్త తెలివిగా, ఇంకాస్త ఘ‌టుగా సమాధానం ఇచ్చింది. ”ఈరోజుల్లో ముద్దు స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది, ప్రేమికులకు ముద్దు పెట్టుకోవ‌డం మామూలు విష‌యం. సినిమాల్లోనూ అవే చూపిస్తుంటారు. హీరో, హీరోయిన్లు ద‌గ్గ‌ర‌కు రాగానే.. రెండు ఊగుతున్న పొద‌ల్ని చూపిస్తే ప్రేక్ష‌కులు న‌వ్వుకుంటారు. అవ‌న్నీ పాత త‌రం రోజులు. అలా అక్క‌డ రొమాన్స్ ఉండ‌దు. కామెడీ మాత్ర‌మే ఉంటుంది. ముద్దు స‌న్నివేశాల్లో న‌టించ‌డానికి నాకెలాంటి అభ్యంత‌రం లేదు. కాక‌పోతే.. అవ‌న్నీ అందంగా చూపించ‌గ‌లగాలి. లేదంటే.. శృంగారం కూడా అప‌హాస్యం అయిపోతుంది” అని చెప్పుకొచ్చింది. త‌ను క‌థానాయిక‌గా న‌టించిన `కబీర్ సింగ్` ఈవారంలోనే విడుద‌ల అవుతోంది. అందులో ఇలాంటి స‌న్నివేశాలు చాలానే ఉన్నాయి. మ‌రి వాటిలో కైరా ఏ స్థాయిలో రెచ్చిపోయిందో..?!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com