న‌వంబ‌ర్ రెండో వారంలో వైభవంగా కోటి దీపోత్స‌వం..!

ఎంతో ప‌విత్ర‌మైన కార్తీక మాసంలో భక్తి టీవీ నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమానికి ఎంతో పేరుందన్న విష‌యం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా న‌రేంద్ర చౌద‌రి ఈ కార్య‌క్ర‌మాన్ని చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్నారు. ఒక సీజ‌న్ లో గంగా న‌దిలో స్నానం చేయ‌డానికి ఎలా వెళ్తారో, అయ్య‌ప్ప స్వాములు ఎలా గుర్తొస్తారో.. కార్తీక మాసం అన‌గానే కోటి దీపోత్స‌వం కూడా భ‌క్తుల‌కు అంతే గుర్తొస్తుంది.

కాంతి జ్ఞానానికి చిహ్న‌మ‌నీ, అందుకే కోటి దీపాల కాంతుల‌తో భ‌గ‌వంతుణ్ణి జ్యోతి రూపంలో ఆరాధిస్తే మ‌న‌తో పాటు మ‌న చుట్టు ప‌క్క‌ల వారికి కూడా ఎంతో మేలు జ‌రుగుతుంద‌నే ఉద్దేశంతో కోటి దీపోత్స‌వాన్ని అంగ‌రంగ వైభవంగా నిర్వ‌హిస్తున్నారు న‌రేంద్ర చౌద‌రి. గ‌తేడాది కోవిడ్ కార‌ణంతో ఎప్పుడూ జ‌రిగే కోటి దీపోత్స‌వానికి బ్రేక్ ప‌డింది. ప‌రిస్థితుల‌న్నీ చ‌క్క‌బ‌డ్డాయి కోటి దీపోత్స‌వానికి ఏమీ ఆటంకం క‌ల‌గ‌దులే అని భ‌క్తులు అనుకునే టైమ్ కు మ‌ళ్లీ సెకండ్ వేవ్ రూపంలో క‌రోనా విజృంభించ‌డం, కోటి దీపోత్స‌వం లేకుండానే కార్తీక మాసం అయిపోవ‌డం అన్నీ జ‌రిగాయి. దీంతో ఈ ఏడాది ఎలా అయినా స‌రే కోటి దీపోత్స‌వాన్ని అంగ‌రంగ వైభ‌వంగా, సాక్షాత్తూ భ‌గ‌వంతుడే భువికి దిగివ‌చ్చాడా అనే రీతిలో ఈ కార్య‌క్ర‌మాన్ని జ‌ర‌పాల‌ని న‌రేంద్ర చౌద‌రి నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే దానికి సంబంధించిన ప‌నుల‌ను కూడా మొద‌లుపెట్టార‌ని, న‌వంబ‌ర్ రెండ‌వ వారంలో కోటి దీపోత్స‌వం మొద‌లుకానుంద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెప్తున్నాయి. అంటే ఇంకో 20 రోజుల్లో కోటి దీపాల వెలుగులు, ఆ దీపాల కంటే ఎక్కువ‌గా ప్ర‌కాశించే ఆడ‌ప‌డుచుల క‌ళ్లతో హైద‌రాబాద్ క‌ళ‌క‌ళ‌లాడ‌నుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close