నెల్లూరు అరుణ వలపు వలలో చిక్కి సుళ్లూరుపేట వైసీపీ మాజీఎమ్మెలే కిలివేటి సంజీవయ్య పూర్తి స్థాయిలో నలిగిపోయినట్లుగా ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎంతగా అంటే ఆమెకు వైసీపీ టిక్కెట్ ఇప్పించేందుకు సంజీవయ్య చేయని ప్రయత్నం లేదు. చివరికి.. ఆమె బ్లాక్ మెయిలింగ్ ను తట్టుకోలేక.. తనకు టిక్కెట్ వద్దని..తన టిక్కెట్ నే ఆమెకు ఇవ్వాలని హైకమాండ్ కు మొర పెట్టుకునేంతగా వెళ్లిపోయారు. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.
నెల్లూరు అరుణ వైసీపీ నేతల మైండ్ సెట్ ను బాగా పట్టేసింది. వారిని ఎలా ఉపయోగించుకోవాలో అలాగే వ్యవహరించింది. సెటిల్మెంట్, వ్యభిచార ముఠాలను నిర్వహించేవారికి లీడర్ గా మారింది. అక్కడ్నుంచి వైసీపీ నేతల్ని ట్రాప్ చేయడం ప్రారంభించింది. ఇందులో పూర్తి స్థాయిలో చిక్కుకుపోయారు సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే. పదవిలో ఉన్నప్పుడు ప్రైవేటు హోటల్స్ లో మకాం పెట్టి వీరిద్దరే కార్యకర్తలు కలవడం.. సెటిల్మెంట్లు కోసం పంచాయతీలు నిర్వహించడం చేసేవారు. ఎందుకు ఇలా ఎమ్మెల్యే లొంగిపోయారంటే… వీడియోల మహిమ అని ఇప్పుడు బయటకు వస్తోంది.
సంజీవయ్య సీటు కొట్టేసి అయినా ఎమ్మెల్యే అయిపోవాలనుకున్న ఆమె లక్ష్యాలు చాలా పెద్దవి. అందుకే సంజీవయ్యను ఓ టూల్ గా వాడుకున్నారు. విజయానికి అడ్డదారులు ఉండవని ఆమె గట్టిగా నమ్ముతారు అందుకే వ్యక్తిత్వాల్లాంటివేమీ పెట్టుకోకుండా అన్ని పనులు చేసేశారు . తర్వాత ఆమె గుప్పిట్లోకి ఓ ఇద్దరు ఐపీఎస్లు కూడా చేరారు. వారిలో ఒకరు ఆమెను తీసుకుని గోవాకు వెళ్లారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
అరుణ అరెస్టు కాక ముందు.. తనకు మద్దతుగా మాట్లాడకపోతే చాలా విషయాలు బయటపెడతానని కొంత మందికి హెచ్చరికలు జారీ చేశారు. అవి ఎవర్ని ఉద్దేశించి అన్నారో కానీ.. ఆమె బ్లాక్ మెయిలింగ్ కోసం ఏర్పాటు చేసుకున్న సరుకు అంతా ఫోన్ లో నే ఉంది. ఇప్పుడు పోలీసులు తమ డిపార్టుమెంట్ పరువు కాపాడుకోవడానికి అన్నీ బయట పెట్టకపోవచ్చు కానీ.. కొన్ని మాత్రం..బయటపెట్టక తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు.