లొంగిపోయిన మీడియానే తెలంగాణ ప్రజలకు శాపం..!

ప్రజాస్వామ్యంలో మీడియానే నిఖార్సయిన ప్రతిపక్షం. ఆ ప్రతిపక్షం కూడా పాలకులకు లొంగిపోతే జరిగేది ప్రజలకు నష్టమే. ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా పని చేస్తామని చెప్పుకునే పత్రికలు..మీడియా ప్రభుత్వాలకు లొంగి పోవడం వల్ల… ఇప్పుడు తెలంగాణ ప్రజలు ముప్పులో పడ్డారు. పాలనలో జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపి…ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని మరింత జాగ్రత్తగా మసలుకోవాలని హెచ్చరించాల్సిన మీడియా ఇప్పుడు అడుగులకు మడుగులొత్తుతోంది. ఫలితంగా తెలంగాణ సమాజానికి ఎన్నడూ జరగనంత నష్టం జరగుతోంది.

కరోనాపై సర్కార్‌ను హెచ్చరించిన మీడియా ఉందా..!?

తెలంగాణ ప్రజలు ఇప్పుడు ముప్పులో పడ్డారు. ఆ విషయం స్పష్టం. అరకొరగా చేస్తున్న టెస్టుల్లోనే వందలు.. వేల కేసులు నమోదవుతున్నాయి. నిన్నటికి నిన్న ఐదు వేల టెస్టులు చేస్తే.. రెండు వేల పాజిటివ్ కేసులు బయటపడ్డాయంటే.. పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో.. అంచనా వేయడం కష్టమేం కాదు. అంటే.. తెలంగాణ సమాజంలో సగం మందికి వైరస్ సోకినట్లే. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది..?. పాలకుడు.. వైరస్‌ను.. తొక్కి పడేస్తాం అన్నప్పుడు నవ్వి… తెలంగాణకు రానే రాదన్నప్పుడు సమర్థించి… కలిసి జీవించాల్సిందేనన్నప్పుడు నిజమే అని చిడతలు వేసిన మీడియా వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పెను విపత్తులా మారిన కరోనాపై ప్రభుత్వం మొదటి నుంచి నిర్లక్ష్యమే ప్రదర్శిస్తోంది. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ.. తప్పు చేస్తున్నారు.. అని పాలకులకు ఎత్తి చూపడానికి మీడియాకు ధైర్యం సరిపోలేదు. ఆయన జోకులేస్తే నవ్వి.. కోపగించుకుంటూ.. సైలెంటయి.. మనగడ సాగిస్తోంది. ఫలితంగా ఇప్పుడు ప్రజలు కరోనా కాటుకు గురవుతున్నారు.

మీడియా బలంగా ఉంటే కేసీఆర్ సర్కార్ ఇంత నిర్లక్ష్యంగా ఉండేదా..?

ప్రభుత్వాలకు ఎప్పుడూ ఒక్కటే భయం ఉంటుంది. అది రాజకీయంగా ఎదుర్కునే ప్రతిపక్షం కాదు. ప్రతిపక్షం ఎప్పుడూ రాజకీయ విమర్శలే చేస్తూ ఉంటుంది. కానీ అసలు భయపడేది.. నిజమైన ప్రతిపక్షం పత్రికలే. ఆ పత్రికలే ప్రజల తరపున ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా చేయాలి. చేస్తున్న పనుల్లో లోపాల్ని ఎత్తి చూపి.. వాటి వల్ల .. ప్రజలకు నష్టం జరగబోతోందని.. గుర్తించేలా చేసి.. తప్పులు దిద్దుకునేలా చేయాలి. పాలకులు తప్పు చేస్తే.. ప్రజల ముందు పెట్టాలి. కానీ ఇవేవీ ఇప్పుడు తెలంగాణ మీడియాలో లేవు. తెలంగాణ సర్కార్ టెస్టులు చేయకపోయినా… మీడియా కిక్కురుమనలేదు. గాంధీ ఆస్పత్రిలో మృతదేహాలకు దిక‌్కు దివాణం లేకపోయినా అడిగేవారు లేరు. నడి రోడ్డుపై కరోనా పేషంట్లు ప్రాణాలు కోల్పోతున్నా… అద్భుతమైన తెలంగాణ సర్కార్ పనితీరు అంటూ ప్రశంసించారే కానీ… తప్పు చేస్తున్నారు సార్… అని ఒక్కరంటే.. ఒక్క మీడియా చెప్పడానికి సిద్ధపడలేకపోయింది.

కొన్ని మీడియా సంస్థలకు భయం.. మరికొన్ని సంస్థలు గుప్పిట్లోకి..!

స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ ప్రజలకు స్వేచ్చ లభించింది కానీ… ఓ రకమైన నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఆ విషయం మీడియాను చూస్తేనే తెలిసిపోతుంది. కొన్ని మీడియాలు.. ప్రభఉత్వ పెద్దల గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. మరికొన్ని మీడియాలకు.. వెనుక తమ వ్యాపారాలు లగేజీగా మారాయి. ప్రభుత్వాన్ని ఏమైనా అంటే.. తమ ఇతర వ్యాపారాలకు దెబ్బ అవుతుందేమో.. అన్న భయంతో.. కర్ర విరగకూడదు.. పాము చావకూడదు అన్నట్లుగా నడుపుకు వస్తున్నాయి. ఫలితంగా ఇప్పుడు … తెలంగాణలో మీడియా నిర్వీర్యం అయిపోయింది. ప్రజల తరపున పోరాడే పరిస్థితి లేదు. అదే ఇప్పుడు ప్రజలకు పెనుశాపంగా మారుతోంది.

పాలకుల బెదిరింపులను ఎదుర్కొనే ఐక్యత కూడా లేదు..!

నిజానికి మీడియా యాజమాన్యమే కాదు.. జర్నలిస్టులు కూడా లొంగిపోయారన్నది అందరికీ తెలిసిన నిజమే. అయితే.. కొంత మంది మాత్రం ఇప్పటికీ.. ప్రజల తరపున.. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపేందుకు సిద్ధంగానే ఉన్నారు. కానీ.. అలాంటి వారికి ఇతర మీడియా సంఘిభావం చెప్పడం లేదు. సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్లలో మీడియాపై తిట్ల దండకం ఎత్తుకుంటారు. ఏ పేపర్ వయ్యా మీది అని.. అడిగి మరీ విమర్శిస్తారు. అలాంటి సమయంలో… ఒక్క జర్నలిస్టు కూడా నోరు మెదపరు. గతంలో అయితే.. పత్రికా సమావేశాలను బహిష్కరించేవారు. ఇప్పుడు పాలకుడు తిట్టడమే తమకు గొప్ప సర్టిఫికెట్‌గా భావించుకునే పరిస్థితులు వచ్చాయి. ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు.. కరోనా నిర్లక్ష్యం గురించి.. పీపీఈ కిట్ల గురించి రాస్తే… కేసీఆర్ ఎంత దారుణంగా విమర్శించారో అందరికీ తెలుసు. తర్వాత రాధాకృష్ణ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చినా… ఎక్కడా మద్దతు లభించకపోవడంతో.. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారేమో కానీ.. తర్వాత సైలెంటయినట్లుగానే కనిపిస్తోంది.

మొత్తంగా… తెలంగాణ ప్రజలకు అత్యధిక ద్రోహం చేస్తున్నది.. రాజకీయ నేతలు… పాలకులు.. ప్రతిపక్షాలు కాదు. ప్రజాస్వామ్యం ఫోర్త్ ఎస్టేట్‌గా చెప్పుకుని.. తన బాధ్యతల విషయంలో.. ఘోరమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న మీడియానే. కరోనా విషయంలో ప్రతి కేసుకు.. ప్రతీ మరణానికి… మీడియా కూడా ఓ కారణమే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

3 రాజధానులకు 16నే ముహుర్తం..! ప్రధానికి ఆహ్వానం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్లుగానే మూడు రాజధానుల శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆహ్వానించింది. ప్రభుత్వం తరపున రాజధాని తరలింపు వ్యవహారాలన్నీ పర్యవేక్షిస్తున్న సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఈ మేరకు.. కేంద్ర ప్రభుత్వానికి...

మంటల్లో బెజవాడ కోవిడ్ ఆస్పత్రి..! రోగుల ప్రాణాలు పణం..!

మొన్న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో కోవిడ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగి. రోగులు మరణించిన విషయం కలకలం రేపింది. ఇప్పుడు అలాంటి ఘటనే ఏపీలో జరిగింది. విజయవాడలో.. కోవిడ్ చికిత్స ఆస్పత్రిగా వినియోగిస్తున్న స్వర్ణా...

ఆర్కే పలుకు : జగన్‌ మెడకు ఈశ్వరయ్యను చుడుతున్న ఆర్కే..!

న్యాయవ్యవస్థపై జగన్ చేస్తున్న దాడిని తనదైన శైలిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు... ఆంధ్రజ్యోతి ఆర్కే చేస్తున్న ప్రయత్నానికి మాజీ హైకోర్టు న్యాయమూర్తి ఈశ్వరయ్య ఆయుధాన్ని అందించారు. జస్టిస్ నరసింహారెడ్డిపై పోరాటం చేస్తున్న దళిత జడ్జి...

50మంది అతిథులు.. 200 కుటుంబాల‌కు లైవ్‌లో

రానా - మిహిక‌ల పెళ్లి అత్యంత సింపుల్‌గా, ప‌రిమిత‌మైన బంధుమిత్రుల స‌మ‌క్షంలో, క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య జ‌రిగిపోయింది. కొద్దిసేప‌టి క్రిత‌మే.. జిల‌క‌ర్ర - బెల్లం తంతు ముగిసింది. ఇప్పుడు రానా - మిహిక‌లు...

HOT NEWS

[X] Close
[X] Close