“రివర్స్‌”లో మేఘాకు మరో భారీ కాంట్రాక్ట్..!

ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ రివర్స్ స్వీప్ చేసే ప్రయత్నంలో.. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే పోలవరం రివర్స్ టెండర్లను.. ఏకంగా రూ. ఏడు వందల కోట్లకు తక్కువగా వేసి… కేంద్రం నుంచి.. కోర్టు నుంచి పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్న ఆ సంస్థ … ఈ సారి ఎవరి పర్మిషన్ అవసరం లేని ప్రాజెక్ట్‌ను పట్టేసింది. ప్రకాశం జిల్లాలో నిర్మిస్తున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్ -2 పనులను.. మేఘా సంస్థ ఏడు శాతం తక్కువకు పనులు చేసేందుకు రివర్స్ టెండర్లు వేసింది. టన్నెల్-2లో రద్దు చేసిన పని విలువ రూ.553.13 కోట్లు . గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు.. 4.69 శాతం ఎక్సెస్‌ కు టెండర్లు వేశారు.

కానీ కొత్త ప్రభుత్వంలో మేగా మాత్రం రూ. 491 కోట్లకు మాత్రమే పనులు చేసేందుకు ముందుకు వచ్చింది. అంటే.. రూ. 87 కోట్లు ఆదా అయినట్లేనని ప్రభుత్వం ప్రకటించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే… అన్ని ప్రాజెక్టుల పనులను నిలిపివేసింది. అందులో వెలిగొండ టన్నెల్ కూడా ఉంది. ఒక్కొక్క ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తోంది. పోలవరం తర్వాత వెలిగొండ టన్నెల్ పనులకే రివర్స్ టెండర్ నిర్వహించారు. రూ.553.15 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. చివరికి మేఘా సంస్థ విన్నర్ నిలిచింది.

త్వరలో మరిన్ని కీలకమైన ప్రాజెక్టుల రివర్స్ టెండరింగ్ కూడా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. అరవై, డెబ్బై వేల కోట్ల రూపాయల విలువైన పనులు ప్రస్తుతం సాగునీటి రంగంలో జరగనున్నాయి. ఈ క్రమంలో అతి తక్కువకే పనులు చేస్తూ.. రివర్స్ టెండరింగ్‌లో రివర్స్ స్వీప్ చేస్తూ.. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ… కాంట్రాక్టుల చాంపియన్‌గా నిలుస్తోంది. అయితే.. ఐదేళ్ల కిందటి ధరలకే ఇప్పుడు పనులు గిట్టుబాటు కావని.. నిపుణులైన కాంట్రాక్టర్లు చెబుతూంటే… అంత కంటే తక్కువకు ఎలా పనులు చేస్తారనేది.. చాలా మందికి అర్థం కాని మిస్టరీగానే ఉంది. పనులు చేస్తున్నప్పుడో.. పూర్తయిన తర్వాతో.. అసలు విషయం బయటకు వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విశ్వ‌క్ సేన్‌తో బేరం కుదిరింది

త‌మిళ‌ 'ఓ మై క‌ద‌వులే' రీమేకు హ‌క్కులు పీవీపీ ద‌గ్గ‌రున్నాయి. ఈ సినిమాని విశ్వ‌క్‌సేన్‌తో రీమేక్ చేయాల‌న్న‌ది ప్లాన్‌. ఆ విష‌యం ముందే మీడియాకు లీకైంది. య‌ధావిధిగా వార్త‌లొచ్చాయి. అయితే విశ్వ‌క్ మాత్రం...

సచివాలయ కూల్చివేత ఇక ముందుకు సాగుతుందా..!?

తెలంగాణ సచివాలయం కూల్చివేత శరవేగంగా చేపట్టినా.. న్యాయపరమైన చిక్కులు వచ్చి పడ్డాయి. హైకోర్టు సోమవారం వరకూ.. కూల్చివేతలు ఆపాలని ఆదేశించింది. ఆ రోజున విచారణ జరిపి అనుమతి ఇస్తుందా... మరికొంత కాలం పొడిగింపు...

ఏపీ ఆర్టీసీని ఆ అధికారి ముంచేశాడా..!?

ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ను ప్రభుత్వం ఆకస్మాత్‌గా బదలీ చేసేసింది. ఆయనను లూప్ లైన్ పోస్టులోకి.. పంపేసింది. ఆర్టీసీ ఎండీగా ఆయనను నియమించి ఆరు నెలలు మాత్రమే అయింది. ఈ లోపే.. హడావుడిగా.....

ఏపీలో జంబో “అడ్వైజర్స్ కేబినెట్”..! కానీ ఒక్కరే ఆల్ ఇన్ వన్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లాం నుంచి అన్ని శాఖలను ముఖ్యమమంత్రి జగన్ తీసేయడంతో... సలహాదారులపై చర్చ ప్రారంభమయింది. అసలు ఎంత మంది సలహాదారులు ఉన్నారు..? వారి జీతభత్యాలేంటి..? వారి ఎవరికి.. ఏ...

HOT NEWS

[X] Close
[X] Close