తొడకొట్టిన కోడి..! కో అంటే కోట్లు..!

ఈ సంక్రాంతికి కోస్తా జిల్లాల్లో కోడి తొడకొట్టింది. గ్రామాల్లో ఎక్కడ చూసినా కోడిపందేల బరులే కనిపించాయి. అన్నింటికీ వైసీపీ రంగులు వేయడంతో పోలీసులుకూడా వాటి వైపు చూడలేదు. కోట్లకుకోట్లు జూదం రూపంలో చేతులు మారాయి. గుండాట, పేకాటలు కూడా జోరుగా సాగాయి. సంక్రాంతి అంటే కోడి పందాలన్నట్లుగా కోస్తా జిల్లాల్లో విరివిగా బరులను ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాల్లో ఊరూవాడా బరులు ఏర్పాటు చేశారు. అన్ని చోట్లా.. వైసీపీ రంగులేశారు. అంటే.. అవి వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన బరులని.. అంటే.. లైసెన్స్ ఉన్నట్లేనని .. పోలీసులు అటు వైపు రాకూడదని అర్థం. దానికి తగ్గట్లుగానే పోలీసులు ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ఆ బరుల వద్ద .. ఇష్టం వచ్చినట్లుగా కోట్లకు కోట్లు పందేలు నడిచాయి. పేకాట క్లబ్‌ల నిర్వహణలో రాటుదేలిపోయిన నేతలు ఎక్కువగా ఉండటంతో… పందెల నిర్వహణ సులువుగా మారిపోతోంది.

డబ్బులకు టోకెన్లు ఇవ్వడం.. అప్పటికప్పుడు బంగారం కుదువ పెట్టుకోవడం… కావాలంటే ఆస్తులు తనఖా పెట్టుకోవడం కోసం కూడా ఏర్పాట్లు చేసేశారు. ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున జూదరులు.. తరలి వస్తున్నారు. ఒక్కో జిల్లాలో రోజుకు యాబై కోట్ల వరకూ చేతులు మారుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. జూదంలో గెలిచేవాళ్లు ఉండరు… గెలిచినా ఓడిపోయేవారే ఉంటారు. కానీ మధ్యవర్తులు.. బరులు నిర్వహించేవారే పెద్ద ఎత్తున సంపాదించుకుంటారు. కోడి పందెలకు తోడు.. గుండాట.. పేకాట కూడా సమాంతరంగా నడుస్తున్నాయి. జూదరులు ఏది ఇష్టమైతే దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.

కోడిపందేలతో పాటు పేకాట, గుండాట కూడా నడుస్తూండటం.. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతూండటంతో.. గొడవలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. పందాలలో భారీ ఎత్తున బెట్టింగ్ జరుగుతుంది. ఈ బెట్టింగ్ లో వివాదం కారణంగా ఇరువర్గాలు ఒకరిపై ఒకరు గంట సేపు దాడులు నిర్వహించడంతో కొన్ని కోట్ల భయానక వాతావరణం ఏర్పడుతోంది. పోలీసులు మాత్రం ఆ వైపు చూడటం లేదు. పండుగ సందర్భంగా.. మూడు రోజులు పట్టించుకోమని.. తర్వాత మాత్రం తాట తీస్తామని పోలీసులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నెగిటీవ్ రోల్స్ చేస్తేనే స‌త్తా తెలిసేది: లావ‌ణ్య త్రిపాఠీతో ఇంట‌ర్వ్యూ

`నా నుంచి మీరు కొత్త‌ద‌నం కోరుకుంటున్నారు` కింగ్ లో బ్ర‌హ్మానందం డైలాగ్ ఇది. ఇప్పుడు హీరోయిన్లు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. `క్యారెక్ట‌ర్ కొత్త‌గా లేక‌పోతే... ఎవ్వ‌రూ ప‌ట్టించుకోరు` అనే విష‌యాన్ని గుర్తిస్తున్నారు....

ధర్డ్ ఫ్రంట్ పెట్టేసుకుని సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్న కమల్..!

తమిళనాడు ఎన్నికల్లో తనను ఎవరూ పట్టించుకపోయినా కమల్ హాసన్ మాత్రం తన పని తాను చేసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తన బలం తేలిపోవడంతో ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన పార్టీలు...

బీజేపీ పరిస్థితి బాగోలేదనే సర్వేలేమీ బయటకు రాలేదా..!?

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే నెల ఏడో తేదీన వస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఓ ఎన్నికల ప్రచారసభలో హింట్ ఇచ్చినా అది విపక్షాలను...

సాగర్‌లో బీజేపీది దుబ్బాకలో కాంగ్రెస్ పరిస్థితే..!

తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఒక్క సారిగా వచ్చిన ఊపు.. ఆ పార్టీకి చిక్కులు కూడా తెచ్చి పెడుతోంది. నాగార్జున సాగర్‌లో పోటీ చేసేది తామంటే తాము అని పోటీ పడుతూండటంతో కాంగ్రెస్...

HOT NEWS

[X] Close
[X] Close