బండి సంజయ్ పాదయాత్రకు కిషన్ రెడ్డి చెక్..!

పాదయాత్ర చేసి తెలంగాణ బీజేపీలో తిరుగులేని నేతగా ఎదగాలని ప్రయత్నిస్తున్న బండి సంజయ్‌కు కిషన్ రెడ్డి బ్రేకేశారు. ఆయన పాదయాత్రకు హైకమాండ్ అనుమతి ఇవ్వడం లేదు. మామూలుగా అయితే ఈ నెల 9వ తేదీ నుంచి… పాదయాత్ర ప్రారంభం కావాలి. దీని కోసం పాతిక కమిటీల వరకూ నియమించారు. పాతబస్తీ భాగ్య లక్ష్మి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కానీ … బండి సంజయ్‌కు అనేక సమస్యలు చుట్టు ముడుతున్నాయి. బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు ఖచ్చితంగా హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది. దీంతో జాతీయ పార్టీ ప్రత్యేక అనుమతి ఇస్తేనే షెడ్యూల్ ప్రకారం పాదయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. కానీ ఇంత వరకూ ఆ అనుమతి మాటే రాలేదు.

ఇటీవల సహాయమంత్రి నుంచి కేబినెట్ మంత్రికి ప్రమోషన్ పొందిన కిషన్ రెడ్డి ప్రమేయం లేకుండా తెలంగాణ బీజేపీలో ఎలాంటి నిర్ణయం జరిగే పరిస్థితి కనిపించడం లేదు. తాను కాకుండా మరొకరు ఫోకస్ అయ్యేలా కిషన్ రెడ్డి చేసుకోరు. అందుకే.. బండి సంజయ్ పాదయాత్రకు హైకమాండ్ అనుమతి రాకుండా చేయడమే కాకుండా.. స్వయంగా తానే.. పాదయాత్ర తరహా కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. సాధారణంగా కేంద్రమంత్రులకు బీజేపీ హైకమాండ్ పార్టీని బలపరిచే బాధ్యతలు ఇస్తుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల బాధ్యతలను బీజేపీ పెద్దలు కిషన్ రెడ్డికి ఇచ్చారు.

బండి సంజయ్ .. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయనకు అనూహ్యంగా ఇమేజ్ ఏర్పడింది. తన వివాదాస్పద వ్యాఖ్యలతో కావొచ్చు.. దుబ్బాక.. గ్రేటర్ ఎన్నికల్లో లభించిన విజయాల ఉత్సాహం కావొచ్చు కానీ.. అనేక మంది బండి సంజయ్ నాయకత్వాన్ని బలపరిచారు. కానీ తర్వాత పరిస్థితి మారింది. ఎక్కువ మంది కిషన్ రెడ్డి వైపు చేరడం ప్రారంభించారు. గతంలో ఉన్న బలంగా ప్రస్తుతం బండి సంజయ్ లేరు. కిషన్ రెడ్డి హవా నడుస్తోంది. దీంతో సంజయ్ పాదయాత్ర.. ప్రకటనకే పరిమితమన్న చర్చ బీజేపీలో ప్రారంభమైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ కానిస్టేబుల్ హత్య ఏపీ పోలీసు వ్యవస్థ బలహీనతకు సాక్ష్యం !

నంద్యాలలో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ను రౌడిషీటర్లు దారుణంగా హత్య చేసిన ఘటన ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమమవుతోంది. విధి నిర్వహణలో కటువుగా ఉండే హెడ్ కానిస్టేబుల్ రోడ్‌పై ఒంటరిగా కనిపిస్తే ఆరుగురు...

ఫ‌స్టాఫ్ లాక్ చేసిన అనిల్ రావిపూడి

ఎఫ్ 3తో.. త‌న విజ‌య యాత్ర‌ని దిగ్విజ‌యంగా కొన‌సాగించాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు త‌న దృష్టంతా బాల‌కృష్ణ సినిమాపైనే ఉంది. అనిల్ రావిపూడితో బాల‌య్య సినిమా ఓకే అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం...

కేసీఆర్ కన్నా మేఘానే టార్గెట్ చేస్తున్న షర్మిల!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర వాయిదా వేసుకుని మరీ గవర్నర్ తమిళిసైను కలిశారు. ఓ పెద్ద ఫైల్ తీసుకెళ్లారు. అందతా కాళేశ్వరంలో జరిగిన అవినీతి అని.. గవర్నర్‌కు ఆధారాలిచ్చామని చెప్పారు....

మీడియా వాచ్ : కులాల మధ్య చిచ్చుపెట్టి చానళ్లు ఎంత సంపాదించుకుంటాయి ?

రాజకీయ మీడియా వలువలు వదిలేసింది. విలువ కట్టుకుని.. వసూలు చేసుకుని నగ్నంగా ఊరేగుతోంది. కులాల పేర్లు పెట్టి ఆ రెండు కులాలు కొట్లాడుకుంటున్నాయని ప్రచారం చేస్తోంది. చర్చలు నిర్వహిస్తోంది. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close