రిలీజ్ డేట్ కోసం అటూ ఇటూ ఊగిసలాడిన విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ ఫైనల్‌గా డేట్‌ను లాక్ చేసుకుంది. జూలై 31న సినిమా రిలీజ్ అవుతున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. దీంతో పాటు రిలీజ్ డేట్ ప్రోమో కూడా రిలీజ్ చేస్తారు. ప్రోమో యాక్షన్‌తో నిండిపోయింది. విజయ్ మొత్తం నాలుగు టైమ్‌లైన్స్‌లో కనిపిస్తున్నాడు. ఇందులో పోలీస్ క్యారెక్టర్ ఆసక్తికరంగా ఉంది. మిగతా లుక్స్‌లో యాక్షన్ వీర లెవెల్లో ఉంది. ‘కింగ్డమ్’ సిగ్నేచర్ డైలాగ్ ‘మొత్తం తగలబెట్టేస్తా’ని కూడా వినిపించారు.
జూలై 31 అంటే మంచి డేటే. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుకు వారం గ్యాప్, ఇక ఆగస్ట్‌లో వచ్చే పెద్ద సినిమాలు కూలీ, వార్ 2కి రెండు వారాల గ్యాప్‌లో ‘కింగ్డమ్’ దిగుతుంది. సో.. దేనితో క్లాష్ లేనట్లే. ఈ సినిమా విజయం విజయ్‌కి చాలా కీలకం. లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్.. ఇలా సినిమాలన్నీ తేడా కొట్టేశాయి. ఇప్పుడు ‘కింగ్డమ్’ పైనే బోలెడు నమ్మకాలు పెట్టుకున్నాడు.
ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ రావడం ఒక పాజిటివ్ సైన్. ప్రచారం ముమ్మరం చేస్తే ఇంకా బజ్ వస్తుంది. సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఓపెనింగ్స్ ఆగిపోతే పని జరగదు. సినిమాకి హిట్ టాక్ వచ్చి మళ్లీ అర్జున్ రెడ్డి, గీత గోవిందం వైబ్ రావాలి. అప్పుడే విజయ్ ఖుషీ.