‘శంకరాభరణం’లో శ్రీను వైట్లపై పంచ్‌లు: కసి తీర్చుకున్న కోన

హైదరాబాద్: ఎవరి మీదైనా కోపం ఉంటే తన తదుపరి చిత్రంలో వారిపై సెటైర్ పెట్టి శ్రీను వైట్ల కసి తీర్చుకోవటం తెలిసిందే. సంగీత దర్శకుడు చక్రిమీద, ప్రకాష్‌రాజ్‌మీద, రాంగోపాల్ వర్మ మీద, బాలకృష్ణమీద ఆయన తన సినిమాలలో వేసిన సెటైర్లు అందరికీ తెలిసినవే. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. శ్రీను వైట్లపైనే పంచ్‌లు పడ్డాయి. రచయిత కోన వెంకట్ తన తాజా చిత్రం శంకరాభరణంలో ఎడా పెడా పంచ్‌లు వేసి శ్రీను వైట్లపై కసి తీర్చుకున్నారు.

శంకరాభరణంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఫేమ్ పృథ్వి పాత్రతో – “ఆవును పిండితే పాలిస్తుంది, ఆర్టిస్టును పిండితే పర్ఫార్మెన్స్ ఇస్తాడు, మా దర్శకులం ఆర్టిస్టులనుంచి నటనను పిండుకుంటాం. ఆ పనిలో ఇంట్లో పెళ్ళాలను కూడా మర్చిపోతాం” అనే డైలాగ్ చెప్పించారు. శ్రీను వైట్లకు, ఆయన భార్య రూపకు ఇటీవల విభేదాలు రావటం, భర్త కొడుతున్నాడంటూ ఆమె పోలీస్ కేసు పెట్టటం తెలిసిందే. దానిమీదే ఈ సెటైర్ వేసినట్లు కనబడుతోంది. మరోవైపు నటుడి గిరి ధరించిన పాత్రద్వారా మరో పంచ్ వేయించారు. గిరి పాత్ర బన్నీ వేసుకుని టీలు అమ్ముకుంటూ ఉంటాడు. ఆ పాత్రను, “డైరెక్టర్ గారూ! ఎంతో మంది స్టార్‌లకు హిట్‌లు ఇచ్చిన మీరేంటి ఇలా టీలు అమ్ముకుంటున్నారు” అని అడిగితే, “టైమ్ బాగోకపోతే జాకీ చాన్ అయినా కీ చైన్‌లు అమ్ముకోవాల్సిందే” అని గిరి పాత్ర అంటుంది. శ్రీను వైట్ల టైమ్ ఇప్పుడు బాగోకపోవటంపై ఈ పంచ్ వేసినట్లు కనబడుతోంది. మొత్తం మీద టిట్ ఫర్ ట్యాట్ అయింది.

శ్రీను వైట్లకు, కోన వెంకట్‌కు మధ్య దూకుడు చిత్రం తర్వాత విభేదాలు తలెత్తాయి. అయితే రాంచరణ్ బ్రూస్‌లీ చిత్రంకోసం వీళ్ళను కలిపారు. అయితే ఆ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దానికి కారణం తాను రాసిచ్చిన సీన్లను ఇష్టమొచ్చినట్లు మార్చటమేనని కోన మండిపడ్డారు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, బ్రూస్‌లీ విషయంలో శ్రీనువైట్లపై ఎమోషనల్ అయిన మాట నిజమేనని, అయితే రు.10 కోట్ల పరువు నష్టం దావా వేయాలని యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలు అబద్ధమని అన్నారు. ఆ గొడవలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే కసినంతా ఇలా సినిమా తీర్చుకున్నట్లు ఇవాళ బయటపడింది. మరోవైపు శంకరాభరణం చిత్రంలో తనపై వేసిన సెటైర్‌లపై శ్రీను వైట్ల ఫిర్యాదు చేసినట్లు వార్తలొస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ సలహాదారులు కి కనీస అవగాహన లేదా ?

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్ తొలగింపు వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యలో ప్రతిపక్షపార్టీల నేతలు..జగన్మోహన్ రెడ్డి రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగ విరుద్దంగా ఆర్డినెన్స్ ఇచ్చి... రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని.. పదవిలో ఉండే అర్హత...

దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణ ప్రజలకు తీపి కబురు: కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు త్వరలో ఓ తీపి కబురు చెబుతానని ప్రకటించారు. ఈ మాట ఆయన మామూలుగా చెప్పలేదు. దానికో విశేషణం జోడించారు. అదేమిటంటే.. తాను చెప్పబోయే తీపి కబురు...

బాల‌య్య ఇష్యూ: కేసీఆర్‌పై నెట్టేశారుగా!

`ఇండ్ర‌స్ట్రీ స‌మావేశాల‌కు న‌న్ను పిల‌వ‌లేదు` అన్న బాల‌య్య మాట - ప‌రిశ్ర‌మ‌లో కొత్త వివాదానికీ, కాంపౌండ్ రాజ‌కీయాల‌కు కేంద్ర బిందువు అయ్యింది. బాల‌య్య‌ని పిల‌వ‌క‌పోవ‌డం త‌ప్పే అని ప‌రిశ్ర‌మ‌లో చాలామంది పెద్ద‌లు తేల్చేస్తున్నారు....

ద‌ర్శ‌కేంద్రుడి ‘కాన్సెప్ట్’ ఏమిటి?

న‌మోః వేంక‌టేశాయ త‌ర‌వాత మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్ట‌లేదు ద‌ర్శ‌కేంద్రుడు. ఆయ‌న సినిమాల‌కు దూరంగానే ఉంటూ వ‌చ్చారు. ద‌ర్శ‌కేంద్రుడు రిటైర్ అయిపోయార‌ని, ఆయ‌న ఇక సినిమాలు చేయ‌ర‌ని వార్త‌లొచ్చాయి. కానీ ఓ మంచి సినిమా...

HOT NEWS

[X] Close
[X] Close