సునీల్ సినిమా: బుజ్జీ.. ఇలా రా!

సునీల్ స్పీడు పెంచాడు. వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. హీరోగా, విల‌న్ గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా, క‌మెడియ‌న్ గా.. ఫుల్ బిజీ. త‌ను హీరోగా న‌టించిన `క‌న‌ప‌డుట‌లేదు` విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. టాలీవుడ్ లో తెర‌కెక్కుతున్న కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో సునీల్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు త‌న ఖాతాలో మ‌రో సినిమా చేరింది. అదే.. `బుజ్జీ.. ఇలా రా`. ధ‌న్‌రాజ్ మ‌రో హీరో. `గ‌రుడ వేగ‌`అంజి ద‌ర్శ‌కుడు. ఈచిత్రానికి మ‌రో ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి క‌థ‌, స్క్రీన్ ప్లే అందించారు. ఆయ‌న నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చాందిని హీరోయిన్‌. ఇదో సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ అని, సునీల్ పాత్ర చిత్ర‌విచిత్రంగా ఉంటుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎయిడెజ్ కాలేజీలపై ప్రభుత్వ విధానంతో మైనస్సే !

దశాబ్దాలుగా విద్యా సేవ అందిస్తున్న ఎయిడెడ్ కాలేజీలను అయితే ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి లేకపోతే ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఎయిడెడ్ కాలేజీలు ప్రభుత్వానివిగానే సాగుతున్నాయి....

తెలంగాణలో కూడా ప్రభుత్వ మటన్ !

ఏపీ ప్రభుత్వం మటన్ మార్టుల పేరుతో ఓ కాన్సెప్ట్‌ను ‌తమ అధికార మీడియా ద్వారా ప్రజలకు తెలియచెబితే జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి పశుసంవర్థక మంత్రి అలాంటి ఆలోచనలేదని. అలా...

కేశినేనివి బెదిరింపులా ? నిజంగానే విరక్తి చెందారా ?

కేశినేని నాని ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా టీడీపీని వ్యతిరేకించే.. వైసీపీకి దగ్గరగా ఉండే మీడియాలో ప్రచారం జరిగింది. ఆయనే ఈ విషయాన్ని చెప్పినట్లుగా ఆ మీడియా చెప్పుకొచ్చింది. తన ఆశక్తతను...

టీ కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తి కూడా కామెడీ అయిపోతోందా !?

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లుగా చెలామణి అయ్యే కొంత మంది నాయకులను రేవంత్ రెడ్డి ప్రణాళిక ప్రకారం సైడ్ చేస్తున్నట్లుగా ఉన్నారు. కలసి వస్తే సరే లేకపోతే వారి అసంతృప్తిని కూడా లెక్కలోకి రాకుండా...

HOT NEWS

[X] Close
[X] Close