కొత్తపలుకు : జగన్‌కు ఆర్కే సవాల్..!

ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరక్టర్ వేమూరి రాధాకృష్ణ … అనుకున్నట్లుగానే ఈ వారం.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సూటిగా గురిపెట్టారు. తన వారంతాపు ఆర్టికల్ “కొత్త పలుకు”లో.. అవినీతిపై విచారణకు సవాల్ విసిరారు. ఆంధ్రజ్యోతికి కేటాయించిన భూమిని వెనక్కి తీసుకుంటూ.. కేబినెట్ నిర్ణయం తీసుకోవడం.. ఆంధ్రజ్యోతిపై సమాచార, ప్రసారశాఖ మంత్రి పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. రాధాకృష్ణ.. తన వారాంతపు ఆర్టికల్‌లో.. జగన్ ను టార్గెట్ చేస్తారని అందరూ భావించారు. దానికి తగ్గట్లుగానే ఆ భూమి విషయంలో తన వాదన వినిపించిన వేమూరి రాధాకృష్ణ.. జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేశారు. రూ. 43వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లు సీబీఐ నిర్ధారించిన జగన్.. అందరికీ అవినీతి ముద్ర పూయాలనుకోవడం హాస్యాస్పదమన్నారు. తన భూమి విషయంలో ప్రభుత్వం చేసిన ఆరోపణలను నిరూపిస్తే.. ఆ భూమితో పాటు.. దాని కోసం కట్టిన రూ. 50 లక్షలు వదులుకుంటాని సవాల్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి రూ. 43వేల కోట్ల అవినీతికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

ఈ క్రమంలో.. తాను ఎంత సచ్చీలుడినో చెప్పుకునేందుకు వైఎస్ హయాంలో.. తనకు ఇవ్వబోయిన ఓ తాయిలం గురించి ఆర్కే బయట పెట్టారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో.. స్వయంగా జగన్మోహన్ రెడ్డి తన అనుచరులతో.. జూబ్లిహిల్స్‌ చెక్ పోస్ట్ దగ్గర అత్యంత విలువైన స్థలాన్ని ఆంధ్రజ్యోతికి కేటాయించేందుకు సిద్ధమని సమాచారం పంపారట. అయితే.. దానికి కొన్ని షరతులు పెట్టారంటున్నారు. దానికి తాను అంగీకరించలేదని.. అందుకే స్థలం పొందలేదని.. అదే తన నిజాయితీకి గుర్తని.. ఆర్కే చెప్పుకొచ్చారు.

అయితే.. రాధాకృష్ణ.. ఈ అంశాన్ని హైలెట్ చేసినప్పటికీ… మొదట్లో మాత్రం తనది ప్రజాప్రయోజనాల బాణి అని చెప్పేందుకు… రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపైనా విమర్శలు చేశారు. సంక్షేమ పథకాల పేరుతో.. మింగ మెతుకు లేదు కానీ.. మీసాలకు సంపెంగ నూనె తరహాలో.. ప్రజాధనాన్ని పప్పుబెల్లాల్లా పంచి పెడుతున్నారని విమర్శలు గుప్పించారు. అప్పులు చేసి మరీ… ఇలా ప్రజలకు డబ్బులు పంచుతూ పోతే.. ఎదురయ్యే పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బుద్ది జీవులు స్పందించాలని… పిలుపునిచ్చారు.

తాను తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటానన్న విషయాన్ని.. ఆర్టికల్‌లో వేమూరి రాధాకృష్ణ బహిరంగంగా ఒప్పుకున్నారు. తాను.. ఎన్టీఆర్ హయాం నుంచి జర్నలిజంలో ఉన్నానని… అప్పట్లో ఎన్టీఆర్.. ఆ తర్వాత చంద్రబాబు హైదరాబాద్ ను చేసిన అభివృద్ధి.. అమరావతి విషయంలో చంద్రబాబు విజన్…అన్నీ చూడటం వల్ల.. చంద్రబాబు రాజకీయాల కన్నా అభివృద్ధికి పెద్ద పీట వేస్తారని నమ్మడం వల్లే.. పలు సందర్భాల్లో ఆయనకు మద్దతుగా నిలబడినట్లుగా చెప్పుకొచ్చారు. అభివృద్ధి కోసమే.. చంద్రబాబు వెంట ఉన్నట్లుగా.. ఆర్కే స్పష్టం చేశారు. అదే సమయంలో జగన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాజధాని లేని నవ్యాంధ్రకు… అమరావతిలో ఊహించని రీతీలో అభివృద్ధి చేస్తే.. ఆయనకూ మద్దతిస్తామని ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close