బీజేపీపై డైరక్ట్ ఎటాక్ చేస్తున్న వైసీపీ..! సీన్ అర్థమవుతోందా..?

భారతీయ జనతా పార్టీతో కలిసి రఘురామకృష్ణంరాజు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని మంత్రి రంగనాథరాజు ఓ వైపు విమర్శలు గుప్పించారు. మరో వైపు.. రఘురామకృష్ణంరాజు ఎవరితో కలిసి ఇదంతా చేస్తున్నారో అందరికీ తెలుసని.. ఢిల్లీలో విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇతర వైసీపీ నేతలు.. రఘురామకృష్ణంరాజు బీజేపీలో చేరడానికే.. వైసీపీపై నిందలేస్తున్నారని… విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటి వరకూ భారతీయ జనతా పార్టీతో తమకు సన్నిహిత సంబంధాలున్నాయని.. వైసీపీ నేతలు చెప్పుకుంటూ ఉండేవారు. రాష్ట్రంలో ఎవరైనా బీజేపీ నేతలు వైసీపీ సర్కార్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే.. వారిని టీడీపీకి అమ్ముడుబోయారని విమర్శిస్తారనే కానీ.. బీజేపీని పల్లెత్తు మాట అనేవాళ్లు కాదు. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది.

నేరుగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వాన్ని వైసీపీ నేతలు టార్గెట్ చేసుకుంటున్నారు. రఘురామకృష్ణంరాజు వెనుక బీజేపీ ఉందని.. నమ్మకానికి వచ్చేసి.. తమ పార్టీ గుర్తింపు మీదే గురి పెట్టారన్న అనుమానాలు ఆ పార్టీలో ప్రారంభమయ్యాయి. గతంలో.. పలుమార్లు జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఈసీ లేఖలు రాసింది. వైఎస్ఆర్ అనే పదం వాడవద్దని ఆ లేఖల సారాంశం. ఆ విషయం రఘురామకృష్ణంరాజునే బయట పెట్టారు. అది మాత్రమే కాదు.. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం.. ఓ రాజకీయ పార్టీ చేపట్టాల్సిన చర్యలేవీ.. వైసీపీ చేపట్టలేదు. వీటన్నింటినీ.. నర్సాపురం ఎంపీ వెలుగులోకి తెచ్చి.. అదే అంశాలతో.. ఆ పార్టీ గుర్తింపు రద్దు కోసం.. కొత్త తరహాలో పోరాటం చేస్తున్నారు. దీని వెనుక ఖచ్చితంగా బీజేపీ ఉందని… రఘురామకృష్ణంరాజుకు కావాల్సిన సహకారం అంతా బీజేపీ నుంచి అందుతోందని వైసీపీ ఓ అంచనాకు వచ్చింది.

భారతీయ జనతా పార్టీకి తాము రాజ్యసభ సీటు ఇచ్చామని.. తాము చెప్పినట్లుగా వారు వింటారని.. వైసీపీ అగ్రనేతలు ఆశ పడుతూ వచ్చారు. అందుకే… కేంద్రంతో సంబంధం ఉన్న వివిధ నిర్ణయాలను అసువుగా తీసుకుంటూ వస్తున్నారు. మూడు రాజధానుల అంశానికి మొదట్లో సహకారం తెలిపినా… తర్వాత సైలెంటయిపోయింది. తర్వాత మండలి రద్దు సహా ఏ అంశంలోనూ… వైసీపీకి బీజేపీ సహకరించడం లేదు. పైగా… ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై విరుచుకుపడటం ఎక్కువయింది వీటన్నింటిని పరిశీలించిన వైసీపీకి.., బీజేపీ తమను టార్గెట్ చేసిందన్న నిర్ణయానికి వచ్చినట్లుగా డిసైడ్ అయింది. అందుకే.. ఇక నేరుగా.. బీజేపీ హైకమాండ్ పైనే గురి పెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజంగా బీజేపీ కన్నెర్ర చేయాలనుకుంటే… వైసీపీని నిర్వీర్యం చేయడం… ఒక్క రోజులో పని అని ఇతర రాజకీయ పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. మొత్తానికి ఏపీ రాజకీయంలో మాత్రం స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

170 కోట్ల‌తో ఓటీటీ సినిమానా?

ఓటీటీ.. ప‌రిధి పెరుగుతోంది. చిత్ర‌సీమ‌ని మెల్ల‌మెల్ల‌గా ఓటీటీ ఆక్ర‌మించుకుంటోంది. నిర్మాత‌ల‌కు ఇదో ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా మారింది. థియేట‌ర్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఓటీటీ త‌న రూపాన్ని మార్చుకుంటోంది. ఓటీటీ సంస్థ‌లే... భారీ పెట్టుబ‌డితో సినిమాలు...

ఫ్లాప్ హీరోతో.. యూవీ సినిమా

ద‌ర్శ‌కుడు శోభ‌న్ గుర్తున్నాడా? వ‌ర్షం సినిమా ద‌ర్శ‌కుడు. ప్ర‌తిభావంత‌మైన ద‌ర్శ‌కుడు... చాలా త‌క్కువ వ‌య‌సులోనే క‌న్నుమూశాడు. త‌న త‌న‌యుడే సంతోష్. త‌ను నేను, పేప‌ర్ బోయ్ సినిమాల‌లో హీరోగా క‌నిపించాడు. ఆ...

కరోనా కట్టడిలో ఎట్టకేలకు హైకోర్టును మెప్పించిన తెలంగాణ సర్కార్..!

కరోనా నివారణ చర్యల విషయంలో తెలంగాణ హైకోర్టు నుంచి అదే పనిగా మొట్టికాయలు తింటున్న ప్రభుత్వానికి మొదటి సారి కాస్త రిలీఫ్ దొరికింది. రాష్ట్ర ప్రభుత్వం సరైన దిశలోనే వెళ్తోందని...

ఏపీలో రెడ్లు తప్ప మరో కులం లేదా..? : ఆర్ఆర్ఆర్

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు జగన్ సర్కార్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం ఒక్క కులం మాత్రమే బాగుపడుతోందని మిగతా అన్ని కులాలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంలో రెడ్ టేపిజం లేదు..రెడ్డియిజం వచ్చిందని...

HOT NEWS

[X] Close
[X] Close