కేసుల వలలో మరో టీడీపీ బీసీ నాయకుడు..!

మచిలీపట్నంలో మోకా భాస్కర్ రావు అనే వైసీపీ నేత హత్య జరిగింది. పరామర్శకు వచ్చిన పేర్ని నాని.. రాజకీయ హత్యే అని మీడియా ముందు గట్టిగా వాదించారు. తర్వాతి రోజు… ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరు చేర్చారు. కానీ దాన్ని సీక్రెట్ గా ఉంచారు. ఆ తర్వాతి రోజు.. మోకా భాస్కర్ రావు బంధువుల పేరుతో కొంత మంది వైసీపీ కార్యక్రతలను.. పోగు చేసి.. కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయాలని ధర్నా చేయించారు. సాయంత్రానికి అరెస్ట్ చేశారు. రహస్య ప్రాంతానికి తరలించి విచారణ చేస్తున్నారు. ఇదీ.. మచిలీపట్నంలో మూడు రోజులుగా జరుగుతున్న హత్యా రాజకీయాల పరంపర.

మోకా భాస్కర్ రావును హత్య చేసిన తర్వాత నిందితులు కొల్లు రవీంద్ర పీఏకు ఫోన్ చేశారు. ఆ ఫోన్ ద్వారా రవీంద్ర మాట్లాడారనేది పోలీసుల అభియోగం. కాల్ రికార్డుల్లో ఇది ఉందో లేదో లేదో… తెలియదు. కాల్ డేటా పరిశీలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ప్రాథమిక విచారణ జరిగిందో లేదో తెలియదు కానీ.. ఆయనను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించి విచారణ జరుపుతున్నారు. టీడీపీ నేతలుగా ఉండి కేసుల్లో ఇరుక్కుంటున్న బీసీ నేతల్లో ఈయన నాలుగో ముఖ్య నేత. అచ్చెన్నాయుడు, యనమల, చినరాజప్పతో పాటు ఇప్పుడు కొత్తగా కొల్లు రవీంద్ర ఈ జాబితాలో చేరారు.

కొల్లు రవీంద్ర ఐదేళ్లు మంత్రిగా పని చేశారు. మచిలీపట్నంలో ఎప్పుడూ… శాంతిభద్రతల సమస్య రాలేదు. ఆయన నిజంగా.. అంత వయోలెంట్ పొలిటికల్ లీడర్ అయితే.. మంత్రిగా ఉన్న సమయంలో మచిలీపట్నంలో పరిస్థితులు వేరుగా ఉండేవని టీడీపీ నేతలు అంటున్నారు. ఆయన ఎప్పుడూ ఎవరితోనూ కనీసం కోపంగా కూడా మాట్లాడరని రాజకీయవర్గాలు చెబుతూ ఉంటాయి. అలాంటి లీడర్‌ను.. ఏకంగా హత్య కేసులో ఇరికించడం వెనుక.. పెద్ద స్కెచ్ ఉందని.. టీడీపీ నేతలు అంటున్నారు. పార్టీలో చేరేందుకు అంగీకరించని వారందరిపై.. ఇలాంటి కేసులతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close