టెన్త్ నాలుగు సార్లు తప్పి ఎమ్మెల్యేగా గెలిచా : కొడాలి నాని

మంత్రి కొడాలి నాని .. నారా లోకేష్‌కు తనదైన శైలిలో చాలెంజ్ చేశారు. నారా లోకేష్ అమెరికాలో చదవి మంగళగిరిలో ఓడిపోయాడని.. తాను టెన్త్ నాలుగు సార్లు తప్పి ఎమ్మెల్యేగా గెలిచానని.. లోకేష్ తనపై పోటీ చేసి గెలవాలని కొడాలి నాని సవాల్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎప్పట్లాగే టీడీపీపై తన భాషా ప్రయోగాన్ని చేశారు. లోకేష్‌, చంద్రబాబులపై తిట్లు లంకించుకున్నారు. ఈ క్రమంలో మళ్లీ ప్రజాభిప్రాయాన్నికోరాలని టీడీపీ చేస్తున్న డిమాండ్‌పై కొడాలి నాని ఇలా మాట్లాడారు. సీఎం జగన్‌కు సవాల్ చేసే స్థాయి లోకేష్‌కు లేదని.. దమ్ముంటే గుడివాడలో తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు.

తాను లోకేష్ కంటే ఎంత తక్కువ వ్యక్తినో చెప్పుకునేందుకు చదువు అంశాన్ని తెరపైకి తెచ్చారు. నారా లోకేష్ అమెరికాలో చదువుకున్నాడని కూడా తానే చెప్పారు. తాను టెన్త్ నాలుగు సార్లు తప్పానని కూడా తానే చెప్పుకున్నారు. చదువులో తనది … లోకేష్ కంటే ఎంతో తక్కువ అని… తనపై పోటీ చేసి గెలవాలనిలోకేష్‌కు సవాల్ విసరడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓటర్లు చదువును బట్టి.. సంస్కారాన్ని బట్టి ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకుంటే.. కొడాలి నానికి డిపాజిట్ అయినా వచ్చే అవకాశం ఉంటుందా అన్నది చాలా కాలంగా ఉన్న చర్చ. దీన్ని కొడాలి నాని మరోసారి నిరూపించేప్రయత్నం చేశారు.

కొడాలి నాని నిరక్ష్య రాస్యుడని.. సంస్కారం లేదని టీడీపీ నేతలు అదే పనిగా ఆరోపిస్తూ ఉంటారు. సంస్కారం విషయంలో ఎలాంటి సర్టిఫికెట్లు ఉండవు కానీ.. చదువు విషయంలో మాత్రం తాను పదో తరగతి నాలుగు సార్లు తప్పానని.. అయినా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నానని చెప్పడం ద్వారా గుడివాడ ఓటర్లను ఓ రకంగా అవమానించినట్లుగానే అవుతోంది. చదువు, సంస్కారం లేని వారిని గుడివాడ ప్రజలు గెలిపిస్తున్నారని కొడాలి నానినే చెప్పినట్లు అయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘స‌లార్’ రిలీజ్ డేట్ .. పెద్ద ప్లానే ఉంది!

పాన్ ఇండియా ప్రాజెక్టు స‌లార్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది. 2023 సెప్టెంబ‌రు 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఇది.. `రెబ‌ల్` రిలీజ్ డేట్. దాంతో ప్ర‌భాస్ అభిమానులు కంగారు ప‌డుతున్నారు.కాక‌పోతే... ఈ...

ఆ ఇద్ద‌ర్నీ గీతా ఆర్ట్స్ భ‌లే ప‌ట్టేసింది

సినిమా విడుద‌ల అయ్యాక, రిజ‌ల్ట్ ని బ‌ట్టి ద‌ర్శ‌కుడి చేతిలో అడ్వాన్సులు పెట్ట‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన సంగ‌తే. ఏ సినిమా హిట్ట‌వుతుందా? అని నిర్మాత‌లు ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. అయితే.. విడుద‌ల‌కు...

‘బింబిసార 2’లో… దిల్ రాజు హ్యాండ్‌

ఎవ‌రూ ఊహించ‌లేనంత పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసింది బింబిసార‌. క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు అంద‌రి దృష్టీ పార్ట్ 2పై ఉంది. బింబిసార విజ‌యంతో.. పార్ట్ 2పై న‌మ్మ‌కాలు...

మ‌హేష్ కోసం రూటు మారుస్తున్న త్రివిక్ర‌మ్‌

త్రివిక్ర‌మ్ సినిమా అంటే ఎలా ఉంటుంది? కుటుంబం, బంధాలు, అనురాగాలు, ఆప్యాయ‌త‌లు, సెంటిమెంట్.. వీటి మధ్య‌లో హీరోయిజం, పంచ్‌లూ.. ఇవ‌న్నీ ఉంటాయి. త్రివిక్ర‌మ్ సూప‌ర్ హిట్లు అత్తారింటికి దారేది నుంచి... అలా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close