జర్నలిస్టుల కోసం మీరేం చేశారని ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావును జర్నలిస్టులు అడిగితే…. సమాధానం చెప్పుకోలేక తాను చేత కాని వాడ్నని ఒప్పుకున్నారు. నిలదీస్తున్న జర్నలిస్టులకు చెప్పేందుకు సమాధానం లేక.. తప్పించుకునేందుకు.. తాను తెలివిగా చెప్పానని ఆయన అనుకున్నారేమో కానీ.. అలా ఒప్పుకున్నా ఇంక ఆయన ఆ పదవిలో ఉండటం ఎందకన్న ప్రశ్న అందరిలోనూ వస్తోంది.
తనకు ప్రభుత్వం పదవి ఇచ్చింది కాబట్టి తాను అంతే మాట్లాడతానని కొమ్మినేని వితండవాదం చేశారు. ఈ ప్రభుత్వంలో అందరూ అంతే ఉన్నారు. ఎవరైనా నిలదీస్తే చేతకాదని అంటున్నారు. సీపీఎస్ రద్దు దగ్గర్నుంచి సన్నబియ్యం వరకూ అంతే. అంత చేతకానప్పుడు అన్ని మాటలు చెప్పి పదవిలోకి ఎందుకు వచ్చారు..? చేతకాదని తెలిసినప్పుడు ఎందుకు పదవి నుంచి దిగిపోరు అన్నది మాత్రం ఎవరికీ అర్థం కాదు. తమ చేతకాదు అని చెప్పుకోవడం… గొప్ప అచీవ్ మెంట్లాగా చెప్పుకుంటున్నారు.
అసలు కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్టులకు దొరికింది కందుకూరులో. అక్కడ తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి రాజకీయ విమర్సలు చేసేదుకు ఆయనకు టాస్క్ ఇచ్చారు. ఆయన వచ్చారు. ఆయన వస్తారని జర్నలిస్టులు కవర్ చేయాలని మీడియాకు సమాచారం ఇచ్చారు. కానీ వచ్చిన వారంతా ఆయనను ప్రెస్ అకాడమీ చైర్మన్ గానే చూసి… సమస్యలపై నిలదీశారు.
ఏపీలో జర్నలిస్టులు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నానా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం కేటాయించి నస్థలాలు, ఇళ్లనూ ఇవ్వడం లేదు. కోవిడ్ సమయంలో మరణించిన వారికి రూ. ఐదు లక్షలు ఇస్తామని జీవో ఇచ్చి ప్రచారం చేసుకున్నారు. కానీ పైసా ఇవ్వలేదు. అక్రిడేషన్లు కూడా ఇష్టం వచ్చిన వారికి ఇస్తున్నారు. ఇలా జర్నలిస్టులను రాచి రంపాన పెడుతున్నారు. ఈ ఆగ్రహం కొమ్మినేనిపై కందుకూరులో చూపించారు. దీంతో ఆయన చేతకాని వాడ్నని.. తమ ప్రభుత్వం చేతకానిదని చెప్పి తప్పించుకున్నారు