పిల్లాడికి సోనూసూద్ పేరు పెట్టుకున్న తెలంగాణ దంపతులు

సోనూసూద్ ఇప్పుడు ఓ రియ‌ల్ హీరో. త‌న‌కి విగ్ర‌హాలు పెట్టేస్తున్నారు. గుళ్లో ఫొటో త‌గిలించి పూజ‌లూ చేసేస్తున్నారు. ఓ చిరు వ్యాపారి.. త‌న బ‌డ్డీకి…. సోనూసూద్ పేరు పెట్టుకున్నాడు. ఆ అభిమానంతో.. సోనూసూద్ స్వ‌యంగా వెళ్లి, ఆ వ్యాపారి భుజం త‌ట్టి వ‌చ్చాడు. ఇప్పుడు పుట్టిన బిడ్డ‌కూ సోనూసూద్ పేరు పెట్టేశారు.

ఖ‌మ్మం జిల్లా ముష్టికుంట్ల గ్రామంలోని పండ‌గ‌రాజు, మంగ‌మ్మ దంప‌తుల‌కు మ‌గ బిడ్డ జ‌న్మించాడు. ఆ బాబుకి సోనూసూద్ అని నామ‌క‌ర‌ణం చేశారు. ఈ నామ‌క‌ర‌ణ మ‌హోత్స‌వానికి సోనూసూద్ కీ ఆహ్వానం అందింది. సోనూ కూడా.. ఖ‌మ్మం వెళ్లి, ఆశీర్వాదాలు అందిద్దామ‌ని భావిస్తున్నాడు. ఫిబ్ర‌వ‌రి 2న సోనూసూద్ ఖ‌మ్మం వెళ్లే ఛాన్సుంది. ఇదంతా సోనూకి ఉన్న క్రేజా..?  లేదంటే సోనూ పేరు వాడుకుని.. వాళ్లేమైనా ప‌బ్లిసిటీ తెచ్చుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారా?  అనేది బోలెడ‌న్ని ప్ర‌శ్న‌ల‌కు తావిస్తోంది. కానీ ఒక్క‌టి మాత్రం నిజం. ఈమ‌ధ్య సోనూ పేరు మార్మోగినంత ఏ న‌టుడి పేరూ… వినిపించ‌లేదు. సోనూ.. క్రేజ్ అలాంటిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మళ్లీ తెలంగాణలో డ్రగ్స్ కేసుల కలకలం !

హైదరాబాద్, సైబరాబాద్‌కు ఇప్పుడు ఉన్న కమిషనర్ల నేరస్తును ఓ ఆట ఆడిస్తున్నారు. సైబరాబాద్ కమిషనర్ సైబర్ ఫ్రాడ్‌ల మీద దృష్టి పెడితే.. హైదరాబాద్ కమిషన్ సీవీ ఆనంద్ డ్రగ్స్ కేసుల్ని వెలికి తీస్తున్నారు....

ఎన్నికల జిమ్మిక్ అనుకున్నా సరే.. ప్రధాని స్టైల్ అదే !

ప్రధానమంత్రి నరేంద్రమోడీ రిపబ్లిక్ డే వేడుకల్లో భిన్నంగా కనిపించారు. భగత్ సింగ్ తరహా టోపీ..  ఓ విభిన్నమైన కండువాతో వేడుకల్లో పాల్గొన్నారు. టోపీపై బ్రహ్మకమలం ముద్ర ఉంది. కాసేపటికే నెటిజన్లు అవి ఎక్కడివో...

అదే నరసింహన్ గవర్నర్ అయితే ఇలా జరిగేదా !?

రిపబ్లిక్ డే రోజున కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైరయ్యారు. కారణం ఏమిటంటే రాజ్‌భవన్‌లో జరిగే రిపబ్లిక్ డే వేడుక.. జెండా పండుగకు కేసీఆర్ వెళ్లలేదు. కనీసం సీనియర్...

“కొత్త జిల్లాల పని” చేస్తామంటున్న ఉద్యోగ సంఘాలు !

ఉద్యోగులంతా ఉద్యమంలో ఉన్న సమయంలో ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త జిల్లాలంటూ ప్రభుత్వం ప్రకటనలు చేసిందని ఆరోపణలు వస్తున్న సమయంలో ఉద్యోగ సంఘాలు భిన్నంగా స్పందించాయి. ఐఏఎస్‌లు మినహా ఉద్యోగలంతా సమ్మెలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close