మంత్రి కొండా సురేఖ గతంలో తాను చేసిన వివాదాస్పద, అభ్యంతర వ్యాఖ్యలకు అక్కినేని నాగార్జునకు అర్ధరాత్రి క్షమాపణ చెబుతూ ట్వీట్ చేశారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన సంచలన వివాదంలో తాను చేసిన వ్యాఖ్యలు “అనుకోకుండా” చేసినవని.. అవి నాగార్జున లేదా అతని కుటుంబ సభ్యులకు బాధ కలిగించేలా ఉన్నందున క్షమాపణ చెబుతున్నానన్నారు. ఈ పోస్ట్‌లో మంత్రి తన మాటలు పూర్తిగా. వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు
2024 అక్టోబర్ 1న కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు గుప్పిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమంతనూ ఇందులో ఇన్వాల్వ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై నాగార్జున కోర్టుకెళ్లారు. వంద కోట్ల పరువు నష్టం దాఖలు చేశారు. కేటీఆర్ కూడా పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. విచారణలకు హాజరైన నాగార్జున కుటుంబసభ్యులు, వాంగ్మూలాలు ఇచ్చారు.
కోర్టులో వ్యతిరేకంగా తీర్పు ఇస్తుందన్న కారణంగా కొండా సురేఖ రాత్రికి రాత్రి క్షమాపణలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి కేసుల్లో తప్పు చేసిన వారు క్షమాపణ చెప్పకపోతే .. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లుగా ప్రకటించకపోతే కోర్టు నిర్ణయం ప్రకటిస్తుంది. ఇప్పుడు సురేఖ బేషరతుగా క్షమాపణలు ప్రకటించడం వల్ల నాగార్జున కుటుంబం సంతృప్తి చెంది కేసులో రాజీపడిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు.


