ప్రభుత్వ మోసానికి బలైన అమరావతి రైతులు..! న్యాయం ఎప్పటికి..?

ఓ ప్రభుత్వంలో…
జీవనాధారమైన భూముల్ని.. రాష్ట్రం కోసం..ఇచ్చేశారు వారు.
మరో ప్రభుత్వంలో..
అలా ఇచ్చినందుకు లాఠీదెబ్బలు.. కేసులు.. మానసిక వేధింపులు ఎదుర్కొంటున్నారు…!
తాము జీవనాధారమైన భూములను ప్రభుత్వానికి ఇచ్చింది విశాల ప్రయోజనాల కోసమే. కానీ ఆ విశాలం .. అందరిలోనూ లేకపోవడంతోనే.. వారు ఇప్పుడు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. 200 రోజుల నుంచి లాఠీ దెబ్బలకు ఓర్చి..కేసుల పాలపడి.. జైలుకెళ్లి.. మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వమే మోసం చేస్తే.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక న్యాయపోరాటం చేస్తున్నారు. అయితే.. మొక్కవోని పట్టుదలతో ఉద్యమం మాత్రం చేస్తున్నారు. ఆ ఉద్యమానికి నేటికి 200 రోజులు.

ప్రతిపక్షనేతగా జగన్ అంగీకరించారు. అమరావతే రాజధాని అని ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు. దాంతో.. రాజధాని మార్పు అనేది ఉంటుందని ఎవరూ అనుకోలేదు. కానీ.. జగన్ అన్నింటినీ మర్చిపోయారు. ఎవరేమనుకున్నా.. అమరావతిని నిర్వీర్యం చేయాలనుకున్నారు. ఫలితంగా ఉద్యమం ప్రారంభమయింది. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పటి నుండి రాజధాని అమరావతి నిర్మాణం కోసం 34 వేల ఎకరాలు భూములిచ్చిన 29 గ్రామాల రైతులు రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ చేస్తోన్న ఉద్యమం శనివారానికి 200 రోజులు. అమరావతి ఉద్యమానికి మద్ధతుగా దేశ,విదేశాల్లోని 200 నగరాల్లో ఎన్నారైలు శనివారం ‘వెలుగు పూల’ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. అమరావతి ఉద్యమాన్ని నిర్వహిస్తున్న రైతులు, రైతు కూలీలు, మహిళలు శనివారం 29 గ్రామాల్లో తమ నివాసాల్లోనే ఉండి ఉద్యమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. వీరికి మద్ధతుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో దీక్షకు కూర్చుంటారు.

రాజధాని ఉద్యమానికి మద్ధతుగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో వెబ్ నార్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో జాతీయస్థాయిలో అనేకమంది నేతలు, ప్రముఖులు రైతులనుద్ధేశించి ప్రసంగించనున్నారు. జేఏసీ కన్వీనర్ శివారెడ్డి, జేఏసీ గౌరవ చైర్మన్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి, చంద్రబాబునాయుడు, సీతారాం ఏచూరి, డి.రాజా, మనోజ్ భట్టాచార్య, ఫార్వడ్ బ్లాక్ కార్యదర్శి దేవదత్త బిశ్వాస్, ఆరెస్సెస్ అధికార ప్రతినిధి రతన్ షెర్డా, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు, మాజీ ఎంపీ సబ్బం హరి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.తులసిరెడ్డితో పాటు.. అనేక మంది జాతీయ స్థాయి నేతలు.. ఈ వెబినార్‌లో పాల్గొని తమ మద్దతును అమరావతి ప్రజలకు తెలియచేస్తారు.

అమరావతి మార్పు నిర్ణయాన్ని… దేశంలో .. ఏ ఒక్కరూ సమర్థించలేదు. అందరూ తుగ్లక్ నిర్ణయంగానే అభివర్ణించారు. కానీ ఏపీలో మాత్రమే. .. ప్రజల కుల , మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడంతో… పాలకులు తాము అనుకున్నట్లుగా చేయగలమనే నమ్మకాన్ని పెంచుకున్నారు. అంతా ఓ ప్రాంతానికే దోచి పెడుతున్నారని ఇతర ప్రాంతాల్లో చిచ్చు పెట్టిన పాలకులు… ఏ ప్రాంతానికి న్యాయం చేయలేకపోతున్నారన్న విషయాన్ని ప్రజలు గుర్తించడం లేదు. అలా గుర్తించిన రోజున అమరావతి ఉద్యమం.. విస్తృతం అవుతుంది. ఆ రోజు కోసం ఎదురూ అమరావతి రైతులు ఎదురు చూడాలి.. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

3 రాజధానులకు 16నే ముహుర్తం..! ప్రధానికి ఆహ్వానం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్లుగానే మూడు రాజధానుల శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆహ్వానించింది. ప్రభుత్వం తరపున రాజధాని తరలింపు వ్యవహారాలన్నీ పర్యవేక్షిస్తున్న సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఈ మేరకు.. కేంద్ర ప్రభుత్వానికి...

మంటల్లో బెజవాడ కోవిడ్ ఆస్పత్రి..! రోగుల ప్రాణాలు పణం..!

మొన్న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో కోవిడ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగి. రోగులు మరణించిన విషయం కలకలం రేపింది. ఇప్పుడు అలాంటి ఘటనే ఏపీలో జరిగింది. విజయవాడలో.. కోవిడ్ చికిత్స ఆస్పత్రిగా వినియోగిస్తున్న స్వర్ణా...

ఆర్కే పలుకు : జగన్‌ మెడకు ఈశ్వరయ్యను చుడుతున్న ఆర్కే..!

న్యాయవ్యవస్థపై జగన్ చేస్తున్న దాడిని తనదైన శైలిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు... ఆంధ్రజ్యోతి ఆర్కే చేస్తున్న ప్రయత్నానికి మాజీ హైకోర్టు న్యాయమూర్తి ఈశ్వరయ్య ఆయుధాన్ని అందించారు. జస్టిస్ నరసింహారెడ్డిపై పోరాటం చేస్తున్న దళిత జడ్జి...

50మంది అతిథులు.. 200 కుటుంబాల‌కు లైవ్‌లో

రానా - మిహిక‌ల పెళ్లి అత్యంత సింపుల్‌గా, ప‌రిమిత‌మైన బంధుమిత్రుల స‌మ‌క్షంలో, క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య జ‌రిగిపోయింది. కొద్దిసేప‌టి క్రిత‌మే.. జిల‌క‌ర్ర - బెల్లం తంతు ముగిసింది. ఇప్పుడు రానా - మిహిక‌లు...

HOT NEWS

[X] Close
[X] Close