కేకే సర్వే ఫలితాలను కేకే ప్రకటించారు. ఆయన భారత రాష్ట్ర సమితి జూబ్లిహిల్స్ లో ఏకపక్ష విజయం సాధించబోతోందని ప్రకటంచారు. బీఆర్ఎస్ పార్టీకి 55 శాతం ఓట్లు వస్తాయని తేల్చారు. కాంగ్రెస్ పార్టీకి 37 శాతం ఓట్లు వస్తాయని.. బీజేపీ పార్టీకి గతంలో వచ్చిన ఓట్లలో సగమే వస్తాయని ప్రకటించారు. ఇది ఒక్క రోజులో చేసిన సర్వే కాదని.. తాము చాలా కాలం పాటు అన్ని డివిజన్లలో చేసిన సర్వేగా ప్రకటించారు.
మజ్లిస్ ఇచ్చిన సపోర్టును ముస్లింలు పట్టించుకోకుండా.. కాంగ్రెస్ పార్టీకి కాకుండా. బీఆర్ఎస్ పార్టీకే సగానికిపైగా ఓట్లు వేస్తున్నారని కేకే తేల్చారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో యాభై ఐదు శాతం ఓట్లు అంటే అసాధారణమైన విషయంగా చెప్పుకోవాలి. కేకే సర్వేస్ చేసిన ఫలితాలు కొన్ని రాష్ట్రాల్లో విఫలమయ్యాయి. ఓవరాల్ గా చేసే సర్వేల కన్నా ఇలా.. నియోజకవర్గాల వారీగా చేయడం కొంచెం అసాధారణమైన విషయం అనుకోవచ్చు.
కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తున్న అడ్వాంటేజ్‌లు నవీన్ యాదవ్ బలం, మజ్లిస్ సపోర్టు., అధికార పార్టీ అనే బలం అన్నీ మైనస్ చేసుకుని భారత రాష్ట్ర సమితికే యాభై ఐదుశాతం ఓట్లు వస్తాయని చెప్పడం తో కేకే సర్వేస్ కాస్త రిస్క్ తీసుకున్నారనే అనుకోవచ్చు. బీజేపీ ఓట్లు సగానికి సగం తగ్గి.. బీఆర్ఎస్ పడినా అంత శాతం ఓట్లు రావడం అసాధారణమైన విషయం. ఫలితాలు తేడా వస్తే కేకే సర్వేస్ కు ఉన్న విశ్వసనీయత పూర్తిగా తెబ్బతిని పోతుంది.