కోన వెంక‌ట్ గాలి తీసేసిన వైఎస్సార్‌

కోన వెంక‌ట్ వైకాపా సానుభూతి ప‌రుడు. జ‌గ‌న్ కి ఓ ర‌కంగా భక్తుడు. ఆప్రేమ వైఎస్సార్ నుంచే వ‌చ్చింది. వీలున్న‌ప్పుడ‌ల్లా ఆయ‌న గొప్ప‌ద‌నాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాడు కోన వెంక‌ట్. ఈ రోజు వైఎస్సార్ జ‌యంతి. ఈ సంద‌ర్భంగా వైఎస్సార్‌తో త‌న జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నాడు కోన‌.

ఓసారి కోన వెంక‌ట్ చైన్నై నుంచి హైద‌రాబాద్ వ‌స్తుంటే ఫ్లైట్ లో వైఎస్సార్ క‌నిపించార్ట‌. కోన‌ని గుర్తు ప‌ట్టి.. ద‌గ్గ‌ర‌కు ర‌మ్మ‌న్నార్ట‌. ‘ఈమ‌ధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది. అంటే నీ కెరీర్ బాగుంద‌న్న‌మాట‌’ అనే స‌రికి కోన‌లో ఎక్క‌డ లేని ఉత్సాహం, ఆనందం పొంగుకొచ్చాయట‌. ‘నువ్వు మా ఇంటికి ఓసారి రావాలి. మా మేన‌ల్లుడు ఒక‌డున్నాడు. త‌న‌కు థియేట‌ర్లున్నాయి.. సినిమాలు తీస్తానంటున్నాడు’ అనేస‌రికి త‌న ద‌గ్గ‌రున్న క‌థ‌లు అడుగుతున్నారేమో అని ఇంకాస్త సంబ‌ర ప‌డ్డాడ‌ట‌. త‌ప్ప‌కుండా వ‌స్తా సార్‌.. అని ఆనందంగా చెబితే.. ‘నువ్వు రావాలి.. వాడితో సినిమాలు తీయాల‌న్న ఆలోచ‌న మాన్పించాలి. నువ్వు కూడా ఓ సినిమా తీసి న‌ష్ట‌పోయావు క‌దా’ అని అనేస‌రికి.. కోన గాలి మొత్తం తీసేసిన‌ట్టైంద‌ట‌. కోన వెంట‌క్ నిర్మాత‌గా చేసిన తొలి ప్ర‌య‌త్నం ‘తోక లేని పిట్ట‌’. ఆ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయి కోన జీవితం మొత్తం త‌ల్ల‌కిందులైపోయింది. ఆ సినిమా ఓపెనింగ్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేతుల మీదుగానే జ‌రిగింది. అదంతా గుర్తు పెట్టుకుని, ఇప్పుడు కోన‌ని పిలిచి – త‌న మేన‌ల్లుడిని గాడిన పెట్ట‌మ‌ని అడిగార‌న్న‌మాట‌. ఈ విష‌యాన్ని కోన వెంక‌ట్‌.. త‌న ఎఫ్ బీలో గుర్తు చేసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం అవసరం  : రామ్మాధవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని..  దాన్ని భర్తీ చేయాలని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రామ్‌మాధవ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోము వీర్రాజు.. ఏపీ  బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు...

చిరు మాస్టర్ ప్లాన్

ఆచార్య త‌ర‌వాత‌.. భారీ లైన‌ప్ అట్టి పెట్టుకున్నాడు చిరంజీవి. ఓ వైపు బాబీకి ఓకే చెప్పిన చిరు, మ‌రోవైపు మెహ‌ర్ ర‌మేష్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇంకోవైపు వినాయ‌క్ తో సినిమా చేయ‌డానికి...

అఖిల్ – సురేంద‌ర్ రెడ్డి ఫిక్స్

`సైరా` త‌ర‌వాత సురేంద‌ర్ రెడ్డి ప్రాజెక్టు ఎవ‌రితో అన్న విష‌యంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. అగ్ర హీరోలంతా బిజీ బిజీగా ఉండ‌డంతో.. సురేంద‌ర్ రెడ్డికి అనుకోని విరామం తీసుకోవాల్సివ‌చ్చింది. కొంత‌మంది కోసం క‌థ‌లు సిద్ధం...

సచివాలయం గాయబ్..!

దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్ర పాలనా కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న భవనాలు నేలమట్టం అయ్యాయి. మొత్తం పదకొండు భవనాలను నామరూపాల్లేకుండా తొలగించేశారు. శరవేగంగా ఇరవై ఐదు...

HOT NEWS

[X] Close
[X] Close