కోన వెంక‌ట్ రూ.50 కోట్ల ఆశ‌

ఈ రోజుల్లో ఏ సినిమాలో ఎంత స‌త్తా ఉందో ముందే ఊహించ‌డం క‌ష్టం. టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలు వంద కోట్లు దాటేసి బాక్సాఫీసుని ఆశ్చర్య‌ప‌రుస్తున్నాయి. అందుకే త‌మ సినిమాల‌కు వంద కోట్లు, రూ.50 కోట్లు రావాల‌ని కోరుకోవ‌డం పెద్ద విచిత్ర‌మేం కాదు. కాక‌పోతే.. ఆల్రెడీ విడుద‌లై, ఫ్లాప్ టాక్ తెచ్చుకొన్న సినిమా రూ.50 కోట్లు కొట్టాల‌ని క‌ల‌క‌న‌డం… అత్యాసే.

కోన వెంక‌ట్ నిర్మాత‌గా రూపొందిన సినిమా ‘గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది’. అంజ‌లికి ఇది 50 సినిమా. గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి రోజే ఫ్లాప్ టాక్ మూట‌గ‌ట్టుకొంది. రివ్యూల‌న్నీ ఈ సినిమాకి నెగిటీవ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చాయి. వ‌సూళ్లూ అంతంత మాత్ర‌మే. అయితే ఈ సినిమా అంజ‌లి కోస‌మైనా రూ.50 కోట్లు కొట్లాల‌ని నిర్మాత‌గా కోన వెంక‌ట్ ఆశ ప‌డుతున్నారు. ఎందుకంటే ఇది అంజ‌లికి 50వ సినిమా. సెంటిమెంట్ గా రూ.50 కోట్లు వ‌స్తే అంకెలు మ్యాచ్ అవుతాయ‌న్న‌ది కోన‌.. భావ‌న‌. మౌత్ టాక్ బాగానే ఉన్నా గురువారం థియేట‌ర్‌లో ప్రేక్ష‌కులు క‌నిపించ‌లేదు. శుక్ర‌వారం కూడా ఇదే ప‌రిస్థితి. ఈ సినిమా పెట్టుబ‌డి తిరిగి వ‌స్తే అదే ప‌ది వేలు.. కోన లెక్క‌ల్లో రూ.50 కోట్లు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close