బందర్‌ పార్లమెంట్‌కు పోటీ చేయడానికి వంగవీటి రాధా ఒప్పుకున్నారా..?

విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానానికి తనను తీసేసి… మల్లాది విష్ణును ఇన్చార్జ్‌గా పెట్టడమే కాదు.. తనకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని రగిలిపోతున్న… వంగవీటి రాధాకృష్ణను… మెత్త బరిచేందుకు ఎట్టకేలకు.. వైసీపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. ఆ పార్టీలో నెంబర్ టు.. విజయసాయిరెడ్డి… విజయవాడలో వంగవీటి రాధాతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం లేదా.. మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని జగన్ సూచనగా చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. ఏ స్థానం నుంచి పోటీ చేసినా.. ఆర్థికంగా.. పార్టీ అండగా ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని..మల్లాది విష్ణును బలపరచాలని కోరినట్లు తెలుస్తోంది.

అయితే వంగవీటి రాధాకృష్ణ..నాలుగేళ్లుగా తాను సెంట్రల్ నియోజకవర్గంలో పని చేసుకుంటున్న తీరును వివరించి.. అక్కడి నుంచి అయితే కచ్చితంగా గెలుస్తానన్న నివేదికలు చూపించారని ప్రచారం జరుగుతోంది. కానీ జగన్ నిర్ణయం మేరకు.. మల్లాది విష్ణుకు టిక్కెట్ ఖరారు చేసేశామని… పార్లమెంట్‌ బరిలో అయితే బెటర్ అని చెప్పిట్లు తెలుస్తోంది. ఈ విషయంలో… జగన్ ఆలోచనల్లో ఎలాంటి మార్పు రాదని.. త్వరగా నిర్ణయం తీసుకుంటే… వెంటనే… బందరు పార్లమెంట్ స్థానానికి కానీ.. విజయవాడ తూర్పు స్థానానికి కానీ సమన్వయకర్తగా ప్రకటిస్తారని.. ఎన్నికల పని చేసుకోవచ్చని చెప్పినట్లు తెలుస్తోంది. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ ఖర్చు మొత్తం పార్టీ భరిస్తుందన్న హామీ కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే దీనిపై.. వంగవీటి రాధా మరింత స్పష్టత కోరినట్లు సమాచారం.

నిజానికి వంగవీటి రాధాకృష్ణ తీవ్ర అసంతృప్తికి గురయినప్పుడు.. ఒక్కరంటే.. ఒక్కరు కూడా వైసీపీ అగ్రనేతలు పలకరించిన పాపాన పోలేదు. కొడాలి నాని మాత్రం వచ్చి… తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని చెప్పి వెళ్లారు. అభిమానులు వైసీపీ జెండాలు తగులబెట్టి.. రచ్చ చేస్తే.. మూడు రోజులు… సంయమనం పాటించండి అని విజ్ఞప్తి చేశారు. కానీ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. చివరికి … పార్టీలో ఉండీ లేనట్లు ఉన్న.. వంగవీటిని.. ఏదో ఓ నిర్ణయం తీసుకోమని చెప్పడానికి.. విజయసాయిరెడ్డి కలిసినట్లు ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close