సీట్ల లెక్కల కోసం కోదండరాం ఢిల్లీ వైపు చూస్తున్నారా..?

మహాకూటమిలో సీట్ల సర్దుబాటు విషయంలో తెలంగాణ కాంగ్రెస్ తీరుపై కోదండరాం అసహనంతో ఉన్నారు. సాగదీయకుండా సీట్ల సర్దుబాటు అంశం త్వరగా తేల్చాలని కాంగ్రెస్ కు డెడ్ లైన్ విధించారు. అది కూడా అయిపోవచ్చింది. ఇలా కాదు లేని… కోదండరాం.. ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలతో టచ్‌లోకి వెళ్లారు. కొద్ది రోజుల క్రితం.. టీపీసీసీ కి ఇచ్చిన తమ జాబితాను ఏఐసీసీకి పంపించారట. నిజానికి ఏఐసిసి నేతలతో… కోదండరాంకు పరిచయాలున్నాయి. గత ఎన్నికలకు ముందు సోనియాగాంధీని రహస్యంగా కలిశారన్న కారణంగానే… కేసీఆర్.. కోదండరాంను పక్కన పెట్టారన్న ప్రచారం జరిగింది. పోటీ చేయాలనుకుంటున్న పదహారు స్థానాల జాబితాను.. ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈ 16 స్థానాల్లో కనీసం 12 స్థానాలైన కేటాయించాలని లేదంటే కూటమికి దూరంగా ఉండాలనే ఆలోచనలో ఉన్నట్లు టీజేఎస్ వర్గాలు ఉన్న ప్రచారం జరుగుతోంది.

టీజెఎస్ అల్టీమేటంపై తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆ పార్టీతో పొత్తు వద్దనే చర్చ ఎక్కువగా నడుస్తోంది. టీడీపీ, సీపీఐలతో కలసి పోటీ చేస్తే చాలని భావిస్తున్నారు. ఈ రెండు పార్టీలు సీట్ల విషయంలో కొంత పట్టువిడుపులతోనే ఉన్నట్లు కాంగ్రెస్ భావిస్తోంది. టీడీపీకి ప్రతీ గ్రామంలో స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది. ఇటీవల కాంగ్రెస్ జరిపిన సర్వేల్లో టీడీపీకి ఐదు నుంచి ఎనిమిది శాతం ఓట్లు ఉన్నట్లు తేలిందట. అందులో కనీసం రెండు శాతం ఓట్లు తమకు ట్రాన్స్ ఫర్ అయినా తమకు లాభమేనని కాంగ్రెస్ నాయకులు లెక్కలు వేస్తున్నారు. దానికి తోడు టీడీపీ నేతలు కూడా తమకు బలమున్న చోట మాత్రమే సీట్లను కోరుతోంది. పదిహేను సీట్లు ఇచ్చేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలస్తోంది.

కోదండరాం మెట్టు దిగకుండా, బెట్టు చేయడం కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెట్ట అంశమే అయినా… సర్వేల్లో కోదండరాం పార్టీ బలం..ఇతర అంశాలు చూసుకుని… హైకమాండ్‌కు నివేదిక పంపుతున్నారు. ఇప్పటికే.. బలం లేకపోయినా… ఆయనకు ఉన్న క్రెడిబులిటిని బట్టి.. సీఎంపీ చైర్మన్‌ను చేస్తామన్నామని.. సీట్లు ఇస్తే టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్తాయన్న నివేదికను… తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి పంపారు. అటు పెద్దన్న పాత్రను , ఇటు అడిగినన్ని స్థానాలు ఇచ్చి తాము నిమిత్తమాత్రులుగా ఉండటం కన్నా ఆయన్ను వదులుకోవడానికైనా సిద్దం కావాలని కాంగ్రేస్ హైకమాండ్‌కు చెబుతున్నారు. ఇద్దరిలో ఎవరు ఈగోకి పోయినా.. మహాకూటమి నుంచి టీజేఎస్ వైదొలగడం ఖాయంగానే కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

కేసీఆర్, హరీష్ రావులకు నోటిసులు..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్...

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close