ఇట్స్ అఫీషియల్..! “మెగా” ఐటీ సోదాల్లో అడ్డంగా దొరికారు..!

దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా.. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఓ కార్పొరేట్ సంస్థపై ఐటీ, ఈడీ అధికారులు వారం రోజుల పాటు మెగా అపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై పరిధిలో ఉన్న ఆ సంస్థకు చెందిన 30 కార్యాలయాలపై ఏక కాలలో దాడులు చేశారు. తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగు చూడటంతో… ఆ తీగలను లాగి.. డొంకలను కదిలించడానికి చాలా సమయం తీసుకున్నారు. దీంతో.. ఐటీ దాడులు ప్రారంభమైన దాదాపు పది రోజుల తర్వాత.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్సెస్ నుంచి.. ఓ ప్రెస్ నోట్ బయటకు వచ్చింది. అయితే.. ఏ కంపెనీపై దాడి చేసి.. సోదాలు చేశామో చెప్పలేదు కానీ.. ఏమేమి కనిపెట్టామో మాత్రం చాలా సింపుల్‌గా వెల్లడింటారు.

హవాలా లావాదేవీల గుట్టు రట్టు..!

మౌలిక సదుపాయాలు, ఇరిగేషన్, హైడ్రోకార్బన్, పవర్ సెక్టార్లలో ప్రముఖ కంపెనీగా ఉన్న ఆ సంస్థ… వాటితో పాటు.. హవాలాను కూడా.. ఓ భారీ పరిశ్రమ తరహాలో నిర్వహిస్తున్న విషయం .. ఐటీ అధికారుల సోదాల్లో వెల్లడయిది. వందల కోట్లను.. లెక్కా పత్రం లేకుండా తరలిస్తున్న హవాలా మార్గాలను.. ఐటీ అధికారులు.. సోదాల్లో గుర్తించారు. ఇలా .. చెల్లింపులు చేసిన ఖాతాలు… వాటి కి సంబంధించిన మొత్తం గూడుపుఠాణిని గుర్తించారు. వాటన్నింటినీ సీజ్ చేసినట్లుగా ఐటీ అధికారులు చెబుతున్నారు.

పన్నులు ఎగ్గొట్టేందుకు వేసిన వేషాలు అన్నీ ఇన్నీ కావు..!

వేల కోట్ల కాంట్రాక్టులు నిర్వహిస్తున్న ఆ సంస్థ.. హవాలా లావాదేవీలు, పన్నులు ఎగ్గొట్టే మార్గాల కోసం వేసిన వేషాలు అన్నీ ఇన్నీ కావు. ఖర్చు చేయకుండానే చేసినట్లుగా.. పెద్ద ఎత్తున బిల్లులు సృష్టించడం, సబ్ కాంట్రాక్టుల ఖర్చులను… అధికంగా చూపించడం లాంటివి పెద్ద ఎత్తున బయట పెట్టాయి. అలాగే.. ఎలాంటి నమోదిత వివరాలు లేని ఖర్చులు… అత్యధికంగా ఖర్చు పెట్టినా.. ఆ వివరాలను.. బుక్స్ లో మ్యానిపులేట్ చేయడం వంటి అరాచకాలకు పాల్పడ్డారు. మొత్తంగా ఆర్జించిన లాభంపై కట్టాల్సిన పన్నును ఎగ్గొట్టేందుకు … లెక్కలను తారుమారుచేశారు. వీటన్నింటినీ గుర్తించామని ఐటీ, సీబీడీటీ ప్రకటించింది. లెక్కలు తెలియని మరో రూ. 17 కోట్ల 40 లక్షలను కూడా సీజ్ చేసినట్లుగా సీబీడీటీ తెలిపింది.

ఆ కంపెనీ పాలకులకు సన్నిహితులదేనా..?

ఐటీ, సీబీడీటీ అధికారులు… విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఏ కంపెనీ గురించి… చెబుతున్నామో.. వివరించలేదు. అయితే.. హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలలో సోదాలు జరిగాయంటే.. అది కచ్చితంగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఓ ప్రముఖ కాంట్రాక్ట్ సంస్థదేనన్న అంచనాకు ఇండస్ట్రీ వర్గాలు వచ్చాయి. ఆ కంపెనీపైనే.. కొద్ది రోజులుగా సోదాలు జరిగాయి. తదుపరి.. ఐటీ, సీబీడీటీ వర్గాలు తీసుకునే చర్యలను బట్టి… అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ కంపెనీతో… ప్రభుత్వ పెద్దలకు సైతం అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా.. కొన్నాళ్లుగా ప్రచారంలో ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com